Friday 5 December 2014

పల్నాటి యుద్దం సినిమా

పల్నాటి యుద్ధం



కొత్త చిత్ర నిర్మాణ సంస్థలు ప్రారంభం కావడం, ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం పెంచిన వినోదపు పన్ను భారం అవుతోందని, నిర్మాణ వ్యయం కూడా పెరిగిపోయిందని భావించిన పాత నిర్మాణ సంస్థలు కొన్ని తెలుగు చిత్రాలు నిర్మించడం ఆపి, తమిళంలో చిత్రాలు నిర్మించడానికి సంకల్పించడం, రెండు స్టూడియోలను తెలుగువారు ప్రారంభించడం, విజయవాడలో నవయుగ ఫిలింస్‌ పంపిణీ సంస్థ ప్రారంభించడం 1947లోని ముఖ్యమైన విశేషాలు. ఈ ఏడాది పల్నాటియుద్ధం, యోగి వేమన, బ్రహ్మరథం, గొల్లభామ, రత్నమాల, రాధిక చిత్రాలు నిర్మించగా రత్నమాల తప్ప మిగతా చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో యోగి వేమన పల్నాటి యుద్ధం, గొల్లభామ చిత్రాలకు పేరొచ్చింది. 1947 ఆగస్టు 15న మన దేశం బానిస శృంఖలాలనుండి విడివడి స్వతంత్రదేశంగా అవతరించడంతో దర్శక నిర్మాతలు సాంఘిక సమస్యలకు చిత్ర ఇతివృత్తాలు ప్రాధాన్యత యిచ్చే ప్రయత్నం వెంటనే ప్రారంభించారు.
చిత్ర దర్శకుడుగా తరువాత మారి మంచి చిత్రాలు రూపొందించిన వేదాంతం రాఘవయ్య ఈ ఏడాది విడుదలైన యోగివేమన, పల్నాటియుద్ధం చిత్రాలకు నృత్య దర్శకత్వం నిర్వహించడం విశేషం.
భానుమతి, రామకృష్ణ దంపతులకు జన్మించిన పుత్రుడు భరణి పేరున భరణి పిక్చర్స్‌ నిర్మాణ సంస్థను భానుమతి ప్రారంభించి 'రత్నమాల' చిత్రాన్ని భర్త రామకృష్ణ దర్శకత్వంలో చిత్ర నిర్మాణం ప్రారంభించారు.
పల్నాటి యుద్ధం
సహాయ సంపాదకుడుగా పనిచేసి, ప్రజామిత్రకు సంపాదకుడుగా వ్యవహరించిన గూడవల్లి రామబ్రహ్మం సినీరంగంలో ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా, పబ్లిసిటీలో సలహాలు యిచ్చేవానిగా వ్యవహరిస్తూ 'మాలపిల్ల' చిత్రానికి దర్శకులై, ఆ చిత్ర విజయంలో 'రైతుబిడ్డ' రూపొందించారు. 'రైతుబిడ్డ' కొందరు జమీందార్ల ఆగ్రహానికి బలి అయింది. తరువాత ఆ ధోరణి చిత్రాలు మాని 'ఇల్లాలు, అపవాదు, పత్ని, పంతులమ్మ, మాయాలోకం' చిత్రాలు రూపొందించారు. వీటిలో కొన్ని బయట సంస్థలు నిర్మించిన చిత్రాలు. 'పల్నాటియుద్ధం' రూపొందించాలనే కోరిక చాలా కాలంగా వుండేది. 'పల్నాటియుద్ధం' ప్రారంభించిన తరువాత అనారోగ్యం ఏర్పడింది. కొంత భాగం షూటింగ్‌ చేసాక ఈ చిత్రం పూర్తి చేసే బాధ్యతను ఎల్‌.వి.ప్రసాద్‌కి అప్పగించారు. గూడవల్లి రామబ్రహ్మం అక్టోబర్‌ 1946లో మరణించారు. మరణానంతరం 'పల్నాటియుద్ధం' సెప్టెంబర్‌ 47లో విడుదల అయింది. 'పల్నాటియుద్ధం' చిత్రం రూపొందించాలన్న ఆలోచన చాలా కాలం నుంచి గూడవల్లికి ఉన్నందున పల్నాటియుద్ధం బుర్రకథలను విని, అందుకు సంబంధించిన గ్రంథాలను చదివి, స్క్రిప్టు తయారు చేయించారు. బ్రహ్మనాయుడుగా డా. గోవిందరాజుల సుబ్బారావు, నలగామరాజుగా శ్రీవత్స వెంకటేశ్వరరావు, నరసింగరాజుగా లింగమూర్తి, బాలచంద్రుడుగా అక్కినేని నాగేశ్వరరావు, నాగమ్మగా కన్నాంబ, మాంచాలగా ఎస్‌.వరలక్ష్మి, కొమ్మరాజుగా గిడుగు సీతాపతి, మలిదేవరాజుగా సదాశివరావు, అలరాజుగా కోనేరు కుటుంబరావు, కన్నమదాసుగా వి. కోటేశ్వరరావు, సుబ్బన్నగా వంగర, రాజనర్తకిగా రాజబాల, పేరమ్మగా చంద్రకళ, ఐతాంబగా జి. విశ్వేశ్వరమ్మ నటించారు.
శ్రీ శారదా ప్రొడక్షన్స్‌ పతాకాన గూడవల్లి రామబ్రహ్మం నిర్మించి, కొంత చిత్రాన్ని దర్శకత్వం చేసి పక్షవాతం పాలవడంతో మిగతాది ఎల్‌.వి.ప్రసాద్‌ పూర్తి చేసారు. గూడవల్లి అనారోగ్యం కారణంగా బావమరిది కోగంటి వెంకట సుబ్బారావు నిర్మాణ బాధ్యతను చేబట్టారు. రామబ్రహ్మం, శారద దంపతులకు అంకితమిచ్చారు 24-9-47న విడుదల చేస్తూ.
బ్రహ్మనాయుడు వీరవైష్ణవుడు. నాగమ్మ వీర శైవ మతస్థురాలు. నాగమ్మ దురభిమానం 'పల్నాటియుద్ధం'కి కారణమౌతుంది.
పల్నాటిసీమ నలగామ రాజు పాలనలో వుంటుంది. నలగామరాజు సవితి తమ్ముళ్ళు నరసింగరాజు, మలి దేవరాజు. మలి దేవరాజుకు బ్రహ్మనాయుడు అంటే అపారమైన అభిమానం. పల్నాటి సీమలో అందరికీ బ్రహ్మనాయుడు అంటే అభిమానము అతని మాట వేదవాక్కు. బ్రహ్మనాయుడు మాచర్ల చెన్నకేశవ ఆలయంలో హరిజనులకు ప్రవేశం కల్పించడం, నిమ్నజాతికి చెందిన కన్నమదాసుని సైన్యాధికారుని చేయడంతో అగ్రవర్గాల లతో పాటు నాగమ్మకూడ కోపం వస్తుంది. బ్రహ్మనాయుడు మీద నాగమ్మ రాజసభలో ఆరోపణలు చేస్తే బ్రహ్మనాయుడు బదులివ్వక సభ వదలి వెళ్ళిపోతాడు. మలిదేవుడు బ్రహ్మనాయుడుతో వెళ్ళిపోతూ రాజ్యాన్ని పంచమనడంతో మాచెర్ల సీమను మలిదేవునికి ఇస్తాడు నలగామరాజు. మాచర్లను బ్రహ్మనాయుడు సహకారంతో పాలిస్తున్న మలిదేవుడుని చూసిన నాగమ్మకు కోపం తారాస్థాయికి చేరుతుంది. కోడిపందాలు పెట్టించి మలి దేవుణ్ణి ఓడిస్తుంది. ఫలితంగా ఏడేళ్ల వనవాసం చేయాల్సి వస్తుంది. వనవాసం అయ్యాక రాజ్యం కోరితే, నాగమ్మ ప్రేరణతో రాయబారి అలరాజు హత్యకు గురి అవుతాడు. యుద్ధం ప్రారంభమవుతుంది. బ్రహ్మనాయుడు కుమారుడు బాలచంద్రుడు భార్య మాటలతో యుద్ధరంగానికి వెళ్లి అలరాజుని చంపిన నరసింగరాజు తల నరుకుతాడు. ఇందులో సతీసహగమనం కూడా వుంది.
బాలచంద్రుడు మరణంతో బ్రహ్మనాయుడు చెలరేగిపోతాడు. పల్నాడు వల్లకాడుగా మారిపోవడంతో పశ్చాత్తాపం ఏర్పడుతుంది బ్రహ్మనాయుడు, నాగమ్మలకు.
'ఎవరవయా దేవా, తానా పంతము నాతోనా, ఝణఝణ కాలాంతకి', పాటలను కన్నాంబ, 'చందమామా ఓ చందమామా', 'ఈ కుహురాత్రి నా రాజు వేంచేయునా', 'రణములో తొడగొట్టి రాగోల బట్టి', 'రతిరాజ సుందరా, రణరంగ ధీరా' పాటలను ఎస్‌.వరలక్ష్మి మేత దారినబడ్డ మేలంపుటావ్‌, తీరిపోయనా... మాతా...' పాటలను ఘంటసాల, 'తెర తీయగా రాదా దేవా' పాటను ఘంటసాల, కన్నాంబ, 'చూతము రారయ్యా, చెన్నమ్మను' పాటను ఘంటసాల, అక్కినేని, వచ్చునటే రాజూ పాటను ఉడుతా సరోజిని, నేడే నిజమురా పాటను సుందరమ్మ ఓహో చారుశీలా పాటను అక్కినేని, ఎస్‌.వరలక్ష్మి ఆలపించారీ చారిత్రక చిత్రంలో.
మాటలు పాటలు సముద్రాల రాఘవాచార్య, సంగీతం గాలి పెంచల నరసింహారావు, ఛాయాగ్రహణం జితేన్‌ బెనర్జీ, సౌండ్‌ దిన్షా కె టెహ్రాని, కళ నాగూర్‌, ఎస్‌.వాళి సమకూర్చారు.
గొల్లభామ
మీర్జాపురం రాజా శ్రీ శోభనాచల గొల్లభామ సి. పుల్లయ్య దర్శకత్వంలో 'గొల్లభామ' చిత్రాన్ని నిర్మించారు. కృష్ణవేణి, ఈలపాట రఘురామయ్య ఈ చిత్రంలోని ముఖ్య పాత్రధారులు. దాసరి కోటిరత్నం, లీలాబాయి, సుందరమ్మ, గంగారత్నం, రామిరెడ్డి, వెల్లంకి, తీగల, రేలంగి, ఎ.వి.సుబ్బారావు, కోటేశ్వరరావు, మల్లికార్జునరావు, కె.వి.సుబ్బారావు, రామమూర్తి మిగతా పాత్రలు పోషించారు.
సంగీతం ఎస్‌.బి.దినకర్‌ రావు, ఛాయాగ్రహణం కొట్నిస్‌, కళ శర్మ, ప్రొడక్షన్‌ బి.ఎ.సుబ్బారావు నిర్వహించారు.
రాధిక
ఆర్‌. బాలసరస్వతి, పద్మనాభరావు ముఖ్యపాత్రలు పోషించిన 'రాధిక' చిత్రాన్ని శ్రీ ఛత్రపతి పతాకాన ఆర్‌.పార్థ సారథి నాయుడు నిర్మించారు. కాళ్ళకూరి సదాశివరావు ఈ చిత్రానికి దర్శకుడు. అంతకుముందు చింతామణి, కుచేల, సులోచన, లంకా దహనం చిత్రాలను డైరక్ట్‌ చేసారు కాళ్ళకూరి సదాశివరావు.
బ్రహ్మరథం
భక్త మార్కండేయ, మైరావణ, దక్షయజ్ఞం, భక్త ప్రహ్లాద, సంసారనారది చిత్రాలకు దర్శకత్వం నెరపిన చిత్రపునారాయణ మూర్తి దర్శకత్వంలో శ్రీ వెంకట్రామా పతాకాన 'బ్రహ్మరథం' చిత్రం నిర్మించారు. అద్దంకి, జయమ్మ ఈ చిత్రానికి ముఖ్య పాత్రధారులు.
సోర్స్- ఆంధ్రప్రభ న్యూస్,   వి.ఎస్‌.కేశవరావ్‌

నాడు కళకళ.. నేడు వెలవెల


సోర్స్-  Sakshi 
పల్నాటి చరిత్రకు సజీవసాక్ష్యాలుగా నిలిచిన చారిత్రక కట్టడాలు కనుమరుగవుతున్నాయి. నేటి తరానికి వాటి గురించి తెలియకపోవడం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆదరణ కోల్పోతున్నాయి. పల్నాటి చరిత్రలో ప్రాముఖ్యతను సంపాదించుకున్న కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. దాచేపల్లి మండలం గామాలపాడులో ఉన్న చెన్నమల్లికార్జున స్వామి ఆలయం ప్రస్తుతం అలాంటి దుస్థితిని ఎదుర్కొంటోంది.

గలగలపారే జీవనది నాగులేరు ఒడ్డున, ఆధ్యాత్మికతను పెంపొందించేలా 12వ శతాబ్దంలో నాటి జిట్టగామాలపాడు గ్రామంలో శ్రీచెన్నమల్లికార్జునస్వామి దేవాలయాన్ని నిర్మించారు. పల్నాటి బ్రహ్మనాయుడు మాచర్లలో చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మిస్తే, పల్నాటి తొలి మహిళ మంత్రి నాయకురాలు నాగమ్మ ఈ ఆలయాన్ని సుందరంగా కట్టించారు. పూర్వీకుల ప్రభువు కల్యాణ చక్రవర్తుల వాస్తు ప్రకారం 32 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పుతో ఆల యం నిర్మితమైంది. ఆలయానికి నాలుగువైపులా పార్వతి, భైరవుడు, గణపతి, దుర్గాదేవి ఆలయాలను కట్టించారు. ద్వార బంధాలపై దిండిమొండి విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఆలయ పై భాగంలో గజలక్ష్మిలను రాళ్లపై చెక్కారు.

గర్భగుడి ముందు చెన్నమల్లికార్జున స్వామి దేవాలయంగా శిలాశాసనం చెక్కించారు. నైరుతి దిక్కున ఉమమహేశ్వరుల విగ్రహం, దక్షిణం, తూర్పున ఆలయంలో ప్రవేశించేందుకు మెట్లమార్గం, ఈశాన్యం వైపున కోనేరు, ఆగ్నేయం వైపు సప్తమాతల విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఆలయం చుట్టూ 3 అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల ఎత్తులో నిర్మించిన కోటగోడ కనిపిస్తుంటుంది. నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లపై అద్భుత శిల్పాలను చెక్కారు. క్షీరసాగర మదనం, గజలక్ష్మీలతో పాటు వివిధ రకాల శిల్పాలను రాళ్లపై చెక్కారు. అప్పట్లో ఆలయానికి వచ్చిన నలగామరాజు విశ్రాంతి తీసుకునేందుకు నాయకురాలు నాగమ్మ ఏర్పాట్లు చేసినట్లు చరిత్ర చెబుతోంది. అప్పుడు నాగమ్మ పనితీరును మెచ్చిన నలగామరాజు మంత్రి పదవి ఇచ్చినట్లు చెబుతుంటారు.

నేడు కళా విహీనం.: నాడు ఎంతో వైభవంగా వెలుగొందిన ఆలయం నేడు కళా విహీనంగా మారి వెలబెలబోతోంది. ఆలయ గర్భగుడిలో నిధులు ఉన్నాయనే అనుమానంతో కొందరు దుండగులు తవ్వకాలను జరిపారు. ఆలయం ముందున్న కోనేరులో చిన్నపాటి బ్లాస్టింగ్ చేసినట్లు అక్కడి పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఆలయం చుట్టూ కూడా తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు ఉన్నాయి. దేవాలయానికి 22 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఆక్రమణలు పోనూ ప్రస్తుతం 10.40 ఎకరాలే మిగిలింది. పురావస్తుశాఖ ఈ ఆలయాన్ని రక్షిత కట్టడంగా గుర్తించినా, రక్షణ కోసం తీసుకున్న చర్యలు తీసుకోలేదు.  పురావస్తుశాఖ, ప్రభుత్వం స్పందించి పల్నాటి చరిత్రకు సజీవసాక్ష్యంగా నిలిచిన ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మార్మోగిన పల్నాటి రణ భేరి

 

