ప్రభలు
ప్రభలు అనే ఓ గొప్ప సంస్కృతీ కోటప్పకొండ, పల్నాడు ప్రాంతంలోని వివిధ గ్రామాల తిరునాళ్లలో కనిపిస్తుంది. కొటప్పకొండలో ప్రభల వైభవాన్ని చూడాలే కాని వర్ణించలేము. విద్యత్ ప్రభల థగధగ కాంతులన నడుమ శివ రాత్రి సమయంలో ఆ కొండలు మెరిసిపోతుంటాయి. నా చిన్నతనం ఓక సారి వెళ్ళి ప్రభల వైభవాన్ని నాకంటితో చూసిన వాటిని మాటలు రూపంలో తెలుపుదాం అని అనుకున్నాను.
శివరాత్రి నాడు కోటప్పకొండ కు సమీపంలోని అన్ని గ్రామాల వారు ప్రభలు, విద్యత్ ప్రభలు కట్టుకుని కోటప్పకొండ కు వస్తారు. కోటి ప్రభల కొండకు వస్తే త్రీకోటేశ్వర(కోటయ్య) స్వామి కొండ దిగి వస్తారని పెద్దలు చెప్పేవారు. ప్రతి గ్రామానికి ప్రభకు సంభందించిన సోంత వస్తు సామాగ్రి ఉంటుంది. శివరాత్రి కి 15 రోెజుల ముందు నుంచి ప్రభ తయారి మెదలు పెడతారు. ఆయా గ్రామాల్లో గ్రామస్తులే ప్రభలు కడతారు. విధ్యత్ పరికరాలు మాత్రం చిలుకలూరి పేట, నర్సారావు పేట వాళ్లు అమర్చతారు. ఓక్కొక్క ప్రభ 80 అడుగుల ఎత్తు వరకు కడతారు. ప్రభల ఎత్తు, డిజ్ైన్ విషయంలో గ్రామాల మధ్య తీవ్ర పోటీ ఉండేది. ప్రభ పూర్తి అయిన తరువాత ఆయా గ్రామాల్లో శివరాత్రికి మూడు రోజుల ముందు ప్రభలపై నాటికలు, డాన్సు ప్రధర్శనలు జరుగుతాయి. మా అమ్మమ్మ వాళ్లది కోటప్పకొండకు 20 కి.మీ దూరంలో ఉన్న కావూరు గ్రామం(కొండ కావూరు కాదు). నా చిన్న తనంలో గ్రామం నుంచి ప్రతి శివరాత్రికి ఎద్దులబండి పై కొండకు వెళ్లేవాడిని. ఐదు, ఆర్లు సార్లు నేను ప్రభలు వెంట కూడా కొండకు వెళ్లాను. ప్రభను గుడికి చేర్చటానికి శివరాత్రి కి ఒక రోజు ముందే గ్రామం నుంచి ప్రభ బయలు దేరుతుంది. ప్రభను రాతి చక్రాలతో కూడిన చెక్కరధం పై ఉంచుతారు. ఆ రధంను టాక్లరు లాగుతుంది. ప్రభ పడిపోకుండ బ్యాలన్స్ చెయ్యటానికి ప్రభకు పమ్మ తాడులు ఉంటాయి. ప్రభకు కింద నుంచి పై వరకు కనీసం 60 తాడులు పైనే కడతారు ప్రభ కదిలే సమయంలో ఓక్కొక్క తాడును ఐదు నుంచి 10 మంది పట్టుకుంటారు. నేను పమ్మతాడులు పట్టుకునే వాడిని. చేదుకో.. కోటయ్య.. అని ఆ కోటయ్య స్వామిని స్మరిస్తూ తాడులు పట్టకుని ప్రభ వెంట కదిలేవారము. ప్రభ రోడ్డు పైన ఉంటే దాని తాడులు పట్టుకున్న మేము పక్కన పొలాలు, ముళ్ల కంపల వద్ద ఉండే వాళ్లము, ఆ సమయంలో కాళ్లకు ముళ్ళుదిగి, ముళ్ల కంపలు గీచుకొని చిన్నచిన్నగాయాలు అవుతాయి. కొండకు ప్రభ చేరేలోపు కనీసం రెండు సార్లు అయినా రధం ఇరుసు ఇరుగుతుంది. ఇరుసులు రడీగా ఉంటాయి కానీ దాన్ని మార్చటానికి రెండు మూడు గంటలు సమయం పడుతుంది. ఇలా అనేక ప్రయాసలు పడి ఓక రోజు ముందు బయలు దేరినా శివరాత్రి రోజున రాత్రి 8 గంటల సమయానికి చేరుకుంటుంది. మరి ఎక్కవ ఇబ్బందులు ఎదురైతే మాత్రం ప్రభ ఓక్కొక్క సారి 1,2 తెల్లవారుజామున చేరుకుంటాయి. ప్రభలు ఇరిగిపోయిన సంఘటనలు, విద్యత్ షార్ట్ అయ్యి ప్రభ కాలిపోయిన సంఘలణలు అనేకం ఉన్నాయి. గతంలో ఓక్కోక్క ప్రభను తరలించటానికి రధంకు 50 నుంచి 100 జతలు గిత్తలు కట్టి రధాన్ని లాగించేవారు. ప్రస్తుతం ప్రభ ఉంచిన రధంను టాక్టర్లు లాగుతున్నాయి. అయినా ప్రభ కొండకు చేరుకోవటానికి 30 నుంచి 40 గంటలు సమయం పడుతుంది. గతంలో గిత్తలు , వాటి కాళ్ళకు కట్టిన గజ్జెల సవ్వడి, మెడకు కట్టిన గంటల మోతలు, వాటిని హడలిండటానికి చండ్రకోళ గాలిలో ఊపుతుంటే వచ్చే శబ్ధం, కనక టప్పట్ల కొళాహలం మధ్యన ప్రభ కదిలి వెళుతుంటే చూడటానికి రెండు కళ్లు సరిపోయేవి కావు. ప్రస్తుతం ఆ హడావుడి కానరాదు. ప్రభలను గ్రమాల్లొ కట్టుకొని కొండకు తీసుకెళటం అనేది ఓక్క కొటప్పకొండలో మాత్రమే కనపడుతుంది. పల్నాడు లోని జరిగే ఇతర గ్రామాల్లో జరిగే తిరునాళ్లలో తిరునాళ్ళు జరిగే ప్రదేశంలోనే ప్రభలు కడతారు వాటిని ఎక్కడకి తరలించరు. మా కావూరు విద్యత్ ప్రభ గత 65 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా కడుతున్నారు. కొటప్పకొండ శివరాత్రి తిరునాళ్ళలో ప్రభలే ప్రత్యాక ఆకర్షణ.

No comments:
Post a Comment