Wednesday, 7 January 2015

చెక్కలు

చెక్కలు కావలసినవి
 బియ్యంపిండి 1/2 కిలో
 సెనగపప్పు 1 కప్
 పెసరపప్పు 1 కప్
 పచ్చిమిర్చి 5   
వెన్న 5 స్పూన్స్
 జీలకర్ర 1 స్పూన్
 కరివేపాకు 1 రెమ్మ
 అల్లం చిన్నముక్క
 పసుపు చిటికెడు
 ఉప్పు తగినంత
 తయారుచేయువిధానం సెనగపప్పు,పెసరపప్పు అరఘంటముందు నానపెట్టాలి .పచ్చిమిర్చి,అల్లం,జీలకర్ర మెత్తగా నూరుకోవాలి ఒక బౌల్ లో బియ్యంపిండి ,వెన్న కలిపి నానినపప్పులు,అల్లం,పచ్చిమిర్చి ముద్దా,ఉప్పు,పసుపు వేసి తగినన్ని నీళ్ళుపోసి కలపాలి .చిన్న,చిన్న ఉండలుచేసుకుని అప్పడాలు చేత్తో వత్తుకుని వేయించుకోవాలి 

No comments:

Post a Comment