సమ్మోహితులను చేసిన శ్రీదేవి సిస్టర్స్ బుర్రకథ

బ్రహ్మనాయుడు రోషంతో మీసం తిప్పితే నాయకురాలు నాగమ్మ ముంజేతి రోమాలు రోషాగ్నులై భగ్గుమన్నాయి. మగువ మాంచాల మానోహర సుందర రూపమే బ్రహ్మనాయుడి పుత్రుడి ప్రేమగీతమై పరవశించింది. అలరాజు ఆగ్రహం...నాయకురాలి కుతంత్రాలు...పద్యాలై పరవళ్లుతొక్కాయి. నరసింగుడి రాణువ... బాలచంద్రుడి తెగువ కత్తులు దూసి నెత్తురోడ్చి నేలకూలాయి. దాయాదుల రాజ్య కాంక్ష, ఆరాటాలు, పోరాటాలు, నాగులేటి నేలమీద చిత్తుగా ఓడి నెత్తురోడ్చాయి. గురుజాల నాగమ్మ పుంజు.. మాచర్ల బ్రహ్మన్న పుంజు.. కాళ్లకు కత్తులు కట్టి రెక్కలెత్తివచ్చి పోరాడుతున్నాయా అన్నట్టు పురమందిరంలో యుద్ధ వాతావరణం కనిపించింది. ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న సింహపురి సంగీత సభ మంగళవారం రాత్రి వికృతి నామ సంవత్సర తెలుగు ఉగాది పర్వదిన వేడుకల సందర్భంగా బుర్రకథను ఏర్పాటుచేశారు. ఒంగోలు సాయి బుర్రకథ దళం శ్రీదేవి సిస్టర్స్ వేదవతి భాగవతారిణి (ప్రధాన కథకులు) శ్రీదేవీ భాగవతారిణి (హాస్యం), భారతి (వంత) ప్రదర్శించిన పల్నాటి యుద్ధం బుర్రకథ పుర మందిర ప్రేక్షకులను 900 సంవత్సరాల వెనక్కు తీసుకువెళ్లింది. లాగులేటి ఒడ్డున జరిగిన పల్నాటి యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూపించింది. టివిలు, సినిమాలతో విసిగి వేసారుతున్న నగర ప్రజలకు శ్రీదేవి సిస్టర్స్ తమ బుర్రకథతో ఆనందాన్ని కలిగించారు. కధాగమనం కరుణ, వీర రసాలు ప్రధానంగా సాగేదే అయినా సందర్భోచితమైన హాస్యం, లాస్యం, శృంగార రసాలుసైతం పండించింది. మరుగున పడిపోతున్న ప్రాచీన జానపద కళారూపాలను ఒక్కసారిగా తెరపైకి తెచ్చి వాటిలోని మాధుర్యాన్ని ప్రేక్షకులకు చవిచూపించారు. సాధారణంగా మహిళలు హరికథలు చెప్పడం అందరికీ తెలిసిన విషయమే అయినా బుర్రకథలు చెప్పే మహిళలు చాలా తక్కువమందే ఉంటారు. ఎక్కువ భాగం బుర్రకథలు వీర రస ప్రధానమైనవి కావడం వల్ల సహజసిద్ధమైన ఒడ్డుపొడుగు కలిగి, ఆకార, ఆహార్యాల్లో ప్రత్యేకత కలిగిన పురుషులే బుర్ర కథలు చెప్పడంలో రాణిస్తుంటారు. ఇందుకు పూర్తి భిన్నంగా ఆకార, ఆహార్యాల కంటే ప్రతిభా పాఠవాలే కథకులకు ప్రధాన అర్హతలని చాటి చెపుతూ శ్రీదేవి సిస్టర్స్ ప్రదర్శించిన పల్నాటి యుద్ధం బుర్రకథ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుని పల్నాటి యుద్ధాన్ని బుర్ర కథ రూపంలో అదికూడా కేవలం 3గంటల్లో చెప్పడం చాలా కష్టమైన విషయం. టివి, సినిమాలకు అతుక్కుపోయేవారిని సైతం పురమందిరానికి రప్పించి మూడు గంటలపాటు కూర్చోబెట్టగలిగిన ఘనత శ్రీదేవి సిస్టర్స్‌కే దక్కిందంటే అతిశయోక్తి కాదు. ఆకార, ఆహార్యాల్లోని లోపాలను సైతం అధిగమిస్తూ సహజసిద్ధంగా సంక్రమించిన హావ, భావ నాట్య, నటనా చమత్కార విన్యాసాలతో, కథకులు ఆద్యంతం కథా గమనాన్ని రక్తి కట్టించారు. నేటి తరానికి తగ్గట్టుగా సినిమా పాటలు, ధ్వన్యనుకరణ, జోకులు, పిట్టకథలు జోడిస్తూ కథను ముందుకు నడిపిన తీరు అద్భుతం. ముఖ్యంగా నలగామ నాయుడు గుర్రం ఎక్కి వేటకు వెళుతున్న దృశ్యాన్ని మిమిక్రీ ద్వారా కళ్లముందు ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. గురుజాల మాచెర్ల కోడిపుంజలు వీర శివాలెత్తి పోరి తన్నుకున్న వర్ణన తరతరాల తెలుగు సంప్రదాయ లోటుపాట్లను ఎత్తి చూపింది. రాయబారంలో అలరాజు ఆగ్రహాన్ని అలవోకగా భరించిన నాగమ్మ అదును చూసి విషం ప్రయోగించడం ద్వారా అతడిని మట్టుపెట్టిన విధానం ఉత్కంఠత రేపింది. కదన కుతూహలంతో బాలచంద్రుడుర భార్య మాంచాల అందాన్ని చూసిన ఘట్టంలో కథకులు పండించిన సుకుమార శృంగారం అద్భుతంగా ఉంది. అంతలోనే ఫటఫట పళ్లు కొరుకుతూ బాలచంద్రుడు యుద్ధ రంగంలోకి ఉరికిన వైనాన్ని వీర రస ప్రధానంగా అభినయించిన తీరు ప్రేక్షకుల ఉత్కంఠ కలిగించింది. యుద్ధ భూమిలో నరసింహుడి కత్తివేటుకు బాలచంద్రుడి పేగులు బయటకు పెళ్లుకు రావడం ఆ పేగుల రక్తాన్ని నాగులేటి నీటితో కడిగి తిరిగి పొట్టలో కూర్చుకుని రక్తసిక్తమైన రూపంతోనే కదన కుతూహలుడైన విధానాన్ని వర్ణించిన తీరు ప్రేక్షకులకు గగుర్పాటు కలిగించింది. బాలచంద్రుడు మరణించడం, మరణవార్త తెలుసుకుని బాలచంద్రునిపైబడి తండ్రి బ్రహ్మనాయుడు రోధించిన విధానాన్ని కరుణ రసం ఉట్టిపడేలా హృద్యంగా పద్యంలో చెప్పిన తీరు ప్రేక్షకులను కన్నీటి పర్యంతం చేసింది. జనరంజకంగా మహిళలు బుర్రకథను చెప్పడం చాలా అరుదైన విషయం. ఆటను ఆధునికంగా, పాటను పాటవంగా, పద్యాన్ని హృద్యంగా, మాటను మధురంగా, సన్నివేశాన్ని సందర్భోచితంగా ఆడిపాడి పలికి, నటించి, నర్తించి నేటి తరానికి సైతం మెచ్చేలా ప్రేక్షకులను ఒంగోలు సిస్టర్స్ మంత్రముగ్థులను చేశారు. ఈకార్యక్రమంలో యజ్ఞనారాయణ కీబోర్డు, బాబూరావు డోలక్‌పై సహకరించారు. జిల్లా కలెక్టర్ కె రాంగోపాల్ దంపతులు, పలువురు అధికారులు, అనధికారులు, రాజకీయనాయకులు, పుర ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. కథకులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమాన్ని సింహపురి సంగీత సభ అధ్యక్ష, కార్యదర్శులు వాకాటి విజయకుమార్‌రెడ్డి, బివి నరసింహం పర్యవేక్షించారు.

Thursday 4 December 2014

కన్నెగంటి హన్మంతు

పల్నాడు తాలూకాలో జరుగుతున్న పన్నుల నిరాకరణ, ప్రభుత్వ వ్యతిరేక సహాయ నిరాకరణోద్య మాన్ని చూసిన యువకుడు కన్నెగంటి హన్మంతు- జిల్లాలో అనేకమంది గ్రామాధికారులు రాజీ నామాలిచ్చి సహాయ నిరాకరణోద్యమానికి తోడ్పడు తుంటే- మించాలపాడు గ్రామాధికారులు మాత్రం ప్రభుత్వానికి విశ్వాసపాత్రులుగా వున్నారు.  గ్రామంలో ప్రజలందరినీ ఏకం చేసి పుల్లరి వ్యతిరేక ఉద్యమానికి నాందిపలికాడు. ఆజానుబాహుడు, ఆత్మబలశాలి, హన్మంతు ఆ గ్రామ ప్రజలందరికీ ఆప్తుడుగా వున్నాడు. హన్మంతు నాయకత్వాన ప్రజ లంతా కదిలారు. పుల్లరి లేదు గిల్లరి లేదు. అడవి సంపద మన పేద వాళ్లదేన న్నారు. ఇన్నాళ్ళు సాగిన దోపిడీ, దౌర్జన్యం ఇక చెల్లదన్నారు.
పుండాకోరు మునసబ్‌ ప్రభుత్వానికి రిపోర్టు పంపాడు. అది ప్రజలు గమనించారు. మునసబ్‌- కరణం ఉద్యమ ద్రోహులుగా భావించి-వారిని సాంఘికంగా బహిష్కరించారు. ఇంతకాలం సాగిన వారి పెత్తనం కూలిపోయింది. ప్రజలు మేలు కున్నారు. దీనంతటికీ కారణం హన్మంతేనని- లేనిపోనివన్నీ కల్పించి కలెక్టర్‌కు మొరపెట్టు కున్నాడు మున్సబు. జిల్లాకలెక్టర్‌ వెర్నన్‌, అడిషనల్‌ కలెక్టర్‌ పేరుమోసిన క్రూరుడు రూధర్‌ఫర్డు. మించాలపాడు ఘటనలు తీవ్ర రూపం దాల్చాయని ప్రకటించారు. అటవీ అధికారులు, పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. మాచర్లకు 20 మైళ్ళ దూరంలో వుంది మించాలపాడు. 1922 ఫిబ్రవరి 26, 20 మంది పోలీసు బలగంతో ఎస్‌.ఐ. మించాలపాడు చేరాడు. వారికి తోడుగా అసిస్టెంట్‌ ఫారెస్టు కంజర్‌వేటర్‌ - మరో 20 మంది పోలీసు బలగంతో వచ్చాడు. వారితోపాటు కరణం వున్నాడు. అడవిలో మేస్తున్న గేదెలు, ఆవులను తోలుకెళుతున్నారు. ఈ వార్త గ్రామంలో వున్న హన్మంతుకు, ప్రజలకు అందింది. వందలాది మంది స్త్రీలు, పురుషులు వెళ్ళి వారికి అడ్డునిలిచారు. పశువుల్ని, పశువుల కాపరులను వదిలేయమన్నారు. అధికార బలంతో పోలీసులు ప్రజలపై బలప్రయోగానికి పూనుకున్నారు. మాటల తో లాభంలేదు - పిరికి పందల్లా కూర్చోలే మన్నాడు హన్మంతు. ఆడ,మగ తేడాలేకుండా ప్రజలు దొరి కిందల్లా అందుకున్నారు. కర్రలు, రోకళ్ళు, రాళ్ళు, రప్పలు తీసుకొని పోలీసులపై విరుచుకుపడ్డారు. పశువులు, పశుల కాపరులను విడుదల చేసుకున్నారు. ఇది ప్రభుత్వానికి తలవంపు అయ్యింది. ఎలాగైనా హన్మంతును హతమార్చాలని కుట్ర పన్నారు.
అప్పుడు కారంపూడిలో బసచేసివున్న కలెక్టర్‌కు యీ వార్తచేరింది. అదనపు బలగాలు దిగాయి (స్వయంగా అడిషనల్‌ కలెక్టర్‌ రూధర్‌ఫర్డు 100 మంది సైనికులతో వచ్చాడని మరో చరిత్ర)
తిరిగి పోలీసుబలగాలకు ప్రజలకూ మధ్య పోరాటంసాగింది. పోలీసుల చేతుల్లో మారణా యుధాలున్నాయి. ప్రజల చేతుల్లో కర్రలు-రాళ్ళు మాత్రమే వున్నాయి. అయినా ప్రజల పట్టుదల - హన్మంతు నాయకత్వం వారిని రౌద్రమూర్తులను చేసింది. పోలీసులు తుపాకులను పేల్చారు. చెట్టు - రాయి అడ్డుపెట్టుకుని ప్రజలు రాళ్ళు విసిరారు. ''మీకేకాదురా మాకూ ప్రజాబలముంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కదిలివచ్చి - మీ అంతం చూస్తారని'' ఆడవాళ్ళు హెచ్చరించారు.
పోరాటం సాయంత్రం 4-5గంటల మధ్య జరిగిందని జిల్లాకలెక్టర్‌ తన రిపోర్టులో తెలియ జేశాడు. అదే రిపోర్టులో తాను మాచర్ల నుండి జిల్లా పోలీసు సూపరింటెండెంటు, జిల్లా అటవీ అధికారి, యితర బలగంతో మించాలపాడు చేరుకున్నట్లు రాశారు. కాబట్టి పోరాటం కలెక్టర్‌ రూధర్‌ఫర్డు ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరిగిందనడంలో సందేహంలేదు. పోరాట యోధుడుగా, ధైర్యసాహ సాలు ప్రదర్శించిన హన్మంతు ప్రాణాలు తీయడం వారి ప్రధాన కర్తవ్యంగా ఎంచుకున్నారు. పోరాటం లో ముందు నిలిచిన హన్మంతు గుండెకు గురిపెట్టారు. వీరుడుగా హన్మంతు ఒరిగిపోయాడు. అతనితో పాటు మరో రైతుబిడ్డ - పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, గుర్రాన్ని మేపే అమాయకుడు హతుల య్యారు. అనేకమంది గాయపడ్డారు. హన్మంతు మరణం తర్వాత చాలామందిని అరెస్టుచేశారు. స్వాతంత్య్ర సమరంలో తెలుగునేలపై తొలివీరుడు కన్నెగంటి హన్మంతు 1922 ఫిబ్రవరి 26న ఒరిగిపోయాడు. హన్మంతు మరణవార్త ఆంధ్రప్రదేశంలో అగ్నిజ్వాలలు రేపుతుందని ప్రభుత్వానికి తెలుసు. హన్మంతు, తాగుబోతు-తిరుగుబోతు- పేరుమోసిన రౌడీ, ప్రజల మాన - ప్రాణాలతో చెలగాటమాడే ద్రోహి అని, అధికారులను చంపడానికి ప్రయత్నించాడని ప్రచారం చేశారు. ఇదే విషయాన్ని కలెక్టర్‌ ప్రభుత్వ కార్యదర్శికి పంపిన రిపోర్టులో రాశాడు.
ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్‌ నేతలు కూడా హన్మంతుకు అన్యాయం చేశారు. దాన్నొక అరాచకంగానే భావించారు. హన్మంతు త్యాగాన్ని గుర్తించలేదు. కానీ, మించాలపాడు, పల్నాడుప్రాంత ప్రజలు మాత్రం అమరవీరుడు హన్మంతుకు అశ్రునయనాలతో జోహారులర్పించారు. పలనాటి వీరుడిగా కొనియాడారు. తమ హృదయాల్లో ఆ వీరుని త్యాగాన్ని పదిలపరుచుకున్నారు. మించాలపాడులో స్మారక చిహ్నం నిర్మించుకున్నారు. హన్మంతు మరణించిన రెండు సంవత్సరాలకు - మరో ఆంధ్రవీరుడు అల్లూరి సీతారామరాజు అమరత్వమొందిన తర్వాత 1924 అక్టోబరు 19 నాడు - ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ హన్మంతు త్యాగాన్ని గుర్తించింది.
''1922 - ఆంధ్రప్రదేశ్‌లో సహాయ నిరాకరణోద్యమం ముమ్మరంగా సాగుతున్నపుడు, గుంటూరు జిల్లా, పల్నాడు తాలూకా మించాలపాడులో పుల్లరి చెల్లించలేదన్న కారణంగా కన్నెగంటి హన్మంతుని క్రూరంగా చంపిన కొంతమంది అధికారుల దుష్టచర్యను యీ మహాసభ ఖండిస్తున్నది. ఆ మహావీరునికి జోహారులర్పిస్తున్నది. వారి కుటుంబ సభ్యులకు సంతాప, సానుభూతిని తెలియజేస్తున్నది. ఆ వీరుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నది. హన్మంతు మరణానంతరం అతని భార్య, కుటుంబసభ్యులు స్థూపంవద్ద అతని జీవిత విశేషాలతో నెలకొల్పిన ఫలకాన్ని ధ్వంసం చేసిన అధికారుల అక్రమచర్యను గర్హిస్తున్నది. ఆ ఫలకాన్ని తిరిగి నెలకొల్పాలని అందులో యీ విధ్వంస చర్యను కూడా రాయాలని యీ మహాసభ కోరుతున్నది. ఇందుకోసం పూనుకోవాలని తీర్మానిస్తున్నది''?
అభినవ బాలచంద్రుడు - అస్తమించాడు. సంవత్సరాలు గడిచాయి. హన్మంతు పేరు, హన్మంతు ఊరు, హన్మంతు త్యాగం చరిత్రలో మరుగున పడిపోయింది.

courtesy visalaandhra -కందిమళ్ళ ప్రతాపరెడ్డి

బంగారు చరితల కుండ నాగార్జున కొండ

బంగారు చరితల కుండ నాగార్జున కొండ
చారిత్రక భాండాగారంగా భాసిల్లుతున్న రమణీయ ప్రదేశం నాగార్జునకొండ. నాగార్జునసాగర్‌ జలాలపై లాంచ్‌లో 14 కి.మీ. ప్రయాణించి నాగార్జున కొండకు చేరుకోవచ్చు. దీన్నే పూర్వం 'శ్రీపర్వతం' 'విజయపురి' అని పిలిచేవారు. ఆచార్య నాగార్జునుని బోధనలు వెల్లివిరిసిన చోటు కావడంతో దీనికి నాగార్జున కొండ అనే పేరు వచ్చింది. ఒకవైపు కృష్ణానది నీటితో, మిగిలిన మూడువైపులా నల్లమల కొండలతో పరివేష్టితమై ఈ నాగార్జునకొండలోయ 25 కి.మీ విస్తీర్ణంలో ఉంది. తొలిసారిగా 1926లో మద్రాసు పురావస్తు శాఖలో పనిచేసే ఎ.ఆర్‌. సరస్వతి నాగార్జున కొండను కనుగొన్నాడు. ఈ ప్రాంతంలో తొలిసారిగా త్రవ్వకాలు నిర్వహించిన వ్యక్తి ఎ. హెచ్‌. లాంగ్‌ హార్ట్‌. అనంతరం టి.ఎన్‌. రామచంద్రన్‌, ఆర్‌. సుబ్రహ్మణ్యం ఇక్కడ త్రవ్వకాలు జరిపారు. మనదేశం తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చొరవతో భారత పురావస్తుశాఖ 1954 తరువాత ఆరు సంవత్సరాలు త్రవ్వకాలు జరిపి అనేక అంశాలు వెలుగులోకి తెచ్చారు.
పూర్వయుగంనాటి అవశేషాలు
నాగార్జున కొండ త్రవ్వకాల్లో చరిత్ర పూర్వయుగ అవశేషాలు అనేకం బయల్పడినాయి. ఇవి భూమి ఉపరిభాగాన, నదీ తీరంలో లభించాయి. ప్రాచీన, మధ్య, నవీన, శిలాయుగ పరికరాలు ఇచ్చట దొరికాయి. రాతి గొడ్డళ్లు, మొనతేలిన రాతి పనిముట్లు, బూడిదరంగు కుండపెంకులు లభ్యమైనాయి. పెద్ద మట్టి పాత్రలో పసిపాపను పెట్టి పూడ్చిన సమాధి, రాగి ముక్కలుకూడా లభించాయి. ఇంకా పుర్రెలు, అస్థికలు, సమాధిలో కుండ సామాగ్రి దొరికాయి.

