‘నాయకురాలు నాగమ్మ’ యదార్థ వృత్తాంతంపై ’ ప్రత్యేక కథనం.
అధికార దాహంతో అన్యాయంగా హత్యలు చేసిన బ్రహ్మనాయుకుడు, బాలచంవూదులనే సీమాంవూధులు పల్నాటి వీరులుగా ప్రచారంలోకి తెచ్చారన్న సత్యం చరివూతను తవ్వితే కానీ తేటతెల్లం కాదు. సుమారు వెయ్యేళ్ల కిందట యావత్ భరత ఖండంలోనే తొలి మహామంవూతిణిగా వెలుగొందిన వీరనారి మన నాగమ్మ. కొందరు చరివూతవూదోహుల పుణ్యమా అని ఆమె ఒక యుద్ధోన్మాదిగా ప్రపంచానికి పరిచయం కావడం బాధాకరం. నాగమ్మ- బ్రహ్మనాయుడుల మధ్య జరిగిన పోరాట నేపథ్యం తెలిస్తే అసలు ద్రోహులు బయటపడతారు.
నాగమ్మ పుట్టినిల్లు కరీంనగర్ జిల్లాలోని పెగడపల్లి మండలం ఆర అక్కడ ఇప్పటికీ ఒక ఇంటిని నాగమ్మ గుడిగా స్థానికులు భావిస్తారు. ఆమె వారి గుండెల్లో కొలువుదీరి ఒక గ్రామదేవతలా నిత్యపూజలందుకుంటుంటే చిత్రంగా ఆమె మెట్టినింటి ఆంధ్రాలో తననొక యుద్ధోన్మాదిలా భావించే పరిస్థితులు ఉన్నాయి. సీమాంవూధులు రాసిన చరిత్ర పుస్తకాల్లోనేకాదు, వారు తీసిన సినిమాల్లోనూ నాగమ్మ వ్యక్తిత్వాన్ని వారు ఇదేలా అవమానించారు. ఏకంగా ఓ రక్తం రుచి మరిగిన రాక్షసిలా చిత్రీకరించారు. ఎందుకిలా జరిగింది..? తెలంగాణ దైవం ఆంధ్రాలో దెయ్యంలా ఎందుకు మారిపోయింది? కట్టు కథే చెలామణి అయి, అసలు చరిత్ర ఎందుకు మరుగునపడి పోయింది? చర్రిత లోతుల్లోకి వెళితే అసలైన, ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.
అది 12వ శతాబ్దం...
క్రీ.శ. 1176-2 మధ్య కాలం (12వ శతాబ్ది)లో జరిగినట్లుగా భావిస్తున్న ‘పల్నాటియుద్ధం’ గురించి తెలియని వారుండరు. సినిమాల పుణ్యమాని అది మరింత జనంలోకి వెళ్లింది. కానీ, అందులో నాగమ్మ, వ్యక్తిత్వం గురించిన వక్రీకరణలే అభ్యంతరకరంగా ఉన్నాయి.
ఆ యుద్ధంలో నిజానికి అసలైన విజేత మన నాయకురాలు నాగమ్మ. ఇది చారివూతక సత్యం. ఈ మానవతా మూర్తిది కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం ఆర అసలు నాగమ్మ ఆర నుంచి పల్నాడు చేరడమే ఒక విశేషమైతే, తన అసాధారణ ప్రతిభా పాటవాలతో అక్కడి రాజాస్థానంలో మంత్రి కావడం, ప్రజారంజకంగా పరిపాలించి, తన జీవితాంతం శాంతి కోసం పరితపించడం, చివరకు సర్వం త్యజించి, తన మూలాలు వెతుక్కుంటూ పుట్టినూరికే చేరుకోవడం, స్థానికుల దృష్టిలో ఒక ‘దేవత’లా పూజలందుకోవడం- ఇవన్నీ కనుమరుగై ఉన్న కఠిన సత్యాలు.
ఆమె వాస్తవ కథను కొందరు సీమాంధ్ర కవులు, రచయితలు, చరివూతకారులు వక్రీకరించడమే అసలు విషాదం. నమ్ముకున్న ప్రజలకు ప్రేమామృతం పంచిన మానవతామూర్తి నాగమ్మను యుద్ధోన్మాదిలా చిత్రీకరించడం వెనుక పెద్ద కుట్రే జరిగిందన్న విమర్శలు వున్నాయి. నాడు సైతం రాజ్యమేలిన ప్రాంతీయ విద్వేషమే నాగమ్మను దుర్మార్గురాలిగా చిత్రీకరించేందుకు కారణమైందనిపిస్తోంది. దీనికి పురుషాధిక్య భావజాలమూ తోడైందని పరిశీలకులు అంటున్నారు.
నాటి పల్నాడులో ఏం జరిగింది?
