Wednesday, 26 November 2014

శ్రీనాథకవిసార్వభౌముడు పలనాడు వెళ్ళినపుడు చెప్పిన చాటు పద్యం...

శ్రీనాథకవిసార్వభౌముడు  చాటు పద్యం...   
చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
గట్టు తెగిన ఏళ్ళు సర్పంబులును తేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు

 ''సిరిగలవానికి చెల్లును...
చాటువులు అనే పాఠ్యభాగంలో ఏడు చాటు పద్యాలున్నాయి. మొదటి పద్యం శ్రీనాథుడి చాటువుగా ప్రసిద్ధం. పలనాడు వెళ్లినప్పుడు, దాహం వేస్తే నీరు దొరకనప్పుడు చెప్పిన పద్యం- ''సిరిగలవానికి చెల్లును...'' అనే పద్యం
సిరిగలవాడు అంటే విష్ణుమూర్తి (కృష్ణుడు)
తరుణులు అంటే స్త్రీలు
తిరిపము అంటే బిచ్చమెత్తుకోవడం (శివుడు భిక్షమెత్తుతాడని)
ఆండ్రు అంటే భార్యలు
               ''శ్రీకృష్ణుడికి పదహారువేల మంది స్త్రీలున్నా ధనవంతుడు కాబట్టి ఫరవాలేదు. బిచ్చమెత్తుకొనే ఓ శివా! నీకు ఇద్దరు భార్యలెందుకు? నీకు పార్వతిచాలుగానీ గంగను నాకిచ్చెయ్యి'' అని భావం. ఇందులో వ్యంగం ఉంది. గంగ అంటే నీరు. కాబట్టి, నాకు నీటినిచ్చి దాహం తీర్చమన్నాడు. చమత్కారంగా చెప్పిన మంచి చాటు పద్యం ఇది.

No comments:

Post a Comment