శాతవాహన యుగం నాటి అవశేషాలు
శాతావాహన యుగంనాటి నాణాలు, పూసలు, మట్టిబొమ్మలు, ఇనుపవస్తువులు, బంగారు ఆభరణాలు దొరికాయి. లభించిన నాణాలలో రోమన్‌ చక్రవర్తికి సంబంధించినవి రెండు, యజ్ఞశ్రీ కాలంనాటి సీసపు నాణాలు కూడా లభించాయి. బౌద్ధవిశ్వవిద్యా లయం, సింహళవిహారం బయల్పడినాయి.
ఇక్ష్వాకుల కాలంనాటి విశేషాలు
శాతవాహనుల -వీరాంధ్రలో ఇక్ష్వాకులు విజయపురిని రాజధానిగా చేసుకొని రాజ్యమేలారు. వీరిశాసనాలు దాదాపు 45 వరకు దొరికాయి. ఈ కాలంనాటి రాజులు వైదిక మతాన్ని అవలంభించారు. కానీ అంత:పుర స్త్రీలు బౌద్ధమతాన్ని ఆదరించారు. వీరి ఆదరణలో నాగార్జునకొండ సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైంది.

బౌద్ధ అవశేషాలు
నాగార్జున కొండలో లాంగ్‌హార్ట్స్‌ అనే వ్యక్తి నిర్వహించిన త్రవ్వకాల్లో అనేక సత్ఫలితాలు గోచరించాయి. ఒక మహాచైత్యము, ఆరు గజపుష్పాకార చైత్యగృహాలు, ఎనిమిది చిన్న స్తూపాలు, నాలుగు మంటపాలు బయల్పడినాయి. రామచంద్రన్‌ జరిపిన త్రవ్వకాల్లో రెండు చైతన్యగృహాలు, ఆర్‌. సుబ్రహ్మణ్యం జరిపిన త్రవ్వకాల్లో, 26 విహారాలు, 10 స్తూపాలు లభ్యమైనాయి.
స్థూపం:- నాగార్జున కొండపై బయల్పడిన స్తూపాలు చక్రాకృతిలో నిర్మించబడినాయి. ఆకులవలె నిర్మితమైన గోడల మధ్య ప్రదేశాన్ని మట్టితో నింపి, దాని చుట్టూ ఇటుక కట్టడం కట్టి దానిపై అండము నిర్మించారు. నిర్మాణంలో ఇటుకలు, సున్నం వాడబడినాయి. విహారాలు:- నాగార్జున కొండపై సింహళ విహారం బయల్పడింది. ఈ విహారంలోగల బోధివృక్షానికి బోధిశ్రీ ఒక వేదికను నిర్మింప జేసింది. నాగార్జున కొండలోని స్తూపాలు, చైత్యగృహాలు, విహారాలు, విహార నిర్మాణానికి కావలసిన శిల్పఫలకాలను అనేక మంది వర్తకులు, స్త్రీలు దానం చేసినవి.
బౌద్ధశిల్పాలు:- వీటిలో రెండురకాలున్నాయి. పూర్తిగా స్వదేశీయమైనవి. ఇది సాంచీ శిల్పాలకు సన్నిహితంగా ఉంటాయి. రెండో రకం శిల్పాలలో గాంధార లక్షణాలు కనిపిస్తాయి. లాంగ్‌ హార్ట్స్‌ జరిపిన త్రవ్వకాలలో 500పైగా శిల్పాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శిల్పాల్లో బౌద్ధమతానికి చెందిన జాతక కథలు, బుద్ధుని జీవిత విశేషాలు కనిపిస్తాయి. ఇంకా అనేక భంగిమలలో బుద్ధుని ప్రతిమలు లభించాయి. నాగార్జున కొండలో కవచం ధరించిన ఒక వీరుని విగ్రహం లభించింది.
బ్రాహ్మణదేవాలయాలు:- ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధమతం తో పాటు బ్రాహ్మణమతం కూడా ఎంతో అభివృద్ధి చెం దింది. నాగార్జునకొండ త్రవ్వకాల్లో బయల్పడిన బ్రాహ్మణ దేవాలయాలు ఇక్ష్వాక రాజుల వైదికమత అభిమానానికి నిదర్శనాలు. ఇక్కడ నిర్మితమైన ఆలయాలలో భుజ స్వామి, పుష్పభద్రస్వామి, హారీతి, సర్వదేవ, కార్తికేయ, నవగ్రహ దేవళాలు, శిల్పాలలో కార్తికేయ, దేవసేన, సతిశిల్పం ఇత్యాది బ్రాహ్మణ శిల్పాలు ముఖ్యమైనవి.
మ్యూజియం:- ఇక్ష్వాక రాజ్య పతనానంతరం పల్లవుల కాలంలో బౌద్ధమతం క్షీణించడం ప్రారంభమైంది. పోయినవి పోగా మిగిలిన మట్టిపాత్రలు, శిల్పాలు, నాణాలను నాగార్జున కొండపై నిర్మితమైన మ్యూజియంలో పర్యాటకుల సందర్శనార్థం భద్రపరిచారు. నదీ ప్రవాహం మధ్యలో ఎత్తైన కొండమీద మ్యూజియం నిర్మించడం బహుశా నాగార్జున కొండపై ఇదే ప్రథమమని చెప్పవచ్చు.
సోరుసు --షేక్‌ అబ్దుల్‌ హకీం జాని, ఆంధ్రప్రభ పత్రిక

నాగార్జునకొండ మ్యూజియం

    చరిత్రకు సాక్ష్యం..
    నాగార్జునకొండ మ్యూజియం
    అపారమైన కళా సంపద లభ్యం
    విశేషంగా ఆకట్టుకుంటున్న పురావస్తు ఆధారాలు
    దేశ, విదేశాల నుంచి పర్యాటకుల రాక
    నేడు వరల్డ్ మ్యూజియం డే 
    చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నాగార్జున కొండ మ్యూజియం నిలుస్తోంది. ఇక్కడ పురాతన వస్తువులు, చరిత్రకు సంబంధించిన ఆధారాలు, బుద్ధుడి విశేషాలు లభిస్తున్నాయి. వీటి గురించి తెలుసుకునేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. నేడు వరల్డ్ మ్యూజియం డే సందర్భంగా ఒకసారి నాగార్జున కొండ మ్యూజియం గురించి తెలుసుకుందాం..

    - టీ మీడియా, నాగార్జునసాగర్
    నాగార్జునసాగర్‌కు సమీపంలో కష్ణానది రిజర్వాయర్ మధ్యనున్న నాగార్జునకొండ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడికొచ్చిన పర్యాటకులు బుద్ధుడి ప్రతిమకు ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తుంటారు. ప్రపంచంలో మానవ నిర్మిత జీవి మ్యూజియంలో ఇది మూడోది. మహాయాన బౌద్ధ ప్రవక్త ఆచార్య నాగార్జునుడి మహా విశ్వవిద్యాలయం, బుద్ధుడి మహాస్తూపం, విశాలమైన వివిధ భిక్షు విహారాలు మొదలైన వాటితో ఇక్షాకుల రాజధానిగా విరసిల్లిన విజయపురి ప్రాంతం సాగర్ గర్భంలో ముంపునకు గురికాకుండా పురావస్తు శాఖ అక్కడి విశేష సామాగ్రిని పరిరక్షించి నాగార్జునకొండ మ్యూజియంలో భద్రపరిచింది.

    అందులోని రాజ్యచౌదాలు, సింహాల విహారం, పాతరాతి యుగం, నాటి సమాధుల మధ్య కొత్తరాతి యుగంలోని పరికరాలు ఆకాలంలో వాడుకలోని బంగారు నగలు, నాణేలు, ఇతర పనిముట్లు, శిలాశాసనాలు, తదితర వస్తువులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాగార్జునకొండ లోయలో బౌద్ధ శిథిల అవశేషాలు, ఇక్షాకుల విజయపురి శిథిలాలు ఏవిధంగా బయట పడ్డాయే వాటిని అదేవిధంగా పొందుపర్చారు. 
    ఇక్షాకుల శిలాశాసనలు, వారి జీవిత విశేషాలు, చౌదా స్తంభాలు, తదితరమైనవి సైతం మ్యూజియంలో ఉన్నాయి. విరిగిపోయిన శిల్పాలను అతికించి వాటి పూర్వపు ఆకారాన్ని కళ్లకు కట్టడం ఈ మ్యూజియంలోని ప్రత్యేకత. ఇక్కడి శిలలు, గౌతమ బుద్ధుని జీవిత విశేషాలు, ఆయన జాతక కథలు, మొదలైన వాటిని విపులంగా విశదీకరిస్తాయి. ఇవి నాటి శిల్పుల పనితనానికి నిదర్శనంగా నిలుస్తాయి. మ్యూజియం చుట్టుపక్కల ఉన్న కొన్ని కట్టడాలు వాటి పరిస్థితులను కళ్ల ముందు నిలుపుతాయి. 

    నాగార్జున విశ్వవిద్యాలయం..
    నాగార్జున విశ్వవిద్యాలయ శిథిలాల శేషాలు నాగార్జునకొండ లోయలో ఏవిధంగా ఉండేవో అదే విధంగా తిరిగి అమర్చారు. కష్ణానది తీరాన విశాల విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం ఉండేది. ఇది ప్రాచీన కాలపు గురుకులం. ఇక్కడ గురుశిష్యు నివాసాలు ఒకే దగ్గర ఉండేవి. సకల శాస్త్ర విజ్ఞాన కేంద్రమైన ఇది సమస్త విద్యలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ విశ్వ విద్యాలయంలో చైత్యగహానికి తూర్పున మూడు భాగాల ద్వారం ఒకటి ఉంది. ఒకే విహార భాగం ఐదు గదులు కలిగి మధ్య భాగంలో 55అడుగుల చతురాస్ర్తాకార మండపం ఉంది. దీన్ని విశ్వవిద్యాలయ లెక్చరర్ హాల్‌గా భావించేవారు. ఇక్కడ ఉన్న మరో మూడు గదులు బుద్ధ ధర్మ సంఘం, బౌద్ధ ఇక్షాక చిహ్నాలు కావచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో సర్క, తంత్ర, ఖనిజ, రసాయన, ఔషధ శాస్త్ర, శాస్ర్తాలు, మాధ్యమిక వాద, మహాయాన వాదాలను చిత్తశుద్ధులైన పండితులు, ఆచార్యులు బోధించే వారు. విశ్వ ఇక్షాక గ్రంథం, విషుధమగు రచయిత బుద్ధగోషుడు, ఆర్యదేవుడు, రాహువుడు, సిద్ధ నాగార్జునుడు మొదలైన వారు ఇక్కడ ఆచార్యులుగా పని చేసేవారు. ఇక్కడ విద్యను అభ్యసించేందుకు వివిధ దేశాల నుంచి తండోపతండాలుగా వచ్చేవారు. 

    హారతి దేవాలయం..
    విశ్వవిద్యాలయానికి కొద్ది దూరంలోనే హారతి దేవాలయం, దాని కింద చతురస్ర్తాకారంలో ఓ పెద్ద సరస్సు ఉంది. దీనికి నలు వైపులా మొట్లతో ఓడ్డు ప్రాంతాలు ఉన్నాయి. మెట్లపై గ్యాలరీ మాదిరిగా ఉండడంతో దీన్ని క్రీడాప్రాంతంగా భావించినా క్రీడా ప్రాంగణం మరో ప్రాంతంలో బయల్పడింది. 

    స్థాన వేదికం..
    నాగార్జున కొండపై ఇక్షాకుల రాజ్యసౌధ ప్రాగణ్యంలో కష్ణానదిని ఆనుకొని నిర్మించిన స్నానగట్టాల వేదికలు ఉన్నాయి. ఇది కేవలం స్నానాలకే కాక బస్సు సామాగ్రిని, నౌకల ద్వారా రవాణా చేయడానికి కాను రేవుగా సైతం వాడి ఉంటారని తెలుస్తుంది. ఈ స్నానపు గట్టాలు నునుపైన నాపరాళ్లతో చేయబడి నది స్నానానికి ఎంతో సౌకర్యంగా ఉండేవి. 

    కాకతీయ కట్టడాలు.. 
    మ్యూజియానికి సమీపంలోని కోట గోడలాంటి పెద్ద రాతి కట్టడం కాకతీయుల నాటి కట్టడంగా పరిగణిస్తున్నారు. కాకతీయులు ఈ ప్రాంతాన్ని సరిహద్దు సైనిక స్థావరంగా ఉపయోగించుకున్నరు అనడానికి ఈకోట గోడలు ఇప్పటికి సైతం చెక్కుచెదరకుండా ఉన్నాయి. 
    హిందూ దేవాలయాలు..
    కోట గోడలకు సమీపంలో పక్కపక్కనే రెండు హిందూ దేవాలయాలు ప్రాచీనమైనవి దర్శనమిస్తున్నాయి. కాకతీయుల కాలంలో వీటిని నిర్మించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం వీటి ఆలనాపాలన లేకపోవడంతో పాడుబడ్డ గబ్బిలాలకు ఆవాసాలుగా మారాయి. 

    మహా చైత్యం 
    ఇది బుద్ధధాతువుపై కట్టిన అందాల చైత్యం. ఈ స్తూపం నుంచి తవ్వి తీసిన ధాతువును ప్రస్తుతం బుద్ధుడి మొదటి ప్రసంగం చేసిన స్థారానదిలో ఉంచి పూజలు చేస్తున్నారు. ఇది శరీరక స్థూప జాతికి చెందినది. దీన్ని అంతర్భాగంలో బుద్ధ భగవానుడి అస్తికలు అమర్చబడి ఉన్నాయి. ఇది ప్రాచీన శిల్ప నిర్మాణ ప్రావీణ్యానికి నిదర్శనం. చక్రం, దాని ఆకులను ఇటుక గోడల్లా నిర్మించి ఆకుల మధ్య ఖాళీ స్థలాన్ని మట్టితో కప్పి స్తూపాకారంగా తయారు చేసి ఉపరితల భాగాన్ని చుట్టుపక్కల పాలరాతి పలకలు కట్టి అర్థగోలాకారంగా ఆశ్చర్యపోయేంత అందంగా దీనిని నిర్మించారు. 

    సింహాల విహారం..
    మహాచైత్యం పక్కనే సింహాల విహారం శిథిలాలు ఉన్నాయి. ఈ విహారంలో బుద్ధుడి విగ్రహాన్ని స్థాపించారు. శాంతి సిరి ఈ విహారానికి ఎన్నో ధానధర్మాలు చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఇవికాక ఇంకా కుర్మశతికుండ, ఇక్షాకుల రాజసైదాలు, పతీసహజమణగట్టం, ఆశ్వమేధ యాగశాల, తదితర కట్టడాలు సైతం నాగార్జునకొండలో నిక్షిత్తమై ఉన్నాయి. నాగార్జునకొండ చూడడానికి విజయపురి సౌత్ నుంచి కష్ణానదిలో 14కి.మీ లాంచీ ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే పర్యాటకులు ఇక్కడ ఉండేందుకు, చూడడానికి కానీ సమయం కేవలం గంట మాత్రమే ఉండడంతో ఇందుకు సంబంధించిన విశేషాలు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. అంతేగాక బుద్ధుడి ధాతువుని దర్శించే యోగం అందరికీ లేదు. ప్రముఖులు, అతిథులకు మాత్రమే అవకాశం కల్పించడం యాత్రికులను నిరుత్సాహ పరుస్తోంది. 
    source: namathe telangana.com

Wednesday 3 December 2014

అలనాటి నాయకురాలు


source  : Sakshi
అలనాటి  నాయకురాలు
ఆమెది ఒక సామాన్యమైన రైతుకుటుంబం. నా అన్న వారందరినీ కోల్పోయినా, కొండంత నిబ్బరం నిండిన ధీరురాలామె. రాజకీయాల వాసనలు, రాచరికపు పోకడలు లేశమంతైనా లేని మామూలు మహిళ. అయితేనేం, అసమానమైన ప్రతిభా సంపత్తితో మహామంత్రిగా ఎదిగిందామె. పురుషాహంకారాన్ని కాలదన్ని, ప్రజారంజకమైన పాలనతో చరిత్రకారుల ప్రశంసలు పొందింది.  దాయాదుల మధ్య చిచ్చుపెట్టి, కుతంత్రాలకు పాల్పడి, పల్నాటి యుద్ధానికి కారకురాలయిందన్నది ఆమెను మరోకోణంలో చూసేవారి మాట. నిజానిజాలు ఎలా ఉన్నా, ఒక స్త్రీ... అందులోనూ ఒక సాధారణ రైతు కుటుంబీకురాలు...   రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీ బాయిల కన్న ఎంతో ముందుగానే ఖడ్గం చేబూని, యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్న యోధురాలు. సంస్కృతం, కన్నడం, తమిళం, మళయాళం, తెలుగు భాషలను అనర్గళంగా మాట్లాగలిగిన మేధావి.

అపారమైన ధైర్యసాహసాలతో వీర, ధీర వనితగా పేరు తెచ్చుకోవడం మాత్రమే కాదు, పల్నాటి ప్రాభవం అంతరించినా, పల్నాటి యుద్ధం జరిగి ఇంతకాలమైనా తన పేరును శాశ్వతంగా నిలుపుకున్న ప్రజల మనిషి ఆమె. ఆ ప్రాంత ప్రజలు ఆమెను తమ గుండెల్లో నిలుపుకోవడమే కాదు, నాయకురాలు నాగమ్మగా ఆరాధిస్తున్నారు. ఆమెకు ఒక గుడి కట్టి పూజిస్తున్నారు.