నాగమ్మ నాయకురాలుగా ఎదగడానికి ముందు మన తెలంగాణలో పుట్టిన ఒక సాధారణ రైతు ఆడబిడ్డ. ప్రస్తుత కరీంనగర్ జిల్లాలోని ఆర ఆమె జన్మించింది. తండ్రి రామిడ్డి. నాగమ్మ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. దీంతో కరువు కాటకాల కారణంగా రామిడ్డి తన ఏడేళ్ల కూతురు నాగమ్మను తీసుకొని పల్నాడు (నేటి గుంటూరు జిల్లా) రాజ్యంలోని జిట్టగామాలపాడులోని తన బావమరది మేకపోతు జగ్గాడ్డి వద్దకు వలస వెళ్లాడు. అక్కడే భూములు కొని మోతుబరి రైతుగా స్థిరపడ్డాడు. తన దాతృత్వగుణంతో అతను చుట్టు పక్కల గ్రామాల్లో మంచి పేరు సంపాదించాడు. తన ఏకైక కూతురు నాగమ్మను కొడుకులా చూసుకుంటూ గోపన్న అనే గురువును నియమించి, చదువుతో పాటు గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, ధనుర్విద్యలో శిక్షణ ఇప్పించాడు.
నాగమ్మ తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. తత్త్వ, రాజనీతి శాస్త్రాలను అధ్యయనం చేసింది. అనంతరం ఆమెను జగ్గాడ్డి కొడుకు సింగాడ్డికిచ్చి పెళ్లి చేయగా, మూడు రోజులకే భర్త మృత్యువాత పడ్డాడు. ఆ సమయంలో పల్నాడును అనుగురాజు పరిపాలిస్తున్నాడు. ఆయన మంత్రి దొడ్డనాయుడు. పల్నాడులో రాజులు నామమావూతులు, కాగా పరిపాలనంతా మంత్రుల కనుసన్నల్లో, వారి ఆదేశానుసారం జరిగేది.
ఈ క్రమంలో రామిడ్డి పొలంలో దొడ్డనాయుడు అక్రమంగా చెరువు నిర్మాణం తలపెడ్తాడు. ఈ ప్రయత్నాన్ని రామిడ్డి, జగ్గాడ్డి అడ్డుకోగా అప్పుడు జరిగిన ఘర్షణలో జగ్గాడ్డి ప్రాణాలు కోల్పోయాడు. వారు అంతటితో ఊరుకుంటే పోయేది. కానీ, అలాకాక ఇంకా ఆగ్రహం అణచుకోలేక దొడ్డనాయుడి రెండో కొడుకు బ్రహ్మనాయుడు రామిడ్డిని సైతం కిరాతకంగా హతమారుస్తాడు. ఇలా యుక్తవయస్సు నాటికే తండ్రినీ, నిలువ నీడ నిచ్చిన మేనమామను, (అప్పటికే) భర్తను కోల్పోయిన నాగమ్మ గుండెను రాయి చేసుకుని బతుకీడ్చింది.
స్థానికుల తలలో నాలుకలా మెలగుతూ, వారి మధ్య తగాదాలు పరిష్కరిస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందింది. ఓ రోజు నల్లమల అడవుల్లో వేటకు వెళ్లిన అనుగురాజు, ఆయన సేన, పరివారం తిరుగు పయనమైనారు. నాగమ్మ వారికి స్వయంగా జిట్టగామాలపాడులో సేద దీరేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. తాగునీరు, భోజన వసతి కల్పించింది. అనుగురాజు ఆనందించి, ఏదైనా వరం కోరుకోమన్నాడు. ‘ప్రజల కోసం ఏదైనా చేయవచ్చనే ఉద్దేశ్యం’తో ‘ఏడు ఘడియలపాటు మంత్రి పదవి ఇమ్మని’ అడుగుతుంది. ‘సరేనన్న’ అనుగురాజు నాగమ్మకు ఇష్టమైన సమయంలో మంత్రి పదవి స్వీకరించే అవకాశం కల్పిస్తూ ‘రాజపత్రం’ రాసి ఇచ్చి వెళ్తాడు.
పల్నాడుపై కన్నేసిన బ్రహ్మనాయుడు
ఎలాగైనా పల్నాడు రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్న బ్రహ్మనాయుడు, తన కుట్రలో భాగంగానే, అదును చూసి అనుగురాజును, అడ్డొచ్చిన కన్నతండ్రి మంత్రి దొడ్డనాయుడినీ దారుణంగా హతమారుస్తాడు. వాస్తవాలు తెలిసి పల్నాడు ప్రజలు బ్రహ్మనాయుడిపై తిరగబడతారు. అనుగురాజు ఏడుగురు కొడుకుల్లో పెద్దవాడైన నలగామరాజు(అప్పటి కతడి వయస్సు 13 ఏళ్లు)ను సింహాసనంపై కూర్చోబెట్టి అన్నీ తానై రాజ్యపాలన చేస్తుంటాడు.
