రసవత్తరం.. కమనీయం.. కల్లిపాడు
ప్రపంచ చరిత్ర కలిగిన పల్నాటి వీరుల మహోత్సవాల్లో ఐదురోజు మంగళవారం కల్లిపాడు రసవత్తరంగా, కమనీయంగా జరిగింది. పల్నాటి యుద్ధంలో గోవుల మందకు కాపరిగా ఉన్న లంకన్నకు బ్రహ్మనాయుడు ప్రాణాభిక్ష పెట్టేఘట్టం జరిగింది. యుద్ధంలో మృతులైన వీరనాయుకులు గుర్తుకు వచ్చి బ్రహ్మనాయుడు గుత్తికొండ బిలం వెళ్తూ యుద్ధంలో మృతిచెందిన వారికి పిండప్రదానం చేస్తాడు. ప్రతి ఏటా మృతులను స్మరించుకోవాలని బ్రహ్మనాయుడు పిడుగు వంశీయులైన బ్రాహ్మణులను పీఠాధిపతులుగా నియమిస్తాడు. రక్తం కలిపిన అన్నపు ముద్దలను పోతురాజు గుట్ట వద్ద ఆకాశంలోకి పీఠాధిపతి ఏగురవేస్తాడు. ఆ ముద్దలను శక్తులు (్ధరులు) స్వీకరిస్తారు. వీరనాయుకులు వాడిన ఆయుధాలను ఉరేగింపుచేసి నాగులేరులో స్నానమాచరించిన తరువాత బ్రహ్మనాయుడు ఇచ్చిన తీర్థం పుచ్చుకుని పోతురాజుగుట్ట వద్ద ధీరులు వరిగిపోతారు. 900 సంవత్సరాల నుండి అనవాయితీగా జరుగుతున్న పల్నాటి వీరుల మహోత్సవాలకు వీరాచారవంతులు తరలివచ్చారు. పల్నాటి చరిత్రను కథలుగా వీరాచారవంతులు వివరించారు. ఐదురోజుల నుండి కారంపూడిలో జరిగిన పల్నాటి వీరుల మహోత్సవాలకు 11జిల్లాల నుండి వీరాచారవంతులు, పల్నాడు ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ రమేష్‌బాబు అధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాలను పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ అయ్యవారు, నిర్వాహకులు విజయ్ ఘనంగా నిర్వహించారు.
No comments:
Post a Comment