 కారంపూడి పల్నాడుకి రణక్షేత్రమైతే, గురజాల రాజధాని. పల్నాటి యుద్ధవీరులను తలచుకుంటూ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో సిడిమాను ఊరేగింపు ప్రధానమైనది. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి నుంచి మొదలై, కోరల పూర్ణిమ మరునాటి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. పాతపాటమ్మ ఆలయంలో అమ్మవారికి పదహారు రోజులపాటు సంబరాలు జరుగుతాయి. ఈ నవంబరు ఆరు నుంచి, సిడిమోనోత్సవాలు జరగనున్నాయి. దేశంలో ఎక్కడెక్కడో ఉన్న ఊరి వాళ్లంతా ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు స్వగ్రామానికి రావడం విశేషం.
 - వై.హెచ్.కె. మోహనరావు

Sunday 30 November 2014

ఎత్తిపోతల (యతి-తపః-తల)



ఈ ప్రాచీన,కార్త్యవీర్యార్జున ప్రతిష్టిత దత్త క్షేత్రం మాచర్ల – నాగార్జునసాగర్ రోడ్డు మార్గం లో “ఎత్తిపోతల” అనుచోట గలదు. విశేషమైన మహిమ గల దత్త క్షేత్రమిది. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని అతి గొప్ప దత్త క్షేత్రం కూడా. రవాణా సౌకర్యం దాదాపు సూన్యం. మాచర్ల(గుంటూరు డిస్ట్రిక్ట్ )నుండి ఐతే నాగార్జునసాగర్ బస్సు ఎక్కి ఎత్తిపోతల అడ్డరోడ్డు లో దిగాలి. అదే నాగార్జునసాగర్ నుండి ఐతే మాచర్ల బస్సు ఎక్కి ఎత్తిపోతల అడ్డరోడ్డు లో దిగాలి. అడ్డరోడ్డు నుండి లోపలకి దాదాపు 2 కి .మీ నడవాలి. చుట్టూ అడవి ఉంటుంది . మాచర్ల లేదా నాగార్జునసాగర్ నుండి ఎత్తిపోతల లోపలవరకు నేరుగా ఆటోరిక్షా మాట్లాడుకోవడం ఉత్తమము .


ఇచ్చటి దత్తాత్రేయుడు మధుమతి సహితం గా ఉంటారు. మధుమతి సహిత దత్త క్షేత్రం ఇదొక్కటే . కొండ కింద ఔదుంబర వృక్షం ఎదురుగా మధుమతి దేవి ఉంటుంది . కొండ పైన గుహలో దత్తాత్రేయుల వారుంటారు. ముందుగా మధుమతి తల్లిని దర్శించి తరువాత దత్తుడిని దర్శించడం ఇక్కడి ఆనవాయితీ. ఇక్కడ దత్తుడు ఏకముఖుడు, విష్ణురూపుడు మరియు అలంకర ప్రియుడు. సింధూరం పూసుకొని ఉండే దత్తాత్రేయుడు. ఈయన విష్ణురూపుడే అయినా నాగసర్ప ప్రియుడు.ఇచ్చటి గుహ వంటి దేవాలయం లో ఖచ్చితంగా దత్తుడి విగ్రహం వెనుక పైకి పుట్టలాగా కనిపించ కుండా కేవలం కన్నాలతో ఉండే దేవ సర్పగృహము కలదు. ఇందునుండి నాగసర్పాలు వెళ్ళడం రావడం ఇక్కడ సాదారణం గా జరిగే ప్రక్రియ. ఎత్తిపోతల మొగలి పొదలకు ప్రసిద్ధి కుడా. మీరు దర్శించు కునేటప్పుడు సింధూరం, పన్నీరు,పూలు, చెమికీలు ఉండే పూలదండలు వంటి అలంకార సామగ్రి దత్త స్వామికి, పూలు,పసుపు,కుంకుమ,గాజులు,జాకెట్ వస్త్రం,నిమ్మకాయలదండ వంటివి మధుమతి అమ్మవారికి తీసుకెళ్లడం మరువకండి. ఎందుకంటె అక్కడ ఏమి దొరకవు. ఎత్తిపోతల అనగా యతులు తపస్సు చేసుకొనే తలము (యతి తపః తలం కాని ఇక్కడ ఉన్న సుందరమైన వాటర్ ఫాల్స్ (జలపాతం వల్ల ఎత్తిపోతల అంటే ఎత్తునుండి నీళ్ళు పోతలాగా పడడం అనుకుంటారు. ఇక్కడ చంద్రవంక ఉపనది పైనుండి కిందకు దూకుతుంది. ఇక్కడ A.P.T.D.C వారి కాటేజీలు ఉన్నాయి. దత్తాత్రేయ గుడితో పాటుగా రంగనాయకుల స్వామి, చౌ డేస్వరిదేవి మరియు వీరభద్ర ఆలయాలు ఉన్నాయి. తోలి ఏకాదశి రోజు మాత్రం ఇక్కడకి చాలామంది వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మాచర్లకి దగ్గర కాబట్టి ఈ క్షేత్రా న్ని దర్శించు కున్నవారు మాచర్ల లో ని చరిత్ర ప్రసిద్ధి గాంచిన పలనాటి బ్రహ్మ నాయుడు కట్టించిన శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి గుడి కూడా దర్శించుకోవచ్చు.

Saturday 29 November 2014

సాగర్ టు శ్రీశైలం.. బోటు షికారు


సాగర్ టు శ్రీశైలం.. బోటు షికారు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దిగువకు నీటిప్రవాహం మొదలైన నేపథ్యంలో నాగార్జునసాగర్-శ్రీశైలం మధ్య ‘బోటు షికారు’కు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ శ్రీకారం చుడుతోంది. గతంలో నీటిప్రవాహం బాగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి పర్యాటకుల నుంచి మంచి స్పందన రావడాన్ని దృష్టిలో పెట్టుకుని.. ప్రస్తుతం దీనిని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చేవారం నుంచి బోటు షికారుకు శ్రీకారం చుట్టాలని అధికారులు నిర్ణయించారు. వారంలో రెండు పర్యాయాలు ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేసి పర్యాటకులను నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు తీసుకెళతారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీని సిద్ధం చేశారు. హైదరాబాద్ నుంచి ప్రతి మంగళ, శనివారాల్లో ఉదయం 8 గంటలకు ప్రత్యేక బస్సులు ప్రారంభమవుతాయి.
 
 11 గంటలకు నాగార్జునసాగర్ నుంచి బోటు షికారు మొదలవుతుంది. సాయంత్రం ఐదున్నరకు శ్రీశైలం చేరుకుంటుంది. బోటులోనే భోజన వసతి ఉంటుంది. సాయంత్రం శ్రీశైలంలోని కొన్ని పర్యాటక కేంద్రాలను సందర్శించాక అక్కడే రాత్రి బస ఏర్పాటు చేస్తారు. ఉదయం శ్రీశైలం దేవాలయం, జలాశయం, రోప్‌వే తదితర ప్రాంతాల సందర్శన అనంతరం బోటులో తిరుగుప్రయాణం మొదలవుతుంది. మధ్యలో ఎత్తిపోతల, నాగార్జునకొండ సందర్శన అనంతరం సాగర్ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకల్లా బస్సులో పర్యాటకులను హైదరాబాద్ చేరుస్తారు. ఇందుకు పెద్దలకు రూ.3,150, పిల్లలకు రూ.2,520 రుసుముగా నిర్ణయించారు. ఒక ట్రిప్పులో వందమంది పర్యాటకులకు అవకాశం కల్పిసారు. వివరాలకు 1800-42545454 (టోల్‌ఫ్రీ నం.), 9848007028 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

హైదరాబాద్ టు శ్రీశైలం వయా సాగర్



రోజువారీ పనుల్లో ఫుల్ బిజీ. అందులోనూ నగర వాసులైతే ఇక చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సరదాగా వీకెండ్ ఎంజాయ్ చేయడం కోసం ఎక్కడికెళ్లాలా అని చాలా మంది తెగ ఆలోచిస్తుంటారు. అయితే ఓ ప్లాన్ వేసుకొని అది కాస్తా అమలుచేసే సరికి వీకెండ్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని పర్యాటక ప్రదేశాలుండి ఏం లాభం? ఏమీ చూడలేకపోయాం అని దిగులుపడుతుంటారు. ఇలాంటి వారి కోసం ఏపీ టూరిజం బ్రహ్మాండమైన ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ టైంలో ఎక్కువ ప్రదేశాలు తిరిగొచ్చేలా హైదరాబాద్ శ్రీశైలం ట్రిప్ ప్లాన్ చేసింది.

ఏపి టూరిజం అందిస్తున్న హైదరాబాద్ శ్రీశైలం రెండు రోజుల టూర్-లో భాగంగా ముందుగా నాగార్జునసాగర్ వరకూ వెళ్ళేందుకు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బేగంపేటలోని ఏపి టూరిజం ఆఫీస్ నుండి బస్సు బయలుదేరుతుంది. సుమారు మూడున్నర గంటల ప్రయాణం తర్వాత నాగార్జునసాగర్ చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్-కు 170 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి చేరుకోగానే మొదటగా మనకు సాగర్ డ్యాం కనిపిస్తుంది. డ్యాంకు ఎదురుగా ఉన్న బ్రిడ్జిపై బస్సు ఆగుతుంది. అక్కడి నుంచి మన విహారయాత్ర మొదలవుతుంది.

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో చూడదగిన ప్రదేశాలలో ఫరహబాద్ అటవీ ప్రాంతం ఒకటి. ఈ అటవీ ప్రాంతంలో టైగర్ వ్యాలి ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ అడవిలో పులులతో పాటు మరెన్నో వన్య ప్రాణులు ఉంటాయి. పక్షుల కిలకిలారావాలతో పాటు, అడవితల్లి అందాలను దగ్గరగా చూడొచ్చు. టైగర్ వ్యాలీ పులులకు నిలయం. ఇక్కడకి వచ్చిన పర్యాటకులు జంగల్ సఫారీ చేస్తుంటారు. ఇక దీనికి తోడు అటవీ అందాలు, పచ్చని ప్రకృతి సోయగాలు ఆహ్లాదకర వాతావరణంలోకి తీసుకెళ్తుంది. అటవీ ప్రాంతం చివరికి చేరుకున్నాక అక్కడి వ్యూ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రకృతి అందాలను చూడడానికి రెండు కళ్ళూ చాలవంటే అతిశయోక్తి కాదు.

ఇలా ఎన్నో, ఇంకెన్నో ఆసక్తికర విషయాలు, మనసును దోచుకునే అందాల మేళవింపైన ఈ టూర్ మీకు బాగా నచ్చింది కదూ. ఎప్పుడూ వీకెండ్-లో పార్కులకు వెళ్ళీ వెళ్ళీ బోర్ కొట్టిందా? అయితే ప్లాన్ చేసుకొని ఓ రెండు రోజుల పాటు కాంక్రిట్ జంగల్-ను వదిలి ఇలా ప్రకృతి అందాలను ఆస్వాదించండి. అది మీ టెన్షన్స్-ను దూరం చేసి మిమ్మల్ని మీకే కొత్తగా చూపిస్తుంది. ఈ టూర్-కి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే. వీకెండ్స్-లో అయితే పెద్దలకి 3200 పిల్లలకి 2500. అదే వీక్ డేస్-లో అయితే పెద్దలకి 2900, పిల్లలకి 2300 చెల్లిస్తే చాలు అంతా వాళ్లే చూసుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా హైదరాబాద్ టు శ్రీశైలం టూర్ ప్లాన్ చెయ్యండి ప్రకృతి అందాలను ఆస్వాదించండి. ఈ మరుపురాని గుర్తులకి మీ జీవితంలో కూడా చోటు కల్పించండి.

హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్-కు చేరుకున్నాక డ్యాం నుంచి నాగార్జునకొండకు లాంచీలో వెళ్ళాల్సి ఉంటుంది. నీళ్లలో అదీ లాంచీలో ప్రయాణమంటే వేరే చెప్పాలా? వినిడానికే చాలా బాగుంది. ఇక స్వయంగా ప్రయాణం చేస్తే ఇంకెంత బావుంటుందని అనుకుంటున్నారా? అయితే చూడండి మరి.

హైదరాబాద్ నుండి శ్రీశైలం ప్రయాణంలో మొదటగా మనం నాగార్జునసాగర్ చేరుకున్నాం కదా. ఇక ఇక్కడి నుండి దాదాపు ఏడు గంటల పాటు క్రూయిజ్ టూర్ మొదలౌతుంది. అంటే అసలు అడ్వంచర్ జర్నీ ఇక్కడి నుండి ప్రారంభం అవుతుందన్నమాట.

పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మపై పకృతిని ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం ఎంతో బాగుంది కదా! లాంచీ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ, ఎత్తైన కొండలు, పచ్చని చెట్ల మధ్య నీటిలో ప్రయాణం. ఆ అనుభూతే వేరు. ఇలా సాగుతున్న ప్రయాణంలో రిజర్వాయిర్ మధ్యలో ఓ చిన్నపాటి ద్వీపకల్పంలా మనకు నాగార్జునకొండ కనిపిస్తుంది. ఈ కొండపైనే ఆచార్య నాగార్జునుడి విశేషాలు తెలిపేలా ఏర్పాటు చేసిన మ్యూజియం ఉంది.

నాగార్జున మ్యూజియంలో బుద్ధుడికి సంబంధించిన వస్తువులు ఉంటాయి. ఇక్కడి శిల్ప కళ, శాతవాహనులు, ఇక్ష్వాకుల రాజవైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. మూడు, నాలుగు శతాబ్దాలకు సంబంధించిన శిల్పకళలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. నాగార్జునసాగర్-కు అతి సమీపంలో ఎత్తిపోతల జలపాతం వస్తుంది. చంద్రవంక కొండల నుంచి ప్రవహించే ఈ జలపాతం 22 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడి కృష్ణా నదిలో కలుస్తుంది. అంతే కాకుండా సూర్యాస్తమయం తర్వాత ఈ జలపాతం కొత్త కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. అన్నిటికన్నా నాగార్జునకొండపై నుంచి చూస్తే కనిపించే మనోహర దృశ్యాలు మనసును పులకింపచేస్తాయి.

ఇలాంటి ఉల్లాసవంతమైన వాతావరణంలో సాగే జర్నీని ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. అందులోనూ బోటులో ప్రయాణం అంటే ప్రతిఒక్కరూ ఎగిరి గంతేస్తారు. ప్రకృతి పచ్చదనంతో కప్పేసిన ఎత్తైన కొండల మధ్య సాగే జర్నీ భలేగా ఉంటుంది.

కృష్ణానదిపై ఈ ప్రయాణం దాదాపు నూట పది కిలోమీటర్ల పొడవున సాగుతుంది. సుమారు ఏడు గంటల పాటు సాగే ఈ జర్నీలో పక్షుల కిలకిలారావాలతో నీటి సవ్వడుల మధ్య ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ పచ్చటి కొండల చుట్టూ తిరుగుతు ఎగ్జైటింగ్-గా ఉంటుంది. ఇక్కడ మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ఈ ప్రయాణం ఒకేసారి దాదాపు ఐదు జిల్లాల పరిధిలో సాగుతుంది.

కొండల మధ్య బోటులో ప్రయాణం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పర్యాటక ప్రాంతం పాపికొండలు. అయితే ఇప్పుడు శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్-కు కూడా బోటు ప్రయాణం చేయొచ్చు. ఈ ప్రయాణం తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో అంతులేని ఆనందాన్ని అందిస్తోంది. ఆహ్లాదకరమైన దృశ్యాలతో పాటు ఆధ్యాత్మికమైన వాతావరణం మధ్య ప్రయాణం హాయిగా సాగిపోతుంది. కూసింత కళా పోషణ ఉన్న వారినే కాదు చలనం లేని మనషులను సైతం గిలిగింతలు పెడుతుంది ఈ టూర్. ఈ ప్రయాణం మరవలేని స్మృతులను మిగులుస్తుందంటున్నారు పర్యాటకులు.

సాగర్ నుండి మొదలై శ్రీశైలం వరకు సాగే ఈ ప్రయాణంలో మనకు తెలియని ఎన్నో కొత్త, వింతైన విషయాలను తెలిపేందుకు ఇక్కడ ఓ గైడ్ కూడా ఉంటాడు. అతను ప్రతీ ప్రదేశం ప్రత్యేకతను పర్యాటకులకు వివరిస్తుంటాడు.

ఇక కృష్ణా నదిలో బోటు ప్రయాణం చేసినంత సేపూ మనకు ఇంకేం గుర్తుండదు. ఏ టెన్షన్స్ కూడా మన దరిచేరవు. అలా ఉంటుంది వాతావరణం. ఆ మనోహరమైన, ఆహ్లాదకరమైన వాతావరణానికి మనసు ఆనందతాండవం చేస్తుంది. కృష్ణా నదిలో దాదాపు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణం తర్వాత శ్రీశైలానికి బోటు చేరుకుంటుంది.

సాగర్లో ప్రయాణించినంత సేపూ ఆహ్లాదంతో నిండిపోయిన మనసు కాస్తా శ్రీశైలంలో అడుగు మోపగానే ఒక్కసారిగా ఆధ్యాత్మికతతో నిండిపోతుంది. అడుగు పెట్టగానే విఘ్నాలకు అధిపతి అయిన ఆ గణనాథుడు సాక్షి గణపతిగా దర్శనమిస్తాడు. అక్కడి నుండి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన శ్రీశైలమల్లికార్జున స్వామి దర్శనంతో పాటు శిఖర దర్శనంతో మనసు దైవచింతనలోకి వెళ్ళిపోతుంది. మనసారా ఆ బోళా శంకరుణ్ని స్మరిస్తే కోరిన కోర్కెలు ఇట్టే తీరుస్తాడని భక్తుల విశ్వాసం.

శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు అక్కడి నుంచి కైలాస శిఖరానికి చేరుకుంటారు. అక్కడ వెలసిన నందిపై నవధాన్యాలు వేస్తే సకల పాపాలూ తొలగుతాయని భక్తుల నమ్మకం. ఇక ఈ శిఖరం పైనుండి చూస్తే ప్రకృతి అందాలకు ఎలాంటి వారైనా ముగ్ధులు కావలసిందే.