బ్రహ్మనాయుని దురాగతలు అంతటితో ఆగలేదు. రాజాస్థానాన్ని తన అనుయాయులతో నింపి, ఖజానాను కొల్లగొడుతుంటాడు. నలగామరాజునూ, పల్నాటి ప్రజలను రక్షించాలనే ఉద్దేశ్యంతో నాగమ్మ రంగ ప్రవేశం చేస్తుంది. అలా మొదలవుతుంది అసలు పోరాటం. అనుగురాజు రాసిచ్చిన రాజపవూతంతో వచ్చి, ఏడు ఘడియల మంత్రి పదవిని అడుగుతుంది. బ్రహ్మనాయుడికి ఇష్టం లేకపోయినా తన తండ్రి మాటను నెరవేర్చాల్సిందేనని నలగామరాజు పట్టుబట్టడంతో అతడు ఒప్పుకోక తప్పలేదు. అలా మంత్రి పదవిని దక్కించుకున్న నాగమ్మ, తనకున్న అపారమైన తెలివితేటలు, తాత్కాలిక మంత్రిగా వచ్చిన అధికారాలతో అంతఃపుర దొంగల ఆటకట్టిస్తుంది.
బ్రహ్మనాయుడి నేతృత్వంలో అతడి అనుయాయులు కొట్టేసి, నేలమాళిగల్లో దాచిన సొత్తునంతా అణా పైసాతో సహా తిరిగి ఖజానాకు చేరుస్తుంది. తనకు తెలియకుండా తన ఆస్థానంలో జరిగిన ఈ చీకటి కోణానికి బ్రహ్మనాయుడే సూత్రధారుడని తెలుసుకున్న నలగాముడు, అతడిని మంత్రి పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో నాగమ్మనే శాశ్వత మంత్రిణిగా నియమిస్తాడు. నాగమ్మ మేథస్సు, కార్యదక్షత, అచంచల రాజభక్తికి ఈ సంఘటనే తార్కాణం.
నాగమ్మ ఇక వెనుదిరిగి చూడలేదు. అత్యంత సాహసోపేత నిర్ణయాలతో, ప్రజారంజకంగా పల్నాడును పాలించినట్లు చారివూతక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఆమె కాలంలో పల్నాడు చుట్టుపక్కల ఉన్న అనేక దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపడ్డట్లు శ్రీనాథ కవి రాసిన ‘పలనాటి వీరచరిత్ర’ స్పష్టంగా చెబుతోంది.
రెండు ముక్కలైన రాజ్యం
కోల్పోయిన మంత్రి పదవిని దక్కించుకునేందుకు బ్రహ్మనాయుడు పల్నాడును రెండు ముక్కలు చేయడానికే కుట్ర పన్నుతాడు. అనుగురాజుకు ముగ్గురు భార్యలు కాగా, అందులో చివరిదైన మైలమదేవికి పుట్టింటి భరణంగా వచ్చిందే పల్నాడు. అందులోనూ అనుగురాజు ఏడుగురు కొడుకుల్లో మైలమదేవికి పుట్టిన నలగామరాజే పెద్దవాడు. కనుక న్యాయంగా రాజ్యం నలగామరాజుకే చెందాలి. కానీ, ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని అనుగురాజు మొదటి భార్య వీరవిద్యలదేవిని రెచ్చగొట్టి, రాజ్యంలో వాటా కోరుతాడు. ఇది ఏ మాత్రం న్యాయసమ్మతం కాకపోయినా నాగమ్మ, నలగామరాజుల మంచితనంతో బ్రహ్మనాయుడి కోరిక నెరవేరుతుంది.
పల్నాడు కాస్తా గురజాల, మాచర్లగా విడిపోతుంది. అలా మాచర్ల రాజ్యం వీరవిద్యలదేవి పెద్ద కొడుకు పెదమలి దేవుడికి వస్తుంది. అక్కడ మంత్రి పదవి దక్కించుకున్న బ్రహ్మనాయుడు, ఆ బాలుడి పేరుతో రాజ్యపాలనను తన చెప్పు చేతుల్లోకి తీసుకుంటాడు. ప్రముఖ సీమాంధ్ర చరివూతకారుడు డా॥ బీఎస్‌ఎల్ హనుమంతరావు ‘‘హైహయ వంశాన్ని (అనుగురాజుది) రూపుమాపి తన వంశాన్ని నెలకొల్పడమే బ్రహ్మన్న ఆశయం. ఇది గ్రహించిన నాగమ్మ గురజాల- మాచర్ల సమైక్యానికి తుదికంటా ప్రయత్నించింది’’ అని తన ‘ఆంవూధుల చరిత్ర’ పుస్తకంలో రాయడం ఇక్కడ గమనార్హం.
