Sunday, 2 November 2014

ఓటిగుళ్ళు..

ఓటిగుళ్ళు.. 

పలనాడులో మలిదేవుల పాలనకు పూర్వంజైనులు ఈ ప్రాంతంలో ఓటిగూళ్లను కట్టించారట. మాచర్ల చెన్నకేశవ స్వామి దేవాలయ ఆవరణలో ఒక శిధిల దేవాలయం వుంది. అది ఎవరు కట్టించారో ఇంత వరకు తెలియదు. మూలవిరాట్‌ లేకుండా దేవాలయం మాత్రమే ఉండే వాటిని ఓటిగూళ్లు గా పిలుస్తారు. ప్రస్తుతం ఈ శిథిలమైన గుడిని ఓటిగుడిగా ప్రముఖ రచయిత గుర్రం చెన్నారెడ్డి తన 'పలనాటి చరిత్ర' పుస్తకంలో రాశారు. అలానే దేవళమ్మ చెరువు సమీపంలోని కట్టడం కూడా ఓటిగుడి గా ఆయన పేర్కొన్నారు. మరికొందరు ఈ దేవాలయం వెంకటేశ్వర స్వామి గా చెపుతారు.. ఈ గుడి గోడల పై గొప్ప శిల్పకళ వుంది. 








No comments:

Post a Comment