అక్కడి నుండి నేరుగా పాతాళగంగకు బయలుదేరతారు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంటుంది. అదేంటనుకుంటున్నారా? అక్కడి నుండి పాతాళగంగను చేరుకోవడానికి గాల్లో తేలుకుంటు వెళ్ళాల్సి ఉంటుంది. అదెలా అనుకుంటున్నారా? అక్కడి రోప్-వే ఉందిలెండి. మామూలుగా అయితే పాతాళగంగకు వెళ్ళాలంటే 721 మెట్లు దిగి వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్ళలేని వారి కోసం టూరిజం శాఖ రోప్-వే ఏర్పాటు చేసింది. రోప్-వేలో ఎక్కి నదీ జలాలను దగ్గరగా తాకుతూ, పచ్చని చెట్ల సోయగాలను ఆస్వాదిస్తూ పాతాళగంగకు చేరుకోవడం జీవితంలో మరిచిపోలేరెవ్వరు. కొద్దిపాటి భయంతో, కాస్త ఎగ్జయిట్-మెంట్-తో కూడిన ఈ రోప్ జర్నీ పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతినిస్తుంది.

రోప్-వే ద్వారా పాతాళగంగకు చేరుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక బోటులో పాతాళగంగలో సరదాగా బోటింగ్ చేసి అక్కడి నుండి పక్కనే ఉన్న ట్రైబల్ మ్యూజియంకి చేరుకుంటారు. ఆ మ్యూజియంలో శ్రీశైల పుణ్యక్షేత్ర విశిష్టతకు కారణమైన అనేక నిజాలు అక్కడ ఇంకా సజీవంగానే ఉన్నాయి. ట్రైబల్ మ్యూజియంలో నల్లమల్ల అడవుల్లో స్వామిని నెలకొల్పి నిత్యం పూజలు చేసిన మొదటి శ్రీశైల పూజారి అయిన మల్లన ప్రతిమ, అడవి జాతి అనవాళ్లను కాపాడే గిరిజనుల ప్రతిమలు సహజత్వానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటాయి. వాటన్నింటినీ చూస్తుంటే స్వచ్ఛమైన అచ్చమైన పల్లెటూరి వాతావరణం ఉట్టిపడుతుంది.
sorce: eXpresstv

రెండు రోజుల్లో... సాగర్ - శ్రీశైల సందర్శనం


రెండు రోజుల్లో... సాగర్ - శ్రీశైల సందర్శనం
హాయిగా వెళ్లి రండి!

సుందరమైన ప్రదేశాలకూ, ఆధ్యాత్మిక సౌరభాలకూ తెలుగు నేల పెట్టింది పేరు. నాగార్జునసాగర్ వద్ద కృష్ణానది పరవళ్లనూ, శ్రీశైలంలో మల్లన్ననూ చూసి తరించాలనుకునేవారికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రెండు రోజులకు గాను ఓ కొత్త ప్యాకేజీని రూపొందించింది.

మొదటి రోజు హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్‌కు రోడ్డుమార్గాన నాన్ ఎ.సి. కోచ్‌లో ప్రయాణం. నాగార్జున సాగర్ డ్యామ్ సందర్శన, నాగార్జునకొండ మ్యూజియానికి లాంచీలో షికారు. అనంతరం నాగార్జునకొండ సందర్శనం, అటు తర్వాత నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీలో ప్రయాణం. అక్కడి హరిత హోటల్‌లో బస, మల్లికార్జునస్వామి దేవాలయ సందర్శన, రాత్రి భోజనం. మరుసటి రోజు ఉదయాన ఆలయ సందర్శన (కావాలనుకున్నవారికి...), అల్పాహారం, పాతాళగంగ రోప్‌వే సదుపాయం, గిరిజన మ్యూజియం సందర్శన, మధ్యాహ్నం భోజనం. ఫర్హాబాద్ అటవీ (టైగర్ వ్యూ పాయింట్) సందర్శన అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం.

 హైదరాబాద్ నుంచి శ్రీశైలం మీదుగా నాగార్జున సాగర్‌కు వెళ్లి తిరిగొచ్చే ప్యాకేజీ కూడా ఉంది.

 ఈ ప్యాకేజీలో:   బుధవారం: పెద్దలకు (ఒకరికి): రూ.2,900, పిల్లలకు  (3 ఏళ్ల వయసు నుంచి10 ఏళ్ల వయసు లోపు) (ఒకరికి) రూ.2,300 రుసుము.
   
 శని, ఆదివారాలు: పెద్దలకు (ఒకరికి) రూ.3,200, పిల్లలకు (ఒకరికి) రూ. 2,500గా రుసుము నిర్ణయించారు. ప్రయాణంలో: నాన్ ఎ.సి. కోచ్, క్రూయిజ్, నాన్ ఎ.సి. గదిలో బస (ఇద్దరికి), భోజనం (శాకాహారం).
   
 ఇక, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి (వన్ వే) లాంచీలో ప్రయాణానికి చార్జీలు, మధ్యాహ్న భోజనం, స్నాక్స్‌తో కలిపి...
 పెద్దలకు: (ఒకరికి) రూ.1,000, పిల్లలకు: (ఒకరికి) రూ.800 రుసుము.
   
 దర్శన టికెట్ చార్జీలు అదనం.
   
 మరిన్ని వివరాలకు: హైదరాబాద్: బషీర్‌బాగ్ ఆఫీస్ ఫోన్: 040-66746370, సెల్: 98485 40371

 పర్యాటక భవన్, బేగంపేట్: ఫోన్ నం. 040-23414334, 98483 06435
   
 ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి శాఖ టోల్ ఫ్రీ నం: 1800 42545454
 

Friday 28 November 2014

మనకు తెలియని మన నాయకురాలు


Posted  భూమిక
లకుమ
తొలి మహా మంత్రిణి నాయకురాలు నాగమ్మ అనటంలో వై.హెచ్‌.కె. మోహనరావు (పుస్తకరచయిత) లాగే నాకు ఎటువంటి సందేహమూ లేదు. ముందుగా వారికృషికి అభినందనలు నా పక్షానా, స్త్రీ వాదుల పక్షానా.
దాదాపు వెయ్యేళ్ళ కిందట ఒక స్త్రీ అందునా భర్తను కోల్పోయిన స్త్రీ ఒక రాజ్యానికి మహామంత్రిణీ కాగలిగిందంటే అది ఆమె ప్రతిభకు తార్కాణం. ఆమె నాయకత్వాన్ని అంగీకరించిన అప్పటి ప్రజల సహృదయతకు దర్పణం.
నాగమ్మ తండ్రి రామిరెడ్డి కరీంనగర్‌ జిల్లా, పెగడపల్లి మండలం, అరవెల్లి గ్రామం నుండి తనబావమరిది మేకపోతుల జగ్గారెడ్డి వుంటోన్న పల్నాడులోని జిట్టగామాలపాడు గ్రామంకు రావటంతో నాగమ్మ గురించిన పుట్టు పూర్వోత్తరాల సమాచారం కొంత మనకు లభిస్తుంది.
శివభక్తుడైన గోపన్న మంత్రి వద్ద చదువుతో పాటు సాముగరిడీలు, ధనుర్విద్య, అశ్వశిక్షణ పొందడం, సంస్కృతాంధ్ర, కన్నడ, తమిళ భాషల్లో పాండిత్యం సంపాదించడం, తత్వశాస్త్రం, రాజనీతిశాస్త్రం అధ్యయనం చేయడం చూస్తే నాగమ్మ బహుముఖ ప్రజ్ఞ అవగతమౌతుంది. వెయ్యేళ్ల నాడే ఆధ/నిక స్త్రీ లక్షణాలను అందిపుచ్చుకున్న నాగమ్మ ఆనాటి స్త్రీల కంటే వెయ్యేళ్ళు ముందున్నదన్నది నిజం. నాగమ్మ జీవన నేపథ్యం చూసినప్పుడు ఈమెతో పోల్చటానికి ఆకాలంలో భారతాన నాకు ఒక్కరూ దొరక్కపోవటం విచారంగానూ, సంతోషంగానూ వుంది.
చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకోవడం ఆమె దురదృష్టాన్ని తెలియపరుస్తుంది. ఇంక భర్త సింగారెడ్డి అకాల మృతి ఆమె దురదృష్టానికి పరాకాష్ట నాగమ్మ లౌకిక వ్యవహారాల్లోకి మళ్ళటానికి ప్రధాన కారణం ఒక చెరువు త్రవ్వకంలో జరిగిన రాజకీయ కుట్రలో భాగంగా బ్రహ్మన్న తండ్రి దొడ్డ నాయుడు, రామిరెడ్డి సాగు భూమిని ఎంపిక చేయడం, ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే ఘర్షణల్లో తండ్రి రామిరెడ్డి, మామ జగ్గారెడ్డి ప్రాణాల్ని కోల్పోవడం ఒక పెను విషాధం. ఒక తీరని దుఃఖం, దీని కంతకు కారణం మన చేత ‘చాపకుటితో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న’ అని కీర్తింపబడుతున్నవాడు. ఇక్కడ మనం ఒకసారి శ్రీశ్రీ ‘దేశచరిత్రలు’ మననం చేసుకుంటే మనకు కొంత జ్ఞానోదయం కొత్తగా పల్నాడు విషయంలోనూ కలుగుతుంది. చరిత్రను ఎంతగా వక్రీకరించవచ్చునో ఈ పుస్తకం చదివితే అవగతమవుతుంది.
ఈ పుస్తకానికి సంబంధించి కొన్ని ముఖ్య రిఫరెన్సులను చివర్లో మన ముందు వుంచిన రచయిత కృషిని, ముందుచూపును మనసారి అభినందిస్తున్నాను.
ఇది చదివాక నాగమ్మ పట్ల నాకు అంతకుముందు లేని ప్రేమ, అభిమానం కలిగాయి. అందిరలాగే నాకూ వున్న కొన్ని అపోహలు తొలిగిపోయాయి.
నాగమ్మ మనోధైర్యం అచంచలం, అనూహ్యం. అనితర సాధ్యం కూడా. బ్రహ్మనాయుడు బంధుగణం అక్రమంగా దాచిన (మన రాజకీయ నాయకుల్లాగే) రాజ్యసంపదను తిరిగి ఖజానాకు రాబట్టడం, ఆమె దేశభక్తికి నిదర్శనం. స్విస్‌ బాంకుల నుండి మన సంపదను తిరిగి తీసుకురాలేని మన పాలకులు నాగమ్మ కాలిగోటికి కూడా సరిరారు. నలగాముడు విచారంలో వున్నప్పుడు అర్జునుడైతే, అప్పుడల్లా ధైర్యవచనాలు పలికిన నాగమ్మ సాక్ష్యాత్తూ శ్రీ కృష్ణుడే. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవడం ద్వారా బ్రహ్మన్నకు తరచు నాగులేటి నీరు తాగించింది నాగమ్మ.
కోడిపందాలలో (ఇవి పానగల్లు కోళ్ళు), బ్రహ్మనాదులు 4 ఏళ్ళు (ఏడేళ్ళకు గాను) రాజ్యం విడిచి వనవాసం వెళ్ళడం ఇట్లాంటి సంఘటనలు మనకు మహాభారతంలోనే కనబడతాయి. అడవులకు వెళ్ళినా ఇక్కడ బ్రహ్మన్న వర్గాన్ని పాండవులతో పోల్చడానికి లేదు. చాలా సందర్భాల్లో మనం బ్రహ్మనలో దుర్యోధనుడ్ని చూస్తాం. బాలచంద్రుడు విషయానికొస్తే మాత్రం బ్రహ్మన్న సాక్షాత్తు ధృతరాష్ట్రుడే. ఇంక నాగమ్మ ద్రౌపది కష్టాలు, అవమానాలు పడ్డది. ద్రౌపది లాగే నాగమ్మ శక్తి స్వరూపిణి.
బ్రహ్మన్న అనుచరులు గోసంగులు (మాదిగలు) ధర్మం నాయకురాలి వైపే వుందనటం, కీలక సమయాల్లో తమ సహాయ నిరాకరణను ప్రకటించటం వారి విచక్షణకు నిదర్శనంగా చెప్పుకోవచ్చును. ఇప్పటికీ మాదిగలు ధర్మ పోరాటం చేయటం బహుశా అప్పటి స్ఫూర్తేనేమో? నాగమ్మ ఆమెగా సంధికి రావటం, బ్రహ్మన్న అనుచిత కోర్కెలను ఆమె అంగీకరించటం గోసంగులను ధర్మం వైపున వుండేలా కట్టిపడేశాయి. ఆమె పై మనం ఇంకా ఎందుకు యుద్ధం చేయాలి? అకారణంగా ఎవరి తలలు నరకాలి? అనటం వారి ధర్మ నిబద్ధతను తెలియజేస్తోంది. నాగమ్మ ఇట్లా అన్ని వర్గాల మనసులను గెలిచింది కాబట్టే యుద్ధంలోనూ గెలిచింది. చాలా సందర్భాల్లో బ్రహ్మానాయుడి అంతరాత్మను గెలుచుకునే వుంటుంది. బ్రహ్మనాయుణ్ణి సత్యపీఠం ఎక్కిస్తే ఈ విషయం ఆయన నోటివెంటే మనం వినొచ్చును.
నాయకురాలి చేతిలో శీలం బ్రహ్మనాయుడు ఒరిగాడని ఈ వ్యాసకర్త, రచయితతోనూ, తిరుపతి, మద్రాసు ప్రాఛ్యలిఖిత వ్రాతప్రతులతోను ఏకీభవిస్తున్నాడు. మహావీరులని ప్రచారం గావించబడ్డ బ్రహ్మన్న పక్షంలోని వారంతా నాయకురాలి పక్షం వారిచేత హతులయ్యారన్నది కూడా సత్యదూరం కాదు.
వీటనన్నింటినీ ఆమె దౌత్య సంబంధాలు నెరపిన తీరు బలపరుస్తోంది. ఒక్క మాచర్లతో తప్ప మిగిలిన ఏ రాజ్యంతోనూ నాగమ్మకు పేచీలు లేకపోవడం యుద్ధంలో చాలామంది రాజులు నాగమ్మకు వెన్నుదన్నుగా నిలవడం చూస్తే నేటి ప్రజాస్వామ్య లక్షణాన్ని, ధర్మాన్ని రక్షించటంపట్ల వారి కర్తవ్యదీక్షనూ ఆనాడే ప్రజలు చూడగలగడం అది వారి అదృష్టం.
వ్యూహప్రతివ్యూహంలోనూ, యుద్ధతంత్రంలోనూ నాగమ్మ ఎంత అందె వేసిన చేయో నల్లగొండ నుండి మేళ్ళవాగు కనుమ వరకూ పొడవాటి నగులేరూ చెప్తాయి.
బహుళ ప్రచారంలో వున్నట్లు (సినిమాల్లో చూపినట్లు కూడా) నాగమ్మ పదవి కోసం వెంపర్లాడిన మాట నిజం కాదు. ఇప్పటి నాయకురాళ్ళు (33%లేకుండానే)నాగమ్మను చూసైనా తెలుసుకోవాలి. అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం విజ్ఞత. అట్లాంటి విజ్ఞతనే నాగమ్మ ప్రదర్శించింది.
అనుగురాజు కోరుకోమన్న వరాన్ని మొదట సున్నితంగా తిరస్కరించడం చూస్తే ఆవిడలో ఒక విరాగిని కనిపిస్తుంది. ఒత్తిడి కారణంగానే మంత్రి పదవిని స్వీకరించడం, యుద్ధానంతరం విజయం సాధించినా మంత్రి పదవిని కాదనడం చూస్తే పదవీ కాంక్షతో ఆమె ఎన్నడూ రగిలిపోలేదు బ్రహ్మన్నలా అని చెప్పుకోవచ్చును.
చివరి రోజుల్లో స్వగ్రామంలో ప్రజా సేవలో, దైవచింతనలో గడపడం చూస్తే ప్రజలతో, ప్రజలమధ్యన, ప్రజల కోసం బతకాలనుకున్న నాగమ్మ ఎప్పటికీ ప్రజల మనిషే. బందిపోట్లు తరచు తన గ్రామం మీద దాడి చేస్తుంటే ప్రజలందర్నీ ఒక త్రాటిపై నడిపి నిన్న విడిచిన పోరాటం నేడు అందుకొనక తప్పదని పల్నాటి ప్రజలకు చాటి చెప్పిన వీరనారి నాగమ్మ. గురజాలలో నాగమ్మ దూబచెరువు త్రవ్విస్తే మనం ఒక చెరువులోనూ పూడిక తీయించలేకున్నాం. ఆమె జన్మస్థలం అరవెల్లిలో నాగమ్మ పేరున గుడీ, వాగూ పిలువబడటం అదీ వెయ్యేళ్ళ తర్వాత కూడా ఓ గొప్ప చారిత్రక విశేషం.
చివరగా ఒక్కమాట, ఒక స్త్రీని తొలి మహామంత్రిణిగా అంగీకరించిన, ఆనాటి పల్నాడులోని ప్రతి పౌరునికీ శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ‘నాగమ్మ’ పేరున ఒక నవలను తేవాలని రచయితను తెలుగు ప్రజలందరి తరపునా కోరుతున్నాను. అట్లాంటి నవల మీదా ఇప్పట్లాగే తప్పక నా అభిప్రాయాన్ని మీ అందరితో పంచుకుంటాను.
‘పల్నాటి యుద్ధం’ సినిమాను నాగమ్మ (నాయిక) ప్రధానంగా పునః నిర్మించే బాధ్యతను పల్నాడులోని మనసున్న మా రాజులు మరియు కోటీశ్వరులు చేపట్టాలని ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చదవాలనీ కోరుతున్నాను.
Palnadu Regions- Palnati Brahma Naidu

Palnadu region is located in current Guntur District, with Krishna river forming its western as well as northern borders, in Andhra Pradesh (Close by and east of Nagarjunasagar / Deverakonda region of Nalgonda dist).
During the said period, some six Velama women are said to have commited 'Sati' by jumping into the funeral fire after the death of their warrior husbands in the battle to capture one Arangetla fort from rival forces in Palnadu region.