తాను దైవాంశ సంభూతుడననీ, తనది విష్ణు అంశ అని తరచూ చెప్పుకునే బ్రహ్మనాయుడు, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, తన వైరిపక్షానికి చెందిన నాగమ్మను దుర్మార్గురాలిగా చిత్రీకరించేందుకు కుట్ర పన్నాడు. ‘వీరవిద్యా వంతులు’ (మహారాణి) పేరుతో ఓ వర్గాన్ని ఏర్పాటు చేశాడు. వీళ్లు బ్రహ్మనాయుడికి లేని గొప్పలు ఆపాదిస్తూ, కల్పనలు జోడిస్తూ, నాగమ్మను దుష్టురాలిగా చూపుతూ తమ గేయగాథల ద్వారా మాచర్ల, చుట్టుపక్కల రాజ్యాల్లో విచ్చలవిడి ప్రచారానికి దిగారు. నేటికీ వంశపారంపర్యంగా ఈ వృత్తిని నిర్వహిస్తున్న వారున్నారు.
కోడి పందెం దురాలోచన
ఎలాగైనా పలనాడును దక్కించుకోవాలనే దురాలోచనతో బ్రహ్మనాయుడు కోడిపందాన్ని తెరపైకి తెస్తాడు. నానా తంటాలు పడి నలగామరాజును, పెదమలిదేవుడినీ ఇందుకు ఒప్పిస్తాడు. పందెంలోఓడినవారు రాజ్యాన్ని వదిలి, ఏడేళ్లు అరణ్యవాసం చేయాలనేది నిబంధన. అయితే, బ్రహ్మనాయుడు తలచిందొకటి కాగా జరిగింది మరొకటి.
నాగమ్మ చేతిలో చిత్తుగా ఓడిన బ్రహ్మనాయుడు అవమానభారంతో వెనుదిరుగుతాడు. ‘నాగమ్మ మంత్రతంవూతాలతో కోడిపందెం నెగ్గిందంటూ’ దుష్ర్పచారానికి దిగుతాడు. ఆ తర్వాత ఒప్పందాన్ని తుంగలో తొక్కుతాడు. అరణ్యవాసం చేయకుండా మాచర్లలోనే ఉండి కప్పం చెల్లిస్తానని కాళ్లబేరానికి దిగుతాడు. ఆ తర్వాత దానినీ నిలిపేసి, కయ్యానికి కాలు దువ్వుతాడు. నాగమ్మ సేనల చేతిలో చిన్నపాటి యుద్ధంలో ఒకసారి ఓటమి చవి చూశాక, కేవలం మూడేళ్లే వనవాసం చేసి, తమ రాజ్యం తమ కివ్వమని పెదమలిదేవుడి అల్లుడు అలరాజును దూతగా పంపుతాడు.
‘తెలివైన అలరాజు బతికుంటే ఎప్పటికైనా తనకు ప్రమాదమని’ అతని హత్యకే కుట్ర పన్నుతాడు. రాయబారానికి వెళ్లి తిరిగి వస్తున్న ఆ రాజును దారుణంగా హతమార్చి నేరాన్ని నాగమ్మపైకి నెడుతాడు. ఇలా పరిస్థితి కాస్తా యుద్ధానికి దారి తీయడంతో గెలిచే అవకాశమున్నా పెద్ద మనస్సు చేసుకున్న నాగమ్మ, మాచర్లను బ్రహ్మన్న వర్గానికే అప్పగించేందుకు సమ్మతిస్తుంది. కానీ, బ్రహ్మనాయుడి కొడుకు బాలచంవూదుడి దురుసు ప్రవర్తనతో సంధి కాస్తా విచ్ఛిన్నమవుతుంది.
రెండు రాజ్యాల మధ్య గల కార్యమపూడి (కారంపూడి) వద్ద యుద్ధం జరుగుతుంది. అశ్వరూఢియైన నాగమ్మ స్వయంగా యుద్ధంలో పాల్గొని బ్రహ్మనాయుడిని హత మారుస్తుంది. ఈ సందర్భానికి సంబంధించి ‘శీలం బ్రహ్మనాయుడు ఒఱుగు’ అని శ్రీనాథుడి పల్నాటి వీరచరిత్ర పుస్తకంలో (ఈ రాతవూపతులు తిరుపతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంతోపాటు మద్రాసు ప్రాచ్యలిఖిత భాండాగారంలోనూ ఉన్నాయి) స్పష్టంగా ఉన్నా, చాలామంది సీమాంధ్ర కవులు, రచయితలు, చరివూతకారులు మాత్రం బ్రహ్మనాయుడు, తాను స్త్రీతో యుద్ధం చేయలేక, నాయకురాలిని క్షమించి, ప్రాణభిక్ష పెట్టాడని రాశారు. నలగామరాజుపై కరుణ జూపి, రాజ్యాన్ని అతడికే అప్పగించి, గుత్తికొండ బిలంలో తపస్సు చేసుకునేందుకు వెళ్లినట్లు చిత్రీకరించారు.
ఈ ‘పల్నాటి యుద్ధం’పై వచ్చిన రెండు చలన చిత్రాల్లోనూ (1947లో ఒకటి, 1967లో మరొకటి) ఇదే వక్రీకరణ జరిగింది. బ్రహ్మనాయుడిని హీరోగా, నాగమ్మను విలన్‌గా చూపి, అసలు చరివూతకే వక్రభాష్యం చెప్పారు.
