తేరాల సిద్దేశ్వరస్వామి ( Sidheswara Swamy, Terala )
దుర్గి మండలంలోని తేరాల గ్రామంలో భ్రమరాంబ సమేత సిద్దేశ్వర స్వామి ఆలయం ఉంది. కోరిన కోర్కెలు తీర్చే చల్లని దైవంగా ప్రసిద్ధి చెందిన సిద్దేశ్వరస్వామి ఆలయానికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. గంగవల్లి, మల్నాయుడు, నవీననాయుడు, దేవ ర్నాయుడు, సోమనాధ దేవరరాజదీ షులు ఈ ఆలయాన్ని క్రీశ 675 సంవత్సరంలో భాద్రపద బహుళ సూర్యగ్రహణ కాలంలో నిర్మించినట్లు ఇక్కడి శిలాశాసనంలో ఉంది.
పరుశు రాముడు ఈ ఆలయ ప్రాంతంలో తపస్సు చేసి ఇక్కడ గుడి కట్టించాలని సంకల్పం చేశాడు. శివలింగం కోసం వెళ్ళి వచ్చే లోపే సాక్షాత్తు పరమేశ్వ రుడే ఇక్కడ లింగరూపంలో ఆవిర్భివిం చాడని స్ధల పురాణం చెబుతుంది. అంతట పరుశురాముడు శివుడే స్వయం భూ అయిన వైనాన్ని తలుచు కొని ఇది దైవ సంకల్పమని భావించి, పక్కనే తాను తెచ్చిన లింగాకారాన్ని కూడా ప్రతిష్టించి పూజలు చేశాడు. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఈ దేవా లయంలో శివలింగాలలో ఒక దానిని పుట్టుడు లింగమని, మరొక దానిని పెట్టుడు లింగమని చెప్పుకుంటారు. ఆలయానికి తూర్పు దిశగా వాయు లింగేశ్వరస్వామి, పడమర దిశగా రుద్ర గుండం, దక్షణ దిక్కున తేరాల గ్రామం, ఉత్తరం గో గర్భం అనుస్ధాన గుండం ఉన్నాయి. ప్రస్తుతం తేరాలగా పిలవబడుతున్న పూర్వం బ్రాహ్మణ అగ్రహారంగా పిలుస్తారు. ఇక్కడి బ్రహ్మాణులు నలంద, తక్షశిల వంటి ప్రసిద్ధి పొందిన విశ్వవిద్యాలయాలలో ఆచార్యులుగా పనిచేసినట్లు ఇక్కడి శిలాఫలకం ద్వారా తెలుస్తొంది.
ఈ దేవాలయానికి ఎదురుగా కోనేరు ఉంది. ప్రకృతి సిద్దంగా నీరు ఊరి ప్రవహించే ఐదు బుగ్గలు కలసిన జలం ఈ కోనేరులోకి ఉబికి రావటం విశేషం. ఇది విబూది కోనేరుగా ప్రసిద్ది చెందింది. కోనేరు అడుగు బాగంలో సుద్దతో తయారైన విబూది ఉండలు సహజ సిద్దంగా ఏర్పడుతుంటాయి. ఈ విబూది వుండలను భక్తులు పరమ పవిత్రం భావించి తీసుకెళ్తూ ఉండటం జరుగుతుంది. ఆలయానికి పక్కన గో గర్భము అను సన్నని మార్గముంది. ఈ మార్గమునకు పొడవు, వెడల్పు ఒక అడుగుకు మించి కూడా వుండదు. అయినప్పటికీ పవిత్రమైన మనస్సుతో శివుని స్మరిస్తూ ఎంతటి స్ధూలకాయు లైన ఈ మార్గం ద్వారా తేలికగా వెళ్ళి స్వామి వారిని దర్శించుకొని రావచ్చు. ఈ దారి గుండా దైవ దర్శననాకి వెళ్ళి వస్తే కోరిన కోర్కెలు తీరుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాబ విశ్వాసం.
మాచర్ల మండలం రాయవరం గ్రామ ప్రజలు శ్రీ భ్రమ రాంబ దేవి విగ్రహాన్ని తీసుకొచ్చి సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ష్టించి ఇలవేల్పుగా కొలుస్తూ ప్రతి సం వత్సరం శివరాత్రి పర్వదినాన ఆమెకు పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకొని భజనలు, కోలా టాలతో గుడి వద్దకు చేరుకుంటారు. శివరాత్రి రోజు నిర్వమించే శ్రీ భ్రమ రాంబ సమేత సిద్దేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకు పల్నాడు ప్రాంతం నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.

No comments:
Post a Comment