'PALNATI' RECHERLA BRAHMA NAYUDU, a valiant fighter, both his father Dodda Nayudu and later he himself were appointed and served as ministers for the then ruling Raju clans in Palnadu area like Alugu Raju. He has strived for progressive and egalitarian ideals in medieval times, ruled as a minister on behalf of minor sons of Alugu Raju from Macherla, a town in Palnadu region close to Guntur - Nalgonda district border.
Brahmanna, as he is popularly called is a staunch Vaishnavite and a devotee of Chennakesava. He was responsible for construction of Chennakeshava Swami temple in Macherla town which is popular even today among the people there.
Brahmanna is said to have adopted a son, a brave warrior called Kannamma, a Mala by caste, as he was childless for a long time.
Peddanna Bada Raju, brave warrior, son of Dodda Nayudu (then minister of Alugu Raju) and elder brother of Brahma Naidu, a velama by birth but given in adoption to then ruler Alugu Raju, and brought up as a Raju by his foster father. He later on said to have married a Raju girl, upsetting his Raju in-laws and their relatives who were not aware of his original caste, come together, decide and vow to kill him at any cost. But Peddanna is said to have defeated single handedly nearly more than one hundred such warriors.

The deceitful infamous 'Nayakuralu' Nagamma, a widow, is the minister for then rulers (Nalagama Raju and Narsinga Raju etc) of Gurajala , a small town in Palnadu region.
Brahmanna along with his troops lives in exile for six and half years after loosing Macherla to Nagamma in a cock fight. He is said to have lived first three years of his exile period along with his brothers and other warriors in and around Deverakonda region of Nalgonda district and said to have established a town called 'Mandadi' there. His two brothers are said to have founded two other towns in the region. Nagamma said to have sent some fierce Boya warriors from Palnadu region to set the new town Mandadi on fire but they failed to carry out her orders. Brahmanna decided to move from there and lived the the next three and half years of his exile period just south of his original Palnadu region border in Guntur district in a village called 'Medapi'.
Brahmanna's sister, Chellamma, is said to have married into a Raju family of Kalyan descent and her son Alla Racha Mallu, a Raju, was later on sent as a peace missionary for negotiations between Brahmanna and Nagamma. He is said to have secretely food poisoned to death by Nagamma and said to have never returned back.
Battle of Palnadu - (1182) at Karempudi village, in Palnadu region, between the former rulers of Macherla and then rulers of Gurajala of Palnadu region at the end of exile period by Brahmanna and failure of peace negotiations and unexpected death of his nephew, Alla Racha Mallu, at the hands of Nagamma. 'Palanati' Recherla Balachendrhrudu (Kaliyuga abhimanyu), son of Brahma Nayudu born after Brahmanna being childless for a long time, fought the Palnadu Battle ferociously and died at a very young age. His wife is said to have attempted to commit 'Sati' but did not succeed.The Battle of Palnadu is remembered and propagated through 'Burra Katha' even today by the people of Palnadu region, and through an annual gathering at the battlefield in Karempudi village to pay respect to warriors

Wednesday 26 November 2014

పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో మందపోరు

పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో మందపోరు
 పల్నాటి ఉత్సవాల్లో మూడోరోజైన మందపోరు  జరిగింది. బ్రహ్మనాయుడు, మలిదేవరాజు కోడిపోరులో ఓడిపోయి అరణ్యవాసం చేసేందుకు మందాడి గ్రామంలో వెళ్లి అక్కడే స్థిరనివాసం చేసుకుని ఉంటాడు. సుఖశాంతులతో కాలాన్ని గడుపుతాడు బ్రహ్మనాయుడు. నాగమ్మ పసిగట్టి బ్రహ్మనాయుడు వైభవాన్ని జీర్ణించుకోలేక పల్నాడు విడిచిపెట్టి వెళ్లినవారు ఇబ్బందులు పడాలేతప్ప సుఖశాంతులతో ఉండకూడదని నలగామరాజుకు హితభోద చేస్తుంది. బ్రహ్మనాయుడిని ఎలాగైనా వదిలిపెట్టకూడదని మండాది గ్రామంపై దాడి చేసేందుకు పన్నాగం పన్ని అర్థవీడులోని వీధులపర్నిడు చంచునాయకుడితో కుమ్మకై బ్రహ్మనాయుడిపై యుద్ధానికి పంపుతుంది నాగమ్మ. పర్నిడు తండ్రిని బ్రహ్మనాయుడు హతమార్చుతాడు. బ్రహ్మనాయుడు రహస్యంగా ఆవుల మందతో ఆనందంగా ఉంటున్నాడు. లంకన్న గోవులు కాసేందుకు వెళ్తాడు. పర్నిడు ఆవుల మందను చెదరగొట్టి వాటిని గురజాలవైపు తోలుకుని వచ్చి లంకన్న కత్తులు, బడిశలతో దాడి చేస్తాడు. ఓ చెన్నకేశవా, వీర్ల అంకమ్మతల్లి అంటూ బ్రహ్మనాయుడు రాకకోసం ఎదురు చూస్తాడు. బ్రహ్మనాయుడు కన్నమదాసును వారికి ఎదురు దాడికి పంపిస్తాడు. లంకన్నకు బ్రహ్మనాయుడు ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. వీరచారవంతులు తమ కొణతములతో గ్రామోత్సవం చేశారు. వీర్ల అంకమ్మదేవాలయం, వీర్ల దేవాలయం, చెన్నకేశ దేవాలయాల్లో ప్రజలు మొక్కు బడులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ అయ్యవారు. పీఠం నిర్వాహకులు విజయ్, వీరచారవంతులు పాల్గొన్నారు.

పల్నాటి వీరుల ఉత్సవాలు

పల్నాటి వీరుల ఉత్సవాలు


 చిన్నచిన్న రాళ్ళు..చిల్లరదేవుళ్లు, నాగులేటి నీళ్ళు..నాపరాళ్ళు, 
సజ్జసన్నసంగటి..తినలేను ఓచెన్నకేశవ అన్నాడు అనాటి మహాకవి శ్రీనాధుడు. 
అలాంటి మహానీయుడు సంచరించిన ప్రాంతమే కార్యమపూడి. పల్నాటి రణభూమి కారంపూడి. వీరులగుడి వద్ద  11వ శతాబ్ధాంలో జరిగిన పల్నాటి యుద్ధంలో మృతి చెందిన 66మంది మృతవీరుల ఆత్మశాంతికోసం జరిగే ఉత్సవాలే పల్నాటి వీరుల మహోత్సవాలు, కుల, మత, వర్గ విభేదాలు లేకుండా సమ సమాజ స్థాపనకోసం కృషి చేసిన వ్యక్తి బ్రహ్మనాయుడు. మాల కన్నమదాసును సర్వసైన్యాధ్యక్షుడిగాచేసి, దళితులను ఆలయప్రవేశం చేయించి, సహపంక్తి భోజనాలను ఏర్పాటుచేసిన మహానీయుడు బ్రహ్మనాయుడు. తనదే పైచేయి, తను చెప్పిందే వేదంగా పాటించాలని శాసించే నాయకురాలు నాగమ్మ. బ్రహ్మనాయుడు-నాగమ్మల మధ్య జరిగిన యుద్ధమే పల్నాటియుద్ధం. కారంపూడి వేదికగా జరిగిన పల్నాటి యుద్ధం ప్రపంచ చరిత్రలో రక్తాక్షరాలతో పల్నాటి పౌరుషానికి వీరుల త్యాగబలానికి నిదర్శనంగా నిలిచింది. పల్నాటి యుద్ధానికి దారితీసిన పరిస్థితులు, ఆనాటి మహాభారత యుద్ధపరిస్థితులతో సరిపోల్చవచ్చు. నాటి పాచికలాటలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేయగా, పల్నాటి వీరులు కోడిపందాల్లో ఓడి, రాజ్యాలను వీడి అడవిబాట పట్టారు. అందుకే పల్నాటి యుద్ధం కురుక్షేత్రంగా పేరొందింది. మాచర్లను పరిపాలించిన మలిదేవరాజువద్ద బ్రహ్మనాయుడు, గురజాలను పరిపాలించిన నలగామునివద్ద నాయకురాలు నాగమ్మలు మంత్రులుగా పనిచేశారు. ప్రపంచ చరిత్రలో తొలి మహిళా మంత్రి నాగమ్మకావడం పల్నాటిప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం. వీరగంధం తెచ్చినమయ, వీరులెవరో లేచిరయండయ్యా అంటూ పల్నాటిప్రాంతం గురించి పాడుతుంటే వీరావేశంతో శరీరం గగురపొడుస్తుంది. పల్నాటి ప్రాంతంలో సర్వమత సమానత్వం తేవాలనే బ్రహ్మనాయుడి ఆశయం పూర్తిగా నెరవేరకముందే యుద్ధం ముగిసింది. యుద్ధంలో చనిపోయిన వీరనాయకులకు లింగప్రతిష్ఠ చేసి, వీరారాధనోత్సవాలను జరిపించాలని పిడుగువంశంవారిని వంశపారంపర్యంగా ఏర్పరచి, గుత్తికొండ బిలానికి తపస్సుకు వెళతాడు బ్రహ్మనాయుడు. నాగులేరు ఒడ్డున పల్నాటివీరులైన 66మంది వీరనాయకుల శిలలకు గుడిని నిర్మించి, యుద్ధంలో పాల్గొన్న వీరులకు ఈనాటికి వీరపూజలు చేస్తూనే ఉన్నారు. మృతవీరులకు ఆత్మశాంతి కలగాలని కారంపూడిలో  ఐదురోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల రెండోతేదీన రాచగావు, మూడోతేదీన రాయభారం, నాలుగున మందపోరు, ఐదో తేదీన కోడిపోరు, ఆరున కల్లిపాడుతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలలనుండి వీరాచారవంతులు తమ కొణతములు (దైవాలు) తీసుకువస్తారు. నాగులేరు (గంగధారిమడుగు)లో స్నానం చేయించి తమ మొక్కులు తీర్చుకుంటారు. పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ అయ్యవారు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు.

పల్నాటివీరులకథ

పల్నాటివీరులకథ

ద్రుతతాళంబున వీరగుంభి తకధుం ధుం ధుం కిటాత్కార సం
గతి వాయింపుచు నాంతరాళిక యతిగ్రామాభిరామంబుగా
యతిగూడం ద్విపదప్రబంధమున వీరానీకముం బాడె నొ
క్కత ప్రత్యక్షరముం గుమారకులు ఫీట్కారంబునం దూలగన్‌

గర్జించి యరసి జంఘా కాండయుగళంబు
వీరసంబెటకోల వ్రేయునొకడు
ఆలీఢ పాదవిన్యాస మొప్పగ వ్రాలి
కుంతాభినయము గైకొను నొకండు
బిగువు గన్నుల నుబ్బు బెదరుచూపుల తోడ
ఫీట్కార మొనరించు బెలుచ నొకడు
పటుభుజావష్టంభ పరిపాటి ఘటియిల్ల
ధరణి యాస్ఫోటించి దాటు నొకడు

ఉద్ది ప్రకటింప నొక్కరుండోలవాడు
బయలు గుర్రంబు భంజళ్ళ బరపు నొకడు
కొడుము దాటింపుచును బెద్దగొలువు లోన
పడతి పల్నాటివీరుల పాడునపుడు

కులము దైవతంబు గురిజాల గంగాంబ
కలని పోతులయ్య చెలిమికాడు
పిరికికండ లేని యరువదియేగురు
పల్లెనాటి వీరబాంధవులకు

ఆరువల్లి నాయినారి దుర్మంత్రంబు
కోడిపోరు చాపకూటి కుడుపు
ప్రథమకారణములు పల్నాటి యేకాంగ
వీరపురుష సంప్రహారమునకు

పచ్చనిపిండి గందమును బాలముసేసయు నెర్రపూవులన్‌
గ్రుచ్చిన కంఠమాల్యములు గొప్పుగ నల్లిన వేణిబంధముల్‌
కచ్చుల వీరసంబెటయు క్రొత్త మణుంగగు కాసెపుట్టమున్‌
రచ్చల కెక్కినట్టి రసణంబులు వీరకుమార కోటికిన్‌

నల్లంగొండయు నాగరి
కల్లును ధరణీస్థలిం బ్రగల్ఫస్థలముల్‌
పల్లేరు నాగులేరును
పల్లె క్ష్మాకాంత యెల్ల ప్రారంభంబుల్‌

ఇచ్చోట భుజియించి రేకకార్యస్తులై
సామంతనృపతులు చాపకూడు
ఇచ్చోట జింతించె నిచ్చ నుపాయంబు
నళిణాక్షి యార్వెల్లి నాయురాలు
నిజ మనుశుద్ధికై నిప్పులయేటిలో
నోలాడె నిచ్చోట బీలసాని
ఇచ్చోట బోరిరి యిల పణంబుగ గొల్ల
సవతితల్లుల బిడ్డ లవనిపతులు

ధీరులగు వారలేవురు వీరపురుషు
లై మదోద్ధతి నిచ్చోట నాజి బడిరి
యనుచు జెప్పుదు రైతిహ్య మచట నచట
జనన పెద్దలు పల్లెదేశములయందు

చిత్తము గూర్చి మాచెరలచెన్నుడు శ్రీగిరిలింగముం గృపా
యత్తత జూడ ముల్కివిషయంబునకా మహిమంబు చెల్లెగా
కుత్తరలోన మింట జలముట్టిన మాత్రన నాపరాలలో
విత్తిన యావనాళ మభివృద్ధి ఫలించుట యెట్లు చెప్పుమా

మగసింగంబులు సంగరాంగణములన్‌ మత్తిల్లి రున్మత్తులై
జగదేకస్తుతు లంచు నేమిటికి సంశ్లాఘింప నా భూమిలో
చిగురుంబోడుల కాపుగుబ్బెతల నక్షీణప్రభావంబునన్‌
మగసింగంబులగా నెరుంగుదురు పుంభావ ప్రసంగంబులన్‌

తొలి మహామంత్రిణి నాయకురాలు నాగమ్మ

'తొలి మహామంత్రిణి నాయకురాలు నాగమ్మ'

సాహిత్యం కల్పనీకం కానీ చరిత్ర ఆధారభూరితం. చరిత్రను సాక్షాత్కరింపచేయాలంటే నిఘంటువుల వంటి ఆధారాలు ఆవశ్యం. అదీ సహస్రాబ్దినాటి పల్నాటి చరిత్రకు సంబంధించిన ప్రధానాం శం. అందునా తొలి నాలుగు శతాబ్దాల పాటు అక్షరరూపం. గ్రంధస్థంకు నోచుకోక పామరజనుల నోళ్ళలో జాలువారుతూ కాలం గడిపిన చరిత్ర తమకు అనుకూలంగా ఆయా కాలాలకు అనుగుణంగా వాస్తవ చరిత్రకు మెరుగులు దిద్దే ప్రక్రియలో ఒక వర్గం చీకటి కోణంలోకి నెట్టివేయడం జరిగిందని ఒక్క మాటలో చెప్పడం తొలుత రుచించకపోయినా తొలి మహామంత్రిణి నాయకురాలు నాగమ్మ గ్రంథంలో రచయిత వై.హెచ్‌.కె. మోహన్‌రావు చూపిన ప్రామాణికాలు ప్రతి ఒక్కరిలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాయనడంలో సందేహం లేదు. ఆర్భాట ప్రచారాలు, పిడివాదం వంటి వాటితో బ్రహ్మనాయుడు అప్పట్లోనే గ్లోబల్‌ ప్రచారాలు అనే పదావికి నాంది పలికాడన్న మదిలో కలుగక తప్పదు. పల్నాటి చరిత్రపై పలువురు కవులు చరిత్రకారులు రచించారు. అందులో నూటికి తొంబైమంది మంత్రి బ్రహ్మనాయుని కీర్తించే దిశలో నాగమ్మ వర్గాన్ని చిన్నచూపు చూడడమే కాకుండా ప్రతి నాయకగా చూపడంలో పోటీపడ్డారని చెప్పక తప్పదు. 11వ శతాబ్ధకాలంలో ఆనాటి సామాజిక పరిస్థితుల్లో సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఒక సాధారణ స్త్రీ అందునా బాల వితంతువు. మంత్రిస్థాయికి ఎదగడం, వ్యూహాలు, ప్రతివ్యూహాలతో సమర్ధపాలన యుద్ధనైపుణ్యాలతో స్త్రీజాతికే మణిదీపంలా బాసించింది. పల్నాటి చరిత్రలో వెలుగుచూడని అంశాలెన్నో వున్నాయి. చరిత్రలోని అంశాలను తమకు అనుగుణంగా మార్చుకోవడం కోసం ఏకంగా ప్రచారానికి వీర విద్యావంతుల పేరిట బ్రహ్మనాయుడు బృహత్తర ప్రచారశాఖనే ప్రారంభించారు. అలాగే మహిమలు, మహత్యాలు ఆవిష్కరించేలా కారంపూడిలో ఒక వీరాచార పీఠాన్ని ఏర్పరిచారు. అది కొనసాగేందుకు భారీగా భూసంతర్పణలు చేసారు. ఆనాటి శైవ వైష్ణవ మతాల మధ్య వైరుధ్యాలను తన రాజకీయంలో పాచికలు చేసుకున్నాడని నిరూపించడంలో రచయిత సఫలీకృతులయ్యారు. అనుగురాజు హత్యపై అల్లిన అవతారగాధ, పల్నాడును ముక్కలు చేసిన స్వార్ధచింతన, కోడిపోరు, వ్యూహా ప్రతివ్యూహాలు, కోడిపోరు ఓటమి నిబంధనలను తుంగలో తొక్కుతూ మండాది అడువుల్లో అరణ్యవాసం చేయడం, మందపోరులో పల్టీడుచు మట్టుపెట్టడం రాయబారిగా అల రాజును పంపడం వంటి బ్రహ్మనాయుని చర్యల వెనుక అతని పెద్దరికాన్ని సైతం ప్రశ్నించే నిజాలే దాగిఉన్నాయి. ధర్మం నాయకురాలి వైపు ఉందని బ్రహ్మన అనుచరులైన గోసంగులు అనడం ఇందుకు తార్కాణంగా పేర్కొనవచ్చు. బ్రహ్మనాయుడి యుద్ధాన్మాదమే పల్నాడను పీనుగుల గుట్టగా మార్చడానికి దారితీసింది. తుకు పరాజయాన్ని కూడా తన విజయంగా ప్రచారం చేసుకున్న బ్రహ్మన్న వర్గ ప్రచారాన్ని సశాస్త్రీయంగా సాక్ష్యా ధారాలతో గ్రంధకర్త ఆవిష్కరించ గలిగారు. ఇందుకోసం లెక్కకు మించిన గ్రంధాలను ఆశ్రయించారు. శ్రీనాధ మహాకవి వీరోచితమైన పలనాటి వీరచరిత్ర మొదలు చిట్టిబాబు 'పల్నాటి మహాభారతం' పింగళి లక్ష్మీకాంతం, పల్నాటి వీరచరిత్ర, చిలుకూరి వీరభద్రకవి నాయకురాలి దర్బం, ఆండ్ర శేషగిరిరావు ఆంధ్రనారీమణలు కపిలవాయి లింగమూర్తి, లల్లాదేవి నాయకురాలు డా||బి.ఎస్‌.ఎల్‌. హనుమంతరావు, ఆంధ్రుల చరిత్ర డా||తంగిరాల వెంకటసుబ్బారావు, తెలుగు వీరగాధా కవిత్వం-పల్నాటి వీరకధాచక్రం' గుర్రం చరిత్ర, వినుకొండ వల్లభరాయుడు క్రీడాబిరామం వంటి గ్రంధాలోని పలు అంశాలను ఆధారాలుగా చూపారు. విదేశీ చరిత్రకారుడు పి.డి.ఆచారి పల్నాటి వీరచరిత్ర స్వర్ణవాచస్పతి హైహయ రాజుల పాలనలో పల్నాటి చరిత్ర, వినుకొండ వల్లభరాయుడు క్రీడాభి రామం వంటి గ్రంధాలలోని పలు అంశాలను రచయిత ఆధారాలుగా చూపారు.