300 ఏళ్లు గేయగాథ రూపంలోనే!
‘పల్నాటి వీర చరిత్ర’ నిజానికి 300 ఏళ్లపాటు గేయగాథ రూపంలో ప్రజల నోళ్లలో నానుతూ వచ్చింది. అనంతరం 15వ శతాబ్దంలో మొట్టమొదట శ్రీనాథ కవి సార్వభౌముడు పల్నాటి ప్రాంతమంతా పర్యటించి, జన బాహుళ్యంలో వినపడుతున్న గాథను ‘పలనాటి వీరచరిత్ర’ పేరిట కావ్యీకరించాడు. ఆ మహాకవి ఒక సందర్భంలో నాగమ్మ గురించి..
‘‘రెడ్డీ వారి పడతి యనంగ
ఎలిమి జగ్గాడ్డి వేడుక పుత్రి
మేక పోతుల రెడ్డి మేనకోడలును
ఆర్వెల్లి వారింటి అమరుకోడలును
తరుణి నాగమయను తక్షణమందు’’ అని రాశాడు. ఇందులో నాగమ్మ స్వగ్రామం ఆర ప్రస్తావన ఉంది. ఇలా శ్రీనాథుడి తర్వాత ఇప్పటివరకు అనేక మంది కవులు, రచయితలు, నవలాకారులు ఈ చారివూతక గాథను అనేక విధాలుగా ఆవిష్కరించారు. అయితే వీరిలో ప్రారంభానికి ముందే బ్రహ్మనాయుడి పక్షం వహించినవాళ్లే ఎక్కువ.
సహజంగానే వీరు నాయకురాలిని దుర్మార్గురాలిగా చిత్రీకరించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. నాగమ్మ మహిళ కావడం, వేరే ప్రాంతం నుంచి వలస రావడమే ఇందుకు కారణాలని ఆంధ్ర చరివూతకారులు, మేథావులు కూడా బహిరంగంగా ఒప్పుకున్నారు. కవులు, రచయితలు బ్రహ్మనాయుడికి లేని కీర్తి ఆపాదించే క్రమంలో చేసిన తప్పులే నాయకురాలు ఎంత గొప్పదో లోకానికి తెలియజెప్పాలనుకునే వారికి అస్త్రాలయ్యాయి.
ఐదేళ్లకోసారి నాగమ్మ జాతర
‘పల్నాటి చరిత్ర’ మొత్తం తిరగేస్తే నాయకురాలు ఏనాడూ పదవి కోసం పాకులాడినట్లు గానీ, యుద్ధోన్మాదిలా గానీ కనిపించదు. శ్రీనాథుడే స్వయంగా చెప్పినట్లు మంత్రిగా ఉండగా, చుట్టుపక్కల దేశాలతో నాగమ్మ నడిపిన దౌత్య సంబంధాలు ఆమె శాంతి కాముకురాలేనన్న విషయాన్ని స్పష్టం చేశాయి. బ్రహ్మన్న కుట్రతో పల్నాడు విచ్ఛిన్నమైనా, కోడి పందెంలో ఓడి, ఒప్పందాలను ఉల్లంఘించినా, అతడి వర్గంతో నాగమ్మ సంధికే సిద్ధమైంది. తాను నిత్యం శాంతి, సౌభ్రాతృత్వాల కోసం తపించినా ఎదుటి పక్షం రక్తపాతాన్నే కోరుకోవడంతో విరాగియై, పల్నాడును వదిలి స్వగ్రామం ఆర చేరింది. శేష జీవితాన్ని ప్రజాసేవలో, దైవ చింతనలో గడిపింది. ఆపదలో ప్రజలకు అండగా నిలిచి, వారికి ఆరాధ్య దైవమైంది. అందుకే నాగమ్మ మరణించి వెయ్యేళ్లవుతున్నా అక్కడి ప్రజలు ఆ ఇంటినే దేవాలయంగా మార్చి ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించి, నిత్యపూజలు చేస్తున్నారు. ఐదేళ్లకోసారి అక్కడ పెద్ద ఎత్తున జాతర కూడా నిర్వహిస్తున్నారు.
కాగా, కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ మలయశ్రీ లాంటి ఒకరిద్దరు రచయితలు తప్ప ఎవరూ నాగమ్మను గురించి రాయలేదు. ఇక మన నేతలు, అధికారులకైతే నాయకురాలి గురించి గానీ, ఆర గురించి గానీ అస్సలు తెలిసినట్టు లేదు. ఈ గ్రామంలోని వందల ఏళ్ల నాటి ‘నాగమ్మ గుడి’ శిథిలావస్థకు చేరుకుంటున్నా పురావస్తు శాఖాధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికైనా తెలంగాణ మేధావులు, చరివూతకారులు, అధికారులు మేలుకోవాలి. ఆర మన నాయకురాలు నాగమ్మ ఆనవాళ్లను రక్షించుకోవాలి.
