మందాడి ఫై నాగమ్మ కన్నుతోనే మందపోరు
కోడి పందెములో ఓడిపోయిన మలిదేవాదులు బ్రహ్మానాయుని నేతృత్యంలో మందాడికి చేరుకొని అక్కడ నివసిస్తుంటారు. మూడేండ్ల తరువాత నాయకురాలు నాగమ్మ మలిదేవాదులు ఎలావున్నారు అన్నవిషయం పై వేగుల ద్వారా వాకబు చేస్తుంది. అక్కడవారు గోసంపద (ఆవులమంద)తో సుఖశాంతులతో జీవిస్తున్నారని తెలుసుకొని ఆమెకు కన్నుగుట్టిం ది.ఏదో విధంగానైనా మలిదేవాదులను చీకాకు పరచాలని నలగామరాజుకు దుర్నితిని కల్లించేలా చేస్తుంది.తొలుత నలగామరాజు అంగీకరించకపోయినా నాయకురాలు నాగమ్మ మాటలకు ప్రలోభపడతారు.దీంతో బ్రహ్మానాయునిపై శతృత్వం పెంచుకొంటారు. మందాడిలో ఆవుల మందతో వుంటున్న బ్రహ్మన్నపై యుద్ధం చేయించాలని సమరుడైన అర్ధవీటిలోని వీధుల పల్నీడు అను చెంచు నాయకున్ని నాగమ్మ కబురు పంపుతుంది. గతంలో పల్నీడు తండ్రిదాబుచేనిని బ్రహ్మనాయుడు ఓయుద్ధంలో ఓడిస్తారు. పగతీర్చుకోవాలని రగిలిపోతున్న ఆతనికి నాగమ్మ పిలుపుతో తన అనుచరులతో పాటు పరివారాన్ని వెంటతీసుకొని గురజాల వెళ్లారు. ఈ కార్యంను విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చే నీకు మాచర్ల రాజ్యాన్నికానుకగా ఇస్తామని చెపుతుంది, దామినీడు,పల్లన్నమల్లన్నఅనేవేగులద్వారా మందాడి పట్టణంలోనికి హరిదాసుల వేషంలో వెళ్లి మలి దేవాదుల ఆవుల మందలపై దాడిచేసేందుకు వ్యూహం పన్నుతారు.ఆవులమందకు కాపలాగా లంకన్నను నాయకుడిగా బ్రహ్మనాయుడు నియమి స్తారు. వీధుల పల్నీడు తన సైనిక బలంతో పాటు నలగామరాజు అందించి సైన్యాన్ని తీసుకొని మూకుమ్మడిగా గోవుల మందలపై దాడిచేస్తారు.ఈ దాడిలో లంకన్న వీరావేశంతో నలగాముని సైన్యాన్నిహతమారుస్తారు.వీధలపల్నీడు పన్నిన పద్మవ్యూహంలో చికుకున్న లంకన్న అభిమన్యునిలాగా వీరోచితంగా ఒంటరి పోరాటంచేస్తూ పల్నీడు తలను తెగనరికిన ఆనందంలోకల్గివుండా నలుమూలల నుంచి చాటుమాటు నుంచి బాణాలను ఒకేసారి వేయటంతో లంకన్న నేలకొరుగుతారు. ఈ విషయాన్ని లంకన్న అనూయయుల్లో మిగిలి వున్నపెయ్యల పేర్నీడు బ్రహ్మనాయునికి తెలియ జేస్తారు. బ్రహ్మనాయుడు తన మానస పుత్రుడైన మాల కన్నమ దాసును వెళ్ళి మందాడిని రక్షించాల్సిందిగా ఆజ్ఞాపిస్తారు.దీంతో కన్నమదాసు నలగామ రాజు సైన్యాన్ని చెంచుల సేనలను ఓడించి ఆలమందలను రక్షిస్తారు.
► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra

No comments:
Post a Comment