దేశ విదేశీ చరిత్రకారులతోపాటు శాసనాలు, సాహిత్యం, జానపాద గాధల నుండి సమాచారాన్ని సేకరించి విశ్లేషణ చేయటం ద్వారా పల్నాటి చరిత్రను సరికొత్త కోణంలో ఆవిష్కరించటంలో రచయిత వై.హెచ్‌.కె. సఫలీకృత మయ్యారు. రచయిత వై.హెచ్‌.కె.మోహన్‌రావు పల్నాడు రచయితల సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. పిడుగురాళ్ళలోని 11-61/3, జె.పి.రోడ్డు, గుంటూరు జిల్లా చిరు నామాలో నాయకురాలు నాగమ్మ పుస్తకాలు లభిస్తాయని తెలిపారు. ఈ పుస్తకంపై ఆసక్తి ఉన్నవారు ఫోన్‌నెంబర్‌ 9440154114లో సంప్రదించవచ్చునని వై.హెచ్‌.కె.మోహన్‌రావు తెలిపారు.

రసవత్తరం.. కమనీయం.. కల్లిపాడు


రసవత్తరం.. కమనీయం.. కల్లిపాడు
 ప్రపంచ చరిత్ర కలిగిన పల్నాటి వీరుల మహోత్సవాల్లో ఐదురోజు మంగళవారం కల్లిపాడు రసవత్తరంగా, కమనీయంగా జరిగింది. పల్నాటి యుద్ధంలో గోవుల మందకు కాపరిగా ఉన్న లంకన్నకు బ్రహ్మనాయుడు ప్రాణాభిక్ష పెట్టేఘట్టం జరిగింది. యుద్ధంలో మృతులైన వీరనాయుకులు గుర్తుకు వచ్చి బ్రహ్మనాయుడు గుత్తికొండ బిలం వెళ్తూ యుద్ధంలో మృతిచెందిన వారికి పిండప్రదానం చేస్తాడు. ప్రతి ఏటా మృతులను స్మరించుకోవాలని బ్రహ్మనాయుడు పిడుగు వంశీయులైన బ్రాహ్మణులను పీఠాధిపతులుగా నియమిస్తాడు. రక్తం కలిపిన అన్నపు ముద్దలను పోతురాజు గుట్ట వద్ద ఆకాశంలోకి పీఠాధిపతి ఏగురవేస్తాడు. ఆ ముద్దలను శక్తులు (్ధరులు) స్వీకరిస్తారు. వీరనాయుకులు వాడిన ఆయుధాలను ఉరేగింపుచేసి నాగులేరులో స్నానమాచరించిన తరువాత బ్రహ్మనాయుడు ఇచ్చిన తీర్థం పుచ్చుకుని పోతురాజుగుట్ట వద్ద ధీరులు వరిగిపోతారు. 900 సంవత్సరాల నుండి అనవాయితీగా జరుగుతున్న పల్నాటి వీరుల మహోత్సవాలకు వీరాచారవంతులు తరలివచ్చారు. పల్నాటి చరిత్రను కథలుగా వీరాచారవంతులు వివరించారు. ఐదురోజుల నుండి కారంపూడిలో జరిగిన పల్నాటి వీరుల మహోత్సవాలకు 11జిల్లాల నుండి వీరాచారవంతులు, పల్నాడు ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ రమేష్‌బాబు అధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాలను పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ అయ్యవారు, నిర్వాహకులు విజయ్ ఘనంగా నిర్వహించారు.

‘నాయకురాలు నాగమ్మ’ యదార్థ వృత్తాంతంపై ’ ప్రత్యేక కథనం.

‘నాయకురాలు నాగమ్మ’ యదార్థ వృత్తాంతంపై ’ ప్రత్యేక కథనం.
telanganabidda
అధికార దాహంతో అన్యాయంగా హత్యలు చేసిన బ్రహ్మనాయుకుడు, బాలచంవూదులనే సీమాంవూధులు పల్నాటి వీరులుగా ప్రచారంలోకి తెచ్చారన్న సత్యం చరివూతను తవ్వితే కానీ తేటతెల్లం కాదు. సుమారు వెయ్యేళ్ల కిందట యావత్ భరత ఖండంలోనే తొలి మహామంవూతిణిగా వెలుగొందిన వీరనారి మన నాగమ్మ. కొందరు చరివూతవూదోహుల పుణ్యమా అని ఆమె ఒక యుద్ధోన్మాదిగా ప్రపంచానికి పరిచయం కావడం బాధాకరం. నాగమ్మ- బ్రహ్మనాయుడుల మధ్య జరిగిన పోరాట నేపథ్యం తెలిస్తే అసలు ద్రోహులు బయటపడతారు.


నాగమ్మ పుట్టినిల్లు కరీంనగర్ జిల్లాలోని పెగడపల్లి మండలం ఆర అక్కడ ఇప్పటికీ ఒక ఇంటిని నాగమ్మ గుడిగా స్థానికులు భావిస్తారు. ఆమె వారి గుండెల్లో కొలువుదీరి ఒక గ్రామదేవతలా నిత్యపూజలందుకుంటుంటే చిత్రంగా ఆమె మెట్టినింటి ఆంధ్రాలో తననొక యుద్ధోన్మాదిలా భావించే పరిస్థితులు ఉన్నాయి. సీమాంవూధులు రాసిన చరిత్ర పుస్తకాల్లోనేకాదు, వారు తీసిన సినిమాల్లోనూ నాగమ్మ వ్యక్తిత్వాన్ని వారు ఇదేలా అవమానించారు. ఏకంగా ఓ రక్తం రుచి మరిగిన రాక్షసిలా చిత్రీకరించారు. ఎందుకిలా జరిగింది..? తెలంగాణ దైవం ఆంధ్రాలో దెయ్యంలా ఎందుకు మారిపోయింది? కట్టు కథే చెలామణి అయి, అసలు చరిత్ర ఎందుకు మరుగునపడి పోయింది? చర్రిత లోతుల్లోకి వెళితే అసలైన, ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.

అది 12వ శతాబ్దం...
క్రీ.శ. 1176-2 మధ్య కాలం (12వ శతాబ్ది)లో జరిగినట్లుగా భావిస్తున్న ‘పల్నాటియుద్ధం’ గురించి తెలియని వారుండరు. సినిమాల పుణ్యమాని అది మరింత జనంలోకి వెళ్లింది. కానీ, అందులో నాగమ్మ, వ్యక్తిత్వం గురించిన వక్రీకరణలే అభ్యంతరకరంగా ఉన్నాయి.

ఆ యుద్ధంలో నిజానికి అసలైన విజేత మన నాయకురాలు నాగమ్మ. ఇది చారివూతక సత్యం. ఈ మానవతా మూర్తిది కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం ఆర అసలు నాగమ్మ ఆర నుంచి పల్నాడు చేరడమే ఒక విశేషమైతే, తన అసాధారణ ప్రతిభా పాటవాలతో అక్కడి రాజాస్థానంలో మంత్రి కావడం, ప్రజారంజకంగా పరిపాలించి, తన జీవితాంతం శాంతి కోసం పరితపించడం, చివరకు సర్వం త్యజించి, తన మూలాలు వెతుక్కుంటూ పుట్టినూరికే చేరుకోవడం, స్థానికుల దృష్టిలో ఒక ‘దేవత’లా పూజలందుకోవడం- ఇవన్నీ కనుమరుగై ఉన్న కఠిన సత్యాలు.

aravelly
ఆమె వాస్తవ కథను కొందరు సీమాంధ్ర కవులు, రచయితలు, చరివూతకారులు వక్రీకరించడమే అసలు విషాదం. నమ్ముకున్న ప్రజలకు ప్రేమామృతం పంచిన మానవతామూర్తి నాగమ్మను యుద్ధోన్మాదిలా చిత్రీకరించడం వెనుక పెద్ద కుట్రే జరిగిందన్న విమర్శలు వున్నాయి. నాడు సైతం రాజ్యమేలిన ప్రాంతీయ విద్వేషమే నాగమ్మను దుర్మార్గురాలిగా చిత్రీకరించేందుకు కారణమైందనిపిస్తోంది. దీనికి పురుషాధిక్య భావజాలమూ తోడైందని పరిశీలకులు అంటున్నారు.

నాటి పల్నాడులో ఏం జరిగింది?
నాగమ్మ నాయకురాలుగా ఎదగడానికి ముందు మన తెలంగాణలో పుట్టిన ఒక సాధారణ రైతు ఆడబిడ్డ. ప్రస్తుత కరీంనగర్ జిల్లాలోని ఆర ఆమె జన్మించింది. తండ్రి రామిడ్డి. నాగమ్మ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. దీంతో కరువు కాటకాల కారణంగా రామిడ్డి తన ఏడేళ్ల కూతురు నాగమ్మను తీసుకొని పల్నాడు (నేటి గుంటూరు జిల్లా) రాజ్యంలోని జిట్టగామాలపాడులోని తన బావమరది మేకపోతు జగ్గాడ్డి వద్దకు వలస వెళ్లాడు. అక్కడే భూములు కొని మోతుబరి రైతుగా స్థిరపడ్డాడు. తన దాతృత్వగుణంతో అతను చుట్టు పక్కల గ్రామాల్లో మంచి పేరు సంపాదించాడు. తన ఏకైక కూతురు నాగమ్మను కొడుకులా చూసుకుంటూ గోపన్న అనే గురువును నియమించి, చదువుతో పాటు గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, ధనుర్విద్యలో శిక్షణ ఇప్పించాడు.

నాగమ్మ తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. తత్త్వ, రాజనీతి శాస్త్రాలను అధ్యయనం చేసింది. అనంతరం ఆమెను జగ్గాడ్డి కొడుకు సింగాడ్డికిచ్చి పెళ్లి చేయగా, మూడు రోజులకే భర్త మృత్యువాత పడ్డాడు. ఆ సమయంలో పల్నాడును అనుగురాజు పరిపాలిస్తున్నాడు. ఆయన మంత్రి దొడ్డనాయుడు. పల్నాడులో రాజులు నామమావూతులు, కాగా పరిపాలనంతా మంత్రుల కనుసన్నల్లో, వారి ఆదేశానుసారం జరిగేది.

ఈ క్రమంలో రామిడ్డి పొలంలో దొడ్డనాయుడు అక్రమంగా చెరువు నిర్మాణం తలపెడ్తాడు. ఈ ప్రయత్నాన్ని రామిడ్డి, జగ్గాడ్డి అడ్డుకోగా అప్పుడు జరిగిన ఘర్షణలో జగ్గాడ్డి ప్రాణాలు కోల్పోయాడు. వారు అంతటితో ఊరుకుంటే పోయేది. కానీ, అలాకాక ఇంకా ఆగ్రహం అణచుకోలేక దొడ్డనాయుడి రెండో కొడుకు బ్రహ్మనాయుడు రామిడ్డిని సైతం కిరాతకంగా హతమారుస్తాడు. ఇలా యుక్తవయస్సు నాటికే తండ్రినీ, నిలువ నీడ నిచ్చిన మేనమామను, (అప్పటికే) భర్తను కోల్పోయిన నాగమ్మ గుండెను రాయి చేసుకుని బతుకీడ్చింది.

స్థానికుల తలలో నాలుకలా మెలగుతూ, వారి మధ్య తగాదాలు పరిష్కరిస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందింది. ఓ రోజు నల్లమల అడవుల్లో వేటకు వెళ్లిన అనుగురాజు, ఆయన సేన, పరివారం తిరుగు పయనమైనారు. నాగమ్మ వారికి స్వయంగా జిట్టగామాలపాడులో సేద దీరేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. తాగునీరు, భోజన వసతి కల్పించింది. అనుగురాజు ఆనందించి, ఏదైనా వరం కోరుకోమన్నాడు. ‘ప్రజల కోసం ఏదైనా చేయవచ్చనే ఉద్దేశ్యం’తో ‘ఏడు ఘడియలపాటు మంత్రి పదవి ఇమ్మని’ అడుగుతుంది. ‘సరేనన్న’ అనుగురాజు నాగమ్మకు ఇష్టమైన సమయంలో మంత్రి పదవి స్వీకరించే అవకాశం కల్పిస్తూ ‘రాజపత్రం’ రాసి ఇచ్చి వెళ్తాడు.

పల్నాడుపై కన్నేసిన బ్రహ్మనాయుడు
ఎలాగైనా పల్నాడు రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్న బ్రహ్మనాయుడు, తన కుట్రలో భాగంగానే, అదును చూసి అనుగురాజును, అడ్డొచ్చిన కన్నతండ్రి మంత్రి దొడ్డనాయుడినీ దారుణంగా హతమారుస్తాడు. వాస్తవాలు తెలిసి పల్నాడు ప్రజలు బ్రహ్మనాయుడిపై తిరగబడతారు. అనుగురాజు ఏడుగురు కొడుకుల్లో పెద్దవాడైన నలగామరాజు(అప్పటి కతడి వయస్సు 13 ఏళ్లు)ను సింహాసనంపై కూర్చోబెట్టి అన్నీ తానై రాజ్యపాలన చేస్తుంటాడు.

బ్రహ్మనాయుని దురాగతలు అంతటితో ఆగలేదు. రాజాస్థానాన్ని తన అనుయాయులతో నింపి, ఖజానాను కొల్లగొడుతుంటాడు. నలగామరాజునూ, పల్నాటి ప్రజలను రక్షించాలనే ఉద్దేశ్యంతో నాగమ్మ రంగ ప్రవేశం చేస్తుంది. అలా మొదలవుతుంది అసలు పోరాటం. అనుగురాజు రాసిచ్చిన రాజపవూతంతో వచ్చి, ఏడు ఘడియల మంత్రి పదవిని అడుగుతుంది. బ్రహ్మనాయుడికి ఇష్టం లేకపోయినా తన తండ్రి మాటను నెరవేర్చాల్సిందేనని నలగామరాజు పట్టుబట్టడంతో అతడు ఒప్పుకోక తప్పలేదు. అలా మంత్రి పదవిని దక్కించుకున్న నాగమ్మ, తనకున్న అపారమైన తెలివితేటలు, తాత్కాలిక మంత్రిగా వచ్చిన అధికారాలతో అంతఃపుర దొంగల ఆటకట్టిస్తుంది.

బ్రహ్మనాయుడి నేతృత్వంలో అతడి అనుయాయులు కొట్టేసి, నేలమాళిగల్లో దాచిన సొత్తునంతా అణా పైసాతో సహా తిరిగి ఖజానాకు చేరుస్తుంది. తనకు తెలియకుండా తన ఆస్థానంలో జరిగిన ఈ చీకటి కోణానికి బ్రహ్మనాయుడే సూత్రధారుడని తెలుసుకున్న నలగాముడు, అతడిని మంత్రి పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో నాగమ్మనే శాశ్వత మంత్రిణిగా నియమిస్తాడు. నాగమ్మ మేథస్సు, కార్యదక్షత, అచంచల రాజభక్తికి ఈ సంఘటనే తార్కాణం.

నాగమ్మ ఇక వెనుదిరిగి చూడలేదు. అత్యంత సాహసోపేత నిర్ణయాలతో, ప్రజారంజకంగా పల్నాడును పాలించినట్లు చారివూతక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఆమె కాలంలో పల్నాడు చుట్టుపక్కల ఉన్న అనేక దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపడ్డట్లు శ్రీనాథ కవి రాసిన ‘పలనాటి వీరచరిత్ర’ స్పష్టంగా చెబుతోంది.

రెండు ముక్కలైన రాజ్యం
కోల్పోయిన మంత్రి పదవిని దక్కించుకునేందుకు బ్రహ్మనాయుడు పల్నాడును రెండు ముక్కలు చేయడానికే కుట్ర పన్నుతాడు. అనుగురాజుకు ముగ్గురు భార్యలు కాగా, అందులో చివరిదైన మైలమదేవికి పుట్టింటి భరణంగా వచ్చిందే పల్నాడు. అందులోనూ అనుగురాజు ఏడుగురు కొడుకుల్లో మైలమదేవికి పుట్టిన నలగామరాజే పెద్దవాడు. కనుక న్యాయంగా రాజ్యం నలగామరాజుకే చెందాలి. కానీ, ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని అనుగురాజు మొదటి భార్య వీరవిద్యలదేవిని రెచ్చగొట్టి, రాజ్యంలో వాటా కోరుతాడు. ఇది ఏ మాత్రం న్యాయసమ్మతం కాకపోయినా నాగమ్మ, నలగామరాజుల మంచితనంతో బ్రహ్మనాయుడి కోరిక నెరవేరుతుంది.