ఈ ప్రశ్నలకు బదులేది?
- బ్రహ్మనాయుడి తండ్రి దొడ్డనాయుడు నాగమ్మ మేనమామ జగ్గాడ్డినీ, బ్రహ్మనాయుడు ఆమె తండ్రి రామిడ్డిని అతి కిరాతకంగా హతమార్చారని సీమాంధ్ర చరివూతకారులు రాశారు. మరి, ఓ సామాన్య రైతులను అకారణంగా హత్య చేసిన బ్రహ్మనాయుడు హంతకుడు కాకుండా దేవుడెట్లా అయ్యాడు?
- బ్రహ్మనాయుడు సింహాసనానికి నమస్కరించాడట! అప్పుడు సింహాసనం బద్దలై, అందులో ముక్క గుచ్చుకొని అనుగురాజు మరణిస్తాడట! ఇంత అశాస్త్రీయంగా చెప్పేకంటే అధికార దాహంతో బ్రహ్మనాయుడు అనుగురాజును, అడ్డం వచ్చిన దొడ్డనాయుడినీ హతమార్చాడని చెప్పవచ్చు కదా? బ్రహ్మనాయుడు చేసిన హత్యల గురించి ‘ఐబిడ్’ అనే తన పరిశోధనాత్మక గ్రంథంలో ప్రముఖ ఆంగ్ల చరివూతకారుడు సీవెల్ ఇలా పేర్కొన్నాడు.-
Chronical says that Dodda was bothered about his son Brahmanayudu who killed both Dodda (Doddanayudu) and Alugu(Aluguraju)
- ఎక్కడి నుంచో (తెలంగాణ) వచ్చిన నాగమ్మ కుట్రపూరితంగా మంత్రి పదవి దక్కించుకుందని రాశారు. అనుగురాజే ఇష్ట పూర్వకంగా రాజపత్రం రాసిచ్చాడనీ, నలగామరాజు కావాలనే శాశ్వత మంత్రిగా ఉండి పొమ్మన్నాడనీ చెప్పిందీ వాళ్లే! అలాంటప్పుడు నాయకురాలిది కుట్ర ఎలా అవుతుంది?
- నాగమ్మ మంత్రతంవూతాలతో కోడిపందెం నెగ్గిందనడం అశాస్త్రీయమైన ఆరోపణ కాదా?
- కోడి పందెంలో ఓడిపోయిన బ్రహ్మనాయుడు ఒప్పందాన్ని కాలరాసి, వనవాసం చేయకుండా రాజ్యాన్ని అంటి పెట్టుకున్నప్పుడు పెద్దమనస్సుతో క్షమించిన నాగమ్మ యుద్ధోన్మాది ఎట్లా అవుతుంది? మాచర్లను బ్రహ్మనాయుడి పక్షానికే అప్పగించేందుకు నాగమ్మ అంగీకరించినా, బ్రహ్మనాయుడి కొడుకు బాలచంవూదుడి దుందుడుకు చర్యల వల్ల సంధి విచ్ఛిన్నమై, యుద్ధానికి దారి తీస్తే ఆ పాపం నాగమ్మదేనని రాయడం ఎంతవరకు సమంజసం?
- బ్రహ్మనాయుడు, తాను స్త్రీతో యుద్ధం చేయలేక, నాయకురాలిని క్షమించి, ప్రాణభిక్ష పెట్టాడనీ, అన్నీ త్యజించి గుత్తికొండ బిలంలో తపస్సు చేసుకునేందుకు వెళ్లాడనీ రాశారు. మరి తొలికావ్యం ‘పల్నాటి వీరచరిత్ర’లో ‘శీలం బ్రహ్మనాయుడి ఒఱుగు’ అని శ్రీనాథుడే రాశాడు కదా. (ఇక్కడ ‘ఒఱుగు’ అంటే ‘మరణించు’ అని అర్థం). బ్రహ్మనాయుడు నాగమ్మ చేతిలో మరణించిన విషయాన్ని జీర్ణించుకోలేక అల్లిన కట్టుకథే ‘క్షమించి వదిలేయడం’. క్షమించి వదిలేస్తే యుద్ధానంతరం పలనాడు రాజ్యానికి నాగమ్మ పక్షానికి చెందిన నలగాముడే రాజెందుకవుతాడు? ఈ మాత్రం తర్కం లేకపోతే ఎట్ల? ఈ ప్రశ్నలన్నింటికీ సదరు సీమాంధ్ర చరివూతకారులే సమాధానం చెప్పాలి.
- తెలంగాణలోని బుడగ జంగాలు చెప్పే కొండవూలాయుడి కథలో నాయకురాలు స్వగ్రామం తిరిగి వచ్చిన ప్రస్తావనా ఉంది.
