Thursday, 8 January 2015

భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు(sankranti, bhogi, kanuma )









గతానికి వీడ్కోలు పలుకుతూ... జీవితంలోకి కొత్త కాంతులు ఆహ్మానిస్తూ..
భోగి మంటల వెలుగులతో సంక్రాంతి లక్ష్మీ పలుకుతూ... వచ్చిన భోగి పండుగ
అందరికి భోగభాగ్యాలను అందించాలని కోరుకుంటూ .. భోగి పండుగ శుభాకాంక్షలు

ముద్దబంతులు.. మువ్వ మోతలు
నట్టింట కాలు పెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడి కాంతులు
పుట్టింట దీపం పెట్టు ఆడపడుచులు
కలబోసి విరబూసే మదినిండగా చలిపండుగే సంక్రాంతి.

భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రకృతి తో మనిషి సహజీవనం చేసే అసలైన పండగ సంక్రాంతి. భోగిమంటలు, భోగిపండ్లు, బొమ్మల కొలువులు, రంగవల్లులు, పల్లెసీమలు, గంగిరెద్దులు, హరిదాసులు, కోడిపందేలు, పతంగులు, ఎడ్లపందాలు, ధాన్యపురాశులు, పశువుల పూజలు, అంతకు మించి అమ్మ చేసే పిండివంటలు....  ఇవన్నీ కలగలిసి చేసుకునే అపురూపమైన అతి పెద్ద పండగే సంక్రాంతి. కష్టాలు భోగి మంటల్లో ఆహుతై ఈ సంక్రాంతి నుంచి కొత్త ఆశల కిరణాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో  ప్రసరించాలని కోరుకుంటూ మిత్రులందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు.

భోగి పళ్ళకి రేగు పళ్ళనే ఎందుకు పోస్తారు?

సంక్రాంతి పండగల్లో భోగి రోజున ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ఇంట్లో పసిపిల్లలకు భోగి పళ్ళుపోసినా రేగు పళ్ళే పోస్తారు.  ఈ కాలంలో వచ్చే అనేక రకాల పళ్ళుండగా రేగు పళ్ళనే ఎందుకు వాడతారు?  వాటికి అంత విశేషం ఎందుకు?  వాటినే భోగి పళ్ళకి ఎందుకు వాడాలి?  రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు.  పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు.   అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ  చుట్టుపక్కలవున్న చెట్లనుంచి  ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు.  సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ,  రేగు పళ్ళని తింటూ, ఆ  ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు.  ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.

బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి   సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు.  భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు.  వారి ఆశీర్వచనాలతోబాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో.

No comments:

Post a Comment