పల్నాడు కాస్తా గురజాల, మాచర్లగా విడిపోతుంది. అలా మాచర్ల రాజ్యం వీరవిద్యలదేవి పెద్ద కొడుకు పెదమలి దేవుడికి వస్తుంది. అక్కడ మంత్రి పదవి దక్కించుకున్న బ్రహ్మనాయుడు, ఆ బాలుడి పేరుతో రాజ్యపాలనను తన చెప్పు చేతుల్లోకి తీసుకుంటాడు. ప్రముఖ సీమాంధ్ర చరివూతకారుడు డా॥ బీఎస్‌ఎల్ హనుమంతరావు ‘‘హైహయ వంశాన్ని (అనుగురాజుది) రూపుమాపి తన వంశాన్ని నెలకొల్పడమే బ్రహ్మన్న ఆశయం. ఇది గ్రహించిన నాగమ్మ గురజాల- మాచర్ల సమైక్యానికి తుదికంటా ప్రయత్నించింది’’ అని తన ‘ఆంవూధుల చరిత్ర’ పుస్తకంలో రాయడం ఇక్కడ గమనార్హం.

తాను దైవాంశ సంభూతుడననీ, తనది విష్ణు అంశ అని తరచూ చెప్పుకునే బ్రహ్మనాయుడు, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, తన వైరిపక్షానికి చెందిన నాగమ్మను దుర్మార్గురాలిగా చిత్రీకరించేందుకు కుట్ర పన్నాడు. ‘వీరవిద్యా వంతులు’ (మహారాణి) పేరుతో ఓ వర్గాన్ని ఏర్పాటు చేశాడు. వీళ్లు బ్రహ్మనాయుడికి లేని గొప్పలు ఆపాదిస్తూ, కల్పనలు జోడిస్తూ, నాగమ్మను దుష్టురాలిగా చూపుతూ తమ గేయగాథల ద్వారా మాచర్ల, చుట్టుపక్కల రాజ్యాల్లో విచ్చలవిడి ప్రచారానికి దిగారు. నేటికీ వంశపారంపర్యంగా ఈ వృత్తిని నిర్వహిస్తున్న వారున్నారు.

కోడి పందెం దురాలోచన
ఎలాగైనా పలనాడును దక్కించుకోవాలనే దురాలోచనతో బ్రహ్మనాయుడు కోడిపందాన్ని తెరపైకి తెస్తాడు. నానా తంటాలు పడి నలగామరాజును, పెదమలిదేవుడినీ ఇందుకు ఒప్పిస్తాడు. పందెంలోఓడినవారు రాజ్యాన్ని వదిలి, ఏడేళ్లు అరణ్యవాసం చేయాలనేది నిబంధన. అయితే, బ్రహ్మనాయుడు తలచిందొకటి కాగా జరిగింది మరొకటి.

నాగమ్మ చేతిలో చిత్తుగా ఓడిన బ్రహ్మనాయుడు అవమానభారంతో వెనుదిరుగుతాడు. ‘నాగమ్మ మంత్రతంవూతాలతో కోడిపందెం నెగ్గిందంటూ’ దుష్ర్పచారానికి దిగుతాడు. ఆ తర్వాత ఒప్పందాన్ని తుంగలో తొక్కుతాడు. అరణ్యవాసం చేయకుండా మాచర్లలోనే ఉండి కప్పం చెల్లిస్తానని కాళ్లబేరానికి దిగుతాడు. ఆ తర్వాత దానినీ నిలిపేసి, కయ్యానికి కాలు దువ్వుతాడు. నాగమ్మ సేనల చేతిలో చిన్నపాటి యుద్ధంలో ఒకసారి ఓటమి చవి చూశాక, కేవలం మూడేళ్లే వనవాసం చేసి, తమ రాజ్యం తమ కివ్వమని పెదమలిదేవుడి అల్లుడు అలరాజును దూతగా పంపుతాడు.

‘తెలివైన అలరాజు బతికుంటే ఎప్పటికైనా తనకు ప్రమాదమని’ అతని హత్యకే కుట్ర పన్నుతాడు. రాయబారానికి వెళ్లి తిరిగి వస్తున్న ఆ రాజును దారుణంగా హతమార్చి నేరాన్ని నాగమ్మపైకి నెడుతాడు. ఇలా పరిస్థితి కాస్తా యుద్ధానికి దారి తీయడంతో గెలిచే అవకాశమున్నా పెద్ద మనస్సు చేసుకున్న నాగమ్మ, మాచర్లను బ్రహ్మన్న వర్గానికే అప్పగించేందుకు సమ్మతిస్తుంది. కానీ, బ్రహ్మనాయుడి కొడుకు బాలచంవూదుడి దురుసు ప్రవర్తనతో సంధి కాస్తా విచ్ఛిన్నమవుతుంది.

రెండు రాజ్యాల మధ్య గల కార్యమపూడి (కారంపూడి) వద్ద యుద్ధం జరుగుతుంది. అశ్వరూఢియైన నాగమ్మ స్వయంగా యుద్ధంలో పాల్గొని బ్రహ్మనాయుడిని హత మారుస్తుంది. ఈ సందర్భానికి సంబంధించి ‘శీలం బ్రహ్మనాయుడు ఒఱుగు’ అని శ్రీనాథుడి పల్నాటి వీరచరిత్ర పుస్తకంలో (ఈ రాతవూపతులు తిరుపతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంతోపాటు మద్రాసు ప్రాచ్యలిఖిత భాండాగారంలోనూ ఉన్నాయి) స్పష్టంగా ఉన్నా, చాలామంది సీమాంధ్ర కవులు, రచయితలు, చరివూతకారులు మాత్రం బ్రహ్మనాయుడు, తాను స్త్రీతో యుద్ధం చేయలేక, నాయకురాలిని క్షమించి, ప్రాణభిక్ష పెట్టాడని రాశారు. నలగామరాజుపై కరుణ జూపి, రాజ్యాన్ని అతడికే అప్పగించి, గుత్తికొండ బిలంలో తపస్సు చేసుకునేందుకు వెళ్లినట్లు చిత్రీకరించారు.
ఈ ‘పల్నాటి యుద్ధం’పై వచ్చిన రెండు చలన చిత్రాల్లోనూ (1947లో ఒకటి, 1967లో మరొకటి) ఇదే వక్రీకరణ జరిగింది. బ్రహ్మనాయుడిని హీరోగా, నాగమ్మను విలన్‌గా చూపి, అసలు చరివూతకే వక్రభాష్యం చెప్పారు.

300 ఏళ్లు గేయగాథ రూపంలోనే!
‘పల్నాటి వీర చరిత్ర’ నిజానికి 300 ఏళ్లపాటు గేయగాథ రూపంలో ప్రజల నోళ్లలో నానుతూ వచ్చింది. అనంతరం 15వ శతాబ్దంలో మొట్టమొదట శ్రీనాథ కవి సార్వభౌముడు పల్నాటి ప్రాంతమంతా పర్యటించి, జన బాహుళ్యంలో వినపడుతున్న గాథను ‘పలనాటి వీరచరిత్ర’ పేరిట కావ్యీకరించాడు. ఆ మహాకవి ఒక సందర్భంలో నాగమ్మ గురించి..
‘‘రెడ్డీ వారి పడతి యనంగ
ఎలిమి జగ్గాడ్డి వేడుక పుత్రి
మేక పోతుల రెడ్డి మేనకోడలును
ఆర్వెల్లి వారింటి అమరుకోడలును
తరుణి నాగమయను తక్షణమందు’’ అని రాశాడు. ఇందులో నాగమ్మ స్వగ్రామం ఆర ప్రస్తావన ఉంది. ఇలా శ్రీనాథుడి తర్వాత ఇప్పటివరకు అనేక మంది కవులు, రచయితలు, నవలాకారులు ఈ చారివూతక గాథను అనేక విధాలుగా ఆవిష్కరించారు. అయితే వీరిలో ప్రారంభానికి ముందే బ్రహ్మనాయుడి పక్షం వహించినవాళ్లే ఎక్కువ.

సహజంగానే వీరు నాయకురాలిని దుర్మార్గురాలిగా చిత్రీకరించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. నాగమ్మ మహిళ కావడం, వేరే ప్రాంతం నుంచి వలస రావడమే ఇందుకు కారణాలని ఆంధ్ర చరివూతకారులు, మేథావులు కూడా బహిరంగంగా ఒప్పుకున్నారు. కవులు, రచయితలు బ్రహ్మనాయుడికి లేని కీర్తి ఆపాదించే క్రమంలో చేసిన తప్పులే నాయకురాలు ఎంత గొప్పదో లోకానికి తెలియజెప్పాలనుకునే వారికి అస్త్రాలయ్యాయి.

ఐదేళ్లకోసారి నాగమ్మ జాతర 
‘పల్నాటి చరిత్ర’ మొత్తం తిరగేస్తే నాయకురాలు ఏనాడూ పదవి కోసం పాకులాడినట్లు గానీ, యుద్ధోన్మాదిలా గానీ కనిపించదు. శ్రీనాథుడే స్వయంగా చెప్పినట్లు మంత్రిగా ఉండగా, చుట్టుపక్కల దేశాలతో నాగమ్మ నడిపిన దౌత్య సంబంధాలు ఆమె శాంతి కాముకురాలేనన్న విషయాన్ని స్పష్టం చేశాయి. బ్రహ్మన్న కుట్రతో పల్నాడు విచ్ఛిన్నమైనా, కోడి పందెంలో ఓడి, ఒప్పందాలను ఉల్లంఘించినా, అతడి వర్గంతో నాగమ్మ సంధికే సిద్ధమైంది. తాను నిత్యం శాంతి, సౌభ్రాతృత్వాల కోసం తపించినా ఎదుటి పక్షం రక్తపాతాన్నే కోరుకోవడంతో విరాగియై, పల్నాడును వదిలి స్వగ్రామం ఆర చేరింది. శేష జీవితాన్ని ప్రజాసేవలో, దైవ చింతనలో గడిపింది. ఆపదలో ప్రజలకు అండగా నిలిచి, వారికి ఆరాధ్య దైవమైంది. అందుకే నాగమ్మ మరణించి వెయ్యేళ్లవుతున్నా అక్కడి ప్రజలు ఆ ఇంటినే దేవాలయంగా మార్చి ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించి, నిత్యపూజలు చేస్తున్నారు. ఐదేళ్లకోసారి అక్కడ పెద్ద ఎత్తున జాతర కూడా నిర్వహిస్తున్నారు.

కాగా, కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ మలయశ్రీ లాంటి ఒకరిద్దరు రచయితలు తప్ప ఎవరూ నాగమ్మను గురించి రాయలేదు. ఇక మన నేతలు, అధికారులకైతే నాయకురాలి గురించి గానీ, ఆర గురించి గానీ అస్సలు తెలిసినట్టు లేదు. ఈ గ్రామంలోని వందల ఏళ్ల నాటి ‘నాగమ్మ గుడి’ శిథిలావస్థకు చేరుకుంటున్నా పురావస్తు శాఖాధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికైనా తెలంగాణ మేధావులు, చరివూతకారులు, అధికారులు మేలుకోవాలి. ఆర మన నాయకురాలు నాగమ్మ ఆనవాళ్లను రక్షించుకోవాలి.

ఈ ప్రశ్నలకు బదులేది?
- బ్రహ్మనాయుడి తండ్రి దొడ్డనాయుడు నాగమ్మ మేనమామ జగ్గాడ్డినీ, బ్రహ్మనాయుడు ఆమె తండ్రి రామిడ్డిని అతి కిరాతకంగా హతమార్చారని సీమాంధ్ర చరివూతకారులు రాశారు. మరి, ఓ సామాన్య రైతులను అకారణంగా హత్య చేసిన బ్రహ్మనాయుడు హంతకుడు కాకుండా దేవుడెట్లా అయ్యాడు?
- బ్రహ్మనాయుడు సింహాసనానికి నమస్కరించాడట! అప్పుడు సింహాసనం బద్దలై, అందులో ముక్క గుచ్చుకొని అనుగురాజు మరణిస్తాడట! ఇంత అశాస్త్రీయంగా చెప్పేకంటే అధికార దాహంతో బ్రహ్మనాయుడు అనుగురాజును, అడ్డం వచ్చిన దొడ్డనాయుడినీ హతమార్చాడని చెప్పవచ్చు కదా? బ్రహ్మనాయుడు చేసిన హత్యల గురించి ‘ఐబిడ్’ అనే తన పరిశోధనాత్మక గ్రంథంలో ప్రముఖ ఆంగ్ల చరివూతకారుడు సీవెల్ ఇలా పేర్కొన్నాడు.-
Chronical says that Dodda was bothered about his son Brahmanayudu who killed both Dodda (Doddanayudu) and Alugu(Aluguraju)
- ఎక్కడి నుంచో (తెలంగాణ) వచ్చిన నాగమ్మ కుట్రపూరితంగా మంత్రి పదవి దక్కించుకుందని రాశారు. అనుగురాజే ఇష్ట పూర్వకంగా రాజపత్రం రాసిచ్చాడనీ, నలగామరాజు కావాలనే శాశ్వత మంత్రిగా ఉండి పొమ్మన్నాడనీ చెప్పిందీ వాళ్లే! అలాంటప్పుడు నాయకురాలిది కుట్ర ఎలా అవుతుంది?
- నాగమ్మ మంత్రతంవూతాలతో కోడిపందెం నెగ్గిందనడం అశాస్త్రీయమైన ఆరోపణ కాదా?
- కోడి పందెంలో ఓడిపోయిన బ్రహ్మనాయుడు ఒప్పందాన్ని కాలరాసి, వనవాసం చేయకుండా రాజ్యాన్ని అంటి పెట్టుకున్నప్పుడు పెద్దమనస్సుతో క్షమించిన నాగమ్మ యుద్ధోన్మాది ఎట్లా అవుతుంది? మాచర్లను బ్రహ్మనాయుడి పక్షానికే అప్పగించేందుకు నాగమ్మ అంగీకరించినా, బ్రహ్మనాయుడి కొడుకు బాలచంవూదుడి దుందుడుకు చర్యల వల్ల సంధి విచ్ఛిన్నమై, యుద్ధానికి దారి తీస్తే ఆ పాపం నాగమ్మదేనని రాయడం ఎంతవరకు సమంజసం?
- బ్రహ్మనాయుడు, తాను స్త్రీతో యుద్ధం చేయలేక, నాయకురాలిని క్షమించి, ప్రాణభిక్ష పెట్టాడనీ, అన్నీ త్యజించి గుత్తికొండ బిలంలో తపస్సు చేసుకునేందుకు వెళ్లాడనీ రాశారు. మరి తొలికావ్యం ‘పల్నాటి వీరచరిత్ర’లో ‘శీలం బ్రహ్మనాయుడి ఒఱుగు’ అని శ్రీనాథుడే రాశాడు కదా. (ఇక్కడ ‘ఒఱుగు’ అంటే ‘మరణించు’ అని అర్థం). బ్రహ్మనాయుడు నాగమ్మ చేతిలో మరణించిన విషయాన్ని జీర్ణించుకోలేక అల్లిన కట్టుకథే ‘క్షమించి వదిలేయడం’. క్షమించి వదిలేస్తే యుద్ధానంతరం పలనాడు రాజ్యానికి నాగమ్మ పక్షానికి చెందిన నలగాముడే రాజెందుకవుతాడు? ఈ మాత్రం తర్కం లేకపోతే ఎట్ల? ఈ ప్రశ్నలన్నింటికీ సదరు సీమాంధ్ర చరివూతకారులే సమాధానం చెప్పాలి.
- తెలంగాణలోని బుడగ జంగాలు చెప్పే కొండవూలాయుడి కథలో నాయకురాలు స్వగ్రామం తిరిగి వచ్చిన ప్రస్తావనా ఉంది.
‘ఏడేండ్ల ప్రాయంల ఎగిరిపోయిన చిలక
యాడుందో ఏమైందో ఎరికలేక పోయెరా
ముసల్దయి వచ్చింది అమ్మోరి తీరునా
అందరినీ పసిగట్టి అడిగించినాది
నాయకురాలై నడిపించినాది...’-
- నాగమ్మ తెలంగాణలో పుట్టి, పల్నాడుకు వలసవచ్చి మంత్రిగా ఎదిగిందనీ, యుద్ధం తర్వాత తిరిగి స్వగ్రామం ఆర వెళ్లిపోయిందని సీమాంధ్ర చరివూతకారులు, పరిశోధకులే ధ్రువీకరించారు. డా॥ కలవల వెంకట సుబ్బారావు, తన ‘భక్తి పలనాటి వీర చరివూత’లో, డా॥ తంగిరాల సుబ్బారావు తన ‘పల్నాటి వీర కథాచక్షికం’లో ‘నాయకురాలు నాగమ్మది కరీంనగర్ జిల్లాలోని పెగడపల్లి మండలం ఆర గ్రామమని’ రాశారు. గురజాలకు చెందిన గుర్రం చెన్నాడ్డి నాగమ్మ జాడను వెతుకుతూ స్వయంగా ఆర వచ్చి, ఆమె తెలంగాణ బిడ్డేనని నిగ్గు తేల్చాడు. 1992లో వెలువరించిన తన పరిశోధనా గ్రంథం ‘పలనాటి చరివూత’లో నాగమ్మ పుట్టుపూర్వోత్తరాలను ఆయన పొందుపరిచారు.

v మరో పరిశోధకుడు వై.హెచ్.కె. మోహన్‌రావు కూడా ‘చరిత్ర దాచిన పల్నాటి ప్రామాణిక దర్పణం-తొలి మహా మంత్రిణి నాయకురాలు నాగమ్మ’ అనే పుస్తకంలో నాగమ్మ జన్మస్థలం కరీంనగర్ జిల్లా ఆర అని నిరూపించారు. తెలంగాణలోని బుడగజంగాల కథల్లోనూ ఈ మేరకు స్పష్టంగా ఉన్నా ఎందుకో కొందరు రచయితలు, చరివూతకారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. 
~ చిల్ల మల్లేశం,టీన్యూస్ ప్రతినిధి, కరీంనగర్