‘ఏడేండ్ల ప్రాయంల ఎగిరిపోయిన చిలక
యాడుందో ఏమైందో ఎరికలేక పోయెరా
ముసల్దయి వచ్చింది అమ్మోరి తీరునా
అందరినీ పసిగట్టి అడిగించినాది
నాయకురాలై నడిపించినాది...’-
- నాగమ్మ తెలంగాణలో పుట్టి, పల్నాడుకు వలసవచ్చి మంత్రిగా ఎదిగిందనీ, యుద్ధం తర్వాత తిరిగి స్వగ్రామం ఆర వెళ్లిపోయిందని సీమాంధ్ర చరివూతకారులు, పరిశోధకులే ధ్రువీకరించారు. డా॥ కలవల వెంకట సుబ్బారావు, తన ‘భక్తి పలనాటి వీర చరివూత’లో, డా॥ తంగిరాల సుబ్బారావు తన ‘పల్నాటి వీర కథాచక్షికం’లో ‘నాయకురాలు నాగమ్మది కరీంనగర్ జిల్లాలోని పెగడపల్లి మండలం ఆర గ్రామమని’ రాశారు. గురజాలకు చెందిన గుర్రం చెన్నాడ్డి నాగమ్మ జాడను వెతుకుతూ స్వయంగా ఆర వచ్చి, ఆమె తెలంగాణ బిడ్డేనని నిగ్గు తేల్చాడు. 1992లో వెలువరించిన తన పరిశోధనా గ్రంథం ‘పలనాటి చరివూత’లో నాగమ్మ పుట్టుపూర్వోత్తరాలను ఆయన పొందుపరిచారు.
v మరో పరిశోధకుడు వై.హెచ్.కె. మోహన్‌రావు కూడా ‘చరిత్ర దాచిన పల్నాటి ప్రామాణిక దర్పణం-తొలి మహా మంత్రిణి నాయకురాలు నాగమ్మ’ అనే పుస్తకంలో నాగమ్మ జన్మస్థలం కరీంనగర్ జిల్లా ఆర అని నిరూపించారు. తెలంగాణలోని బుడగజంగాల కథల్లోనూ ఈ మేరకు స్పష్టంగా ఉన్నా ఎందుకో కొందరు రచయితలు, చరివూతకారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
~ చిల్ల మల్లేశం,టీన్యూస్ ప్రతినిధి, కరీంనగర్
12వ శతాబ్దంలో ఆంధ్రులు/ తెలంగాణా అని లేదు. ఈ భూభాగం అంతా ఒకె పరగణాగా ఉండేది... అంతెందుకు, రుద్రమ కాలంలో ఉన్న హద్దులు ఏంటో ఒక్కసారి సరిచూసుకో.. ఎప్పుడో 1200 కాలంలో జరిగినది ఇది చెప్పటానికి కొలమానం ఏంటి? అప్పుడు పుట్టినవారు గాని, బ్రహ్మనాయుడి చెప్పులు కుట్టినవారు గాని? లేక నాగమ్మ బట్టలు ఉతికినవారు గాని నీకు ఇది చెప్పారా?
ReplyDeleteబబు విజ్జు గారు,
Deleteకొలమానం వుంటేనే ప్రతీది నమ్ముతానంటే దేనిని నమ్మలేము. అలా అనుకుంటే ఎ చరిత్రకు కొలమానం వుందో చెప్పు, మన దేశంలో వున్న ప్రతీ చరిత్ర అప్పటి వాల్లు బ్రతికొచ్చి చెప్పిందేనా. అసలు ఒక కొలమానం వుంటేనే నమ్ముతానంటే తన తాత ముత్తాతలని కూఒడా నమ్మలేడు వాల్లు దిగొచ్చి చెప్పరు కదా. ఆంద్ర తెలంగాన అనే పేర్లు ఒకప్పుడు లేకపోవచ్చు కాని ఇప్పటివాల్లకి అర్దంకావటానికి అలా చెప్పారు. కులంపిచ్చితో కొంతమంది ఒక స్త్రీ చేతిలో చనిపోయిన బ్రహ్మనాయుడుని 1000 సంవత్సరాలుగా దుర్మార్గుడైన బ్రహ్మనాయుడుని మంచోడని చెప్తూ వచ్చారు. నిజం ఎప్పటికైన బయటికొస్తుందని అనటానికి సాక్ష్యాలు ఇవే. మనకు పల్నాటి చరిత్ర గురించి ప్రామానికం పల్నాటి చరిత్రను మొట్టమొదట రాసిన శ్రీనదుని పుస్తకమే. దానిలో అంతవివరంగా బ్రహ్మనాయుడు అతని కొడుకు దుర్మార్గుడని రాసిన కాని కులం పిచ్చి వున్నవాల్లు ఒప్పుకోరు.
telangana/andra enti.. nusance.and nonsance. unna vishayam cheppu.oka writwr ki kavalasinadi adi kadu
ReplyDeleteVery interesting true or false new angle of palnati charitra
ReplyDeletePalnadu News, Narasaraopet News,Kotappakonda
ReplyDeleteWhat u think is absolutely wrong. You don't have any right to spoil the truth.
ReplyDeleteYou don't visit that. Any one didn't say you.
