చేయెత్తి జై కొట్టు తెలుగోడా.....వేములపల్లి శ్రీ కృష్ణ
చేయెత్తి జై కొట్టు తెలుగోడా
చేయెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతొ ఘన కీర్తి కలవాడా
సాటి లేనీ జాతి
ఓటమెరుగని కోట
నివురుగప్పీ నేడు
నిదురపోతుండాది
జేకొట్టి మేల్కొలుపు తెలుగోడా
గతమెంతొ ఘన కీర్తి కలవాడా
వీర రక్తపు ధార
నార పోసిన సీమ
పలనాడు నీదెరా
బాల చంద్రుడు చూడ
ఎవరోయ్
తాండ్రపాపయ కూడనీవోడూ
నాయకీ నాగమ్మ
మల్లమాంబ మొల్ల
మగువ మాంచాల నీ
తోడబుట్టిన వాళ్ళె
వీర వనితల గన్న తల్లిరా
ధీరమాతల జన్మభూమిరా
గతములో నీ కీర్తి
కతలల్లి సెప్పారు
పసయేడ దాచావు
వుసిలేక పోయెరా
బ్రతుకె బరువైయుంటివీనాడు
శతపోరి సాధించు తొలిపేరు
నాగార్జునుని కొంద
ఆమరావతీ స్థూప
భావాల పుట్టలో
జీవకళ పొదిగావు
అల్పుడవు కానంచు తెల్పావు
శిల్పివంటిరి దేశ దేశాలు
రాజ్యమంటే వీర
భోజ్యమన్నాడు, మన
తిక్కనార్యుని మాట
ధీరులకు బాటరా
పూర్వ పౌరుషమెరిగి బ్రతకాలి
కార్యశూరులు
నేడు కావాలోయ్
దేశమంటే వట్టి
మట్టి కాదన్నాడు
మనుషులన్నా మాట
మరవబోకన్నాదు
అమరకవి గురజాడ నీవోడూ
ప్రజల కవితను
బాడి చూపేడోయ్
రాయలేలిన సీమ
రతనాల సీమరా
దాయగట్టి పరులు
ధారతీస్తుండారు
నోరెత్తి అడుగరా దానోడా
వారసుడ నీవెరా తెలుగోడ
-వేములపల్లి శ్రీ కృష్ణ
చేయెత్తి జై కొట్టు తెలుగోడా
చేయెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతొ ఘన కీర్తి కలవాడా
సాటి లేనీ జాతి
ఓటమెరుగని కోట
నివురుగప్పీ నేడు
నిదురపోతుండాది
జేకొట్టి మేల్కొలుపు తెలుగోడా
గతమెంతొ ఘన కీర్తి కలవాడా
వీర రక్తపు ధార
నార పోసిన సీమ
పలనాడు నీదెరా
బాల చంద్రుడు చూడ
ఎవరోయ్
తాండ్రపాపయ కూడనీవోడూ
నాయకీ నాగమ్మ
మల్లమాంబ మొల్ల
మగువ మాంచాల నీ
తోడబుట్టిన వాళ్ళె
వీర వనితల గన్న తల్లిరా
ధీరమాతల జన్మభూమిరా
గతములో నీ కీర్తి
కతలల్లి సెప్పారు
పసయేడ దాచావు
వుసిలేక పోయెరా
బ్రతుకె బరువైయుంటివీనాడు
శతపోరి సాధించు తొలిపేరు
నాగార్జునుని కొంద
ఆమరావతీ స్థూప
భావాల పుట్టలో
జీవకళ పొదిగావు
అల్పుడవు కానంచు తెల్పావు
శిల్పివంటిరి దేశ దేశాలు
రాజ్యమంటే వీర
భోజ్యమన్నాడు, మన
తిక్కనార్యుని మాట
ధీరులకు బాటరా
పూర్వ పౌరుషమెరిగి బ్రతకాలి
కార్యశూరులు
నేడు కావాలోయ్
దేశమంటే వట్టి
మట్టి కాదన్నాడు
మనుషులన్నా మాట
మరవబోకన్నాదు
అమరకవి గురజాడ నీవోడూ
ప్రజల కవితను
బాడి చూపేడోయ్
రాయలేలిన సీమ
రతనాల సీమరా
దాయగట్టి పరులు
ధారతీస్తుండారు
నోరెత్తి అడుగరా దానోడా
వారసుడ నీవెరా తెలుగోడ
-వేములపల్లి శ్రీ కృష్ణ
No comments:
Post a Comment