How can you spoil the mind of reader.
There are witnesses like Palnati veera charitra written by srinadha kavi.
ఒక స్త్రీ పల్నాటి చరిత్ర లో ఎప్పటికీ మర్చిపోలేని స్థానం సంపాదించుకున్నది అనేది నగ్న సత్యం తను ఆంధ్ర లేదా తెలంగాణ కు చెందిన అతివ అనేది మర్చిపోయి ఆ రోజుల్లో తను చూపిన తెగువ ధైర్యం కార్యదక్షత దృష్టిలో ఉంచుకుని మాట్లాడండి తను ద్రోహం చేసిందని మనకు మనమే ఊహించుకుంటే ఎలా ఒక వ్యక్తి అది ఒక స్త్రీ వేరే వ్యక్తి లేదా ఒక వ్యవస్థ తో పోరాడింది అంతే తను ఎంత ఎంత వ్యధను అనుభవించింది తండ్రిని పెంచిన మేనమామ ను కట్టుకున్న భర్తను అన్నింటినీ కోల్పోయి ఒంటరిగా బ్రతికి తను తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది ఆడవారికి ఇలాంటి ధైర్యం కార్యదక్షత కావాలి nagamma is our role model to solve Nd to face in the critical circumstances
ReplyDeleteVery interesting..... Great women..
ReplyDeleteBabu telanaganana needi... Brahmmanaidu gurunchi purthiga thelusa neeku... Nagamma yento mee intlo puttinattu cheppaau.... E vishayam palnadu vachi cheppu... Chepputho kodatharu.... Yedava...... Neeku ippudey andhra thelangana ani veru chesi matladuthunnau.... Nagamma chesina mayalu mosalu matharam rayaledu.... Yem ame mee thelangana anaaa.... Thu..... Yedavaaa.... Avidavalle chala mandi chanipoyaru....
ReplyDeleteమరీ బ్రహ్మ నాయుడు మీ ఇంట్లో పుట్టాడా?? ఇక ఆంద్ర తెలంగాణ విశయం.. జస్ట్ అర్థం అవ్వడానికి రాసారు.... చరిత్రలో నాగమ్మ ఎక్కడా మోసం చేసినట్టు లేదు.. అమె మంత్రి.. ఎలా మంత్రాంగం చేసినది, రాజ తంత్రం నడిపినడి మాత్రమే వున్నది.. సినిమాలొ చూపించినది మాత్రమే నమ్మితే.. ఇలాగే వుంటుంది...
DeleteNe bondhara melanti vallu undabatte e rojulo manchi lekunda poyindhi
DeleteNelantode dhuroyodhandudhi shakunidi tappu kaddu dharmaraju judhaki kabbatti baryanu oddadu arjundu dhonga karunduni champeyadu ani antaru
Deleteనాగమ్మకు చరిత్ర వక్రీకరణ జరిగినది అని నమ్ముచున్నాను.నేను తెలంగాణ ప్రాంతీయుడను కాను.రాజ్యాన్ని కుటుంబ ఆస్తిగా పంచుకోకూడదని మహాభారతం లో చెప్పారు.నాగమ్మ అదే రాజనీతి చెప్పినది.విధిలేక శాంతి కోసం రాజ్య విభజనకు ఆమె సహకరించినా ఆమె మీద వక్రీకరణలు జరిగినవి.వెలనాటి తెలగ రాజు కుమార్తె మైలంబాను హైహాయ అనుగురాజుకు ఇచ్చి పెండ్లి చేసి పలనాడును కట్నంగా ఇచ్చి,బ్రహ్మనాయుడు, దొడ్డనాయుడును కూతురు రాజ్య పరిరక్షకుడు గా పంపితే,మైలంబ సవతి కుమారులకు రాజ్యం పంచాలని పంతం నెగ్గించుకున్నారు బ్రహ్మనాయుడు.కొన్ని తరాలపాటు రెడ్డి నాగమ్మకు చరిత్ర విశ్లేషకులు ద్రోహం చేశారని నేను గ్రహించాను,నేను ఆంధ్ర వాడినే ,రెడ్డిని కాదు.
ReplyDelete"వెలనాటి తెలగ" ఆహా!హా!!!
ReplyDeleteఈ మాట తమిళనాడు వెళ్లి అని చూడండి సమాధానం ఎంత ఘాటుగా వస్తుందో తెలుస్తుంది.
మీ ఊరు, మీ పేరు తెలియజేస్తే చరిత్రకు మీరంటిస్తున "తెగులు" అందరికీ ఇంకా స్పష్టమవుతుంది.
This comment has been removed by the author.
ReplyDeleteచాలా ఇంట్రెస్టింగా చెప్పారు కధ నాకు బాగా నచ్చింది...
ReplyDeleteI have been searching to find a comfort or effective procedure to complete this process and I think this is the most suitable way to do it effectively. 먹튀검증
ReplyDeletePerfect work you have done, this website is really cool with excellent information. 검증사이